ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రయోగశీలురైన రైతు శాస్త్రవేత్తలు చాలాకాలంగా ఆచరిస్తూ వస్తున్నారు. సత్ఫలితాలు సాధిస్తున్న ప్రకృతి వ్యవసాయదారుల అనుభవాలను చూసి తోటి రైతులు నేర్చుకుంటూ వచ్చారు. మొదట్లో సంశయించిన ప్రభుత్వమే తదనంతరం ప్రకృతి వ్యవసాయం బహుముఖ ప్రయోజకత్వాన్ని గుర్తించి కొన్నేళ్లుగా ప్రోత్సహిస్తోంది. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్‌ఎంఎన్‌ఎఫ్) కూడా అమల్లోకి వచ్చింది.
ఇప్పుడు నియత వ్యవసాయ విద్యలోకి ప్రకృతి వ్యవసాయం చేరింది. దేశంలో 4 యూనివర్సిటీల్లో మాత్రమే ఇప్పుడు ఈ కోర్సులు ఉన్నాయి. మరికొన్ని యూనివర్సిటీల్లో ప్రకృతి వ్యవసాయం ఎలెక్టివ్ సబ్జెక్ట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయంలో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పరిశోధన కోర్సులను విధిగా ప్రారంభించాలని సూచిస్తూ భారతీయ వ్యవసా య పరిశోధనా మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జన రల్ ఎం.ఎల్. జాట్ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ హ యాంలో నడుస్తున్న, డీమ్డ్ వ్యవసాయ విశ్వవిద్యా లయాలన్నిటికీ ఇటీవల లేఖ రాశారు.
‘సుస్థిర వ్యవసాయం, రైతుల
సంక్షేమం సాధించే క్రమంలో ప్రకృతి వ్యవసాయం జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆరో డీన్ల కమిటీ సిఫారసులు, జాతీయ విద్యా విధానం 2020 మార్గదర్శకాల ప్రకారం బీఎస్సీ ప్రకృతి సేద్యం కోర్సు పాఠ్యప్రణాళి కను రూపొందించి, ఆమోదించి, అన్ని యూనివర్సిటీలకూ పంపాం. ఇప్పటి కే కొన్ని యూనివర్సిటీలు కోర్సులు ప్రారంభించా యి. మిగతా యూనివర్సిటీలు కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తాయని ఆశిస్తు న్నాను’ అని డా. జాట్ పేర్కొన్నారు.
రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. విపత్తులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులకు, భూమి ఆరోగ్యం పునరు ద్ధరణకు, తక్కువ ఉద్గారాలను వెలువరించే వ్యవ సాయ పద్ధతులకు ఆదరణ పెరుగుతున్నందున ఉన్నత వ్యవసాయ విద్యలో ప్రకృతి సేద్య సంబంధమైన కోర్సుల ప్రాధా న్యం ఏర్పడిందని ఆయన వివరించారు. ప్రకృతి వ్యవసాయ సాంకేతి కతలో నిష్ణాతులైన నవతరం శాస్త్ర వేత్తలు, విస్తరణ సిబ్బంది, ఎంటర్ ప్రెన్యూర్లను తయారు చేసే బృహత్ కార్యంలో విశ్వవిద్యాలయాలన్నీ కీలక పాత్ర పోషిస్తాయని విశ్వసిస్తున్నానని డా. జాట్ పేర్కొ న్నారు. ఈ విషయంలో ఐసీఏఆర్ అన్నివిధాలా సహకారం అందిస్తుందన్నారు.
లాభదాయకతే గీటురాయి చెయ్యాలి
ప్రకృతి వ్యవసాయంలో ఉన్నత విద్యాకోర్సులు ప్రారంభించమని ఐసీఏఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాలను కోరటం సంతోషదాయకమని ప్రముఖ వ్యవసాయ నిపుణులు డాక్టర్ దేవేంద్ర శర్మ హర్షం వ్యక్తం చేశారు. అయితే, అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు ఆఖరి సంవత్సరం కరిక్యులంలో భాగంగా విద్యార్థులు చేపట్టే ఫీల్డ్ వర్క్‌ను కేవలం లాంఛనప్రాయంగా మిగల్చ కూడదు. ఫీల్డ్ వర్క్‌లో భాగంగా స్వయంగా ప్రకృతి వ్యవసాయం ఆచరించి, అందులో లాభదాయకతను నిరూపించుకున్న విద్యార్థులకు మాత్రమే డిగ్రీని ప్రదానం చెయ్యటం ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన సూచించారు.


