మెట్లపై నడుస్తూ ఫోన్‌ మాట్లాడుతున్నారా..? కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్.. | Shashi Tharoor tripping on stairs sparked a neurologists warning | Sakshi
Sakshi News home page

మెట్లపై నడుస్తూ ఫోన్‌ మాట్లాడుతున్నారా..? కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్..

Feb 6 2026 1:15 PM | Updated on Feb 6 2026 1:27 PM

Shashi Tharoor tripping on stairs sparked a neurologists warning

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశి థరూర్‌ పార్లమెంట్‌ వెలుపల మెట్లపై పోన్‌లో మాట్లాడుతూ పడిపోయిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. ఆ ఘటనలో శశి ధరూర్‌కి మడమ ఫ్యాక్చర్‌ అయ్యిందని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు కూడా. అలాగే ఆయన కోలుకున్నాని, ప్రస్తుతం బాగానే ఉన్నట్లు కూడా తెలిపారు. ఇలా మెట్లపై నడుస్తూ..ఫోన్‌ మాట్లాడటం మంచిది కాదని నూర్యాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకేసారి మల్టీటాస్కింగ్‌ని బ్రెయిన్‌ నిర్వహించలేదని హితవు చెప్పారు. ముఖ్యంగా మెట్లపై ఫోన్‌ స్క్రోల్‌ చేస్తూ లేదా మాట్లాడుతూ నడవడం అత్యంత డేంజర్‌ అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది అజాగ్రత్తగా వ్యవహరించడం గురించి కాదని, బ్రెయిన్‌ వర్కింగ్‌పై అవగాహన ఉండటం.. అత్యంత ముఖ్యమని అంటున్నారు న్యూరాలజిస్ట్‌లు. 

మానవ బ్రెయిన్‌ బహుళ పనులు చేయగలదు. కానీ ఒకేసారి అన్ని పనులు చేస్తున్నప్పుడు.. విభజింపబడతాయి. దాంతో మొదటి దానికి ప్రాముఖ్యత ఇచ్చి మరోకటిపై అటెన్షన్‌ పెట్టడంలో విఫలమవుతుంది ఫలితంగా ఆ ప్రభావం మనపై పడుతుందన్నారు. ఇక్కడ మెట్లపై నడుస్తూ ఫోన్‌ చూసినప్పడూ..చూడటంపైనే అంటే కళ్లమీద బ్రెయిన్‌ ఫోకస్‌ ఉండి..నడకపై అటెన్షన్‌ తప్పుతుంది. 

అందులోనూ నేలలా చదునుగా ఉండకుండా స్టెప్స్‌లా ఉంటుంది కాబట్టి పాదం సవ్యంగా పడాలి లేదంటే బ్యాలెన్స్‌ అవ్వలేం. దాంతో ఎప్పుడైత్‌ ఫోన్‌ మాట్లాడుతూ మెట్లు ఎక్కుతామో పడిపోవడం లేదా జారిపడటం జరుగుతంది. దాంతో మెదడు, లేదా శరీరానికి గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. 

అంతేగాదు నిపుణులు ఇలా ఎన్నో సార్లు చేశాను అని తేలిగ్గా కొట్టిపారేయొద్దని హెచ్చరిస్తున్నారు కూడా. సాధ్యమైనంత వరకు ఫోన్‌ మాట్లాడుతూ స్టెప్స్‌పై నడవాలనుకుంటే రైలింగ్‌ని పట్టుకోండి నడకపై దృష్టిపెట్టండని అంటున్నారు. సాధ్యమైనంత వరకు వచ్చిన కాల్‌ పాజ్‌లో పెట్టి..మెట్లపై నుంచి చదునైన నేలపైకి వచ్చేశాక ఫోన్‌ కాల్‌ మాట్లాడితే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

(చదవండి: బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్‌ శిక్షణ..12 గంటల వ్యాయామాలు..)

 

Advertisement
 
Advertisement
Advertisement