స్మార్ట్‌ఫోన్స్ దిగ్గజం ఒప్పో ఇండియా తాజాగా ప్రీమియం రెనో15 సిరీస్ ఫోన్లను ప్రవేశపెట్టింది. రెనో15 ప్రో మినీ, ప్రో, రెనో 15 పేరిట మూడు వేరియంట్లలో ఇవి లభిస్తాయి. ట్రావెల్ ఫొటోగ్రఫీకి మరింత ఉపయోగకరంగా ఉండేలా ప్రో, ప్రో మినీల్లో 20 ఎంపీ కెమెరా, ప్యూర్‌టోన్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఏఐఎడిటింగ్ టూల్స్ మొదలైన ఫీచర్స్ ఉంటాయి.
పరిశ్రమలోనే తొలిసారిగా హోలోఫ్యూజన్ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నట్లు సంస్థ తెలిపింది. వేరియంట్‌ని బట్టి ధర రూ. 45,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఒప్పో ప్యాడ్5 (రేటు రూ. 26,999 నుంచి ప్రారంభం), ఎన్‌కో బడ్స్3 ప్రో+ని (ధర రూ. 2,499) కూడా కంపెనీ ఆవిష్కరించింది.


