స్మార్ట్‌ఫోన్ చేతిలో లేనిదే రోజుగడవని పరిస్థితి. అంత అలవాటైపోయిన మొబైల్ పోగొట్టుకుంటే మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. దాని మీద ఆశలు వదిలేసు కుంటాం. కానీ పోయిందనుకున్న ఫోన్ అనూహ్యంగా మళ్లీ మన చేతికి వస్తే భలే ఆనందంగా ఉంటుంది కదా. సరిగ్గా ఒక మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో ఆమె భావోద్వేగానికి లోనైంది. ఈ ఆసక్తికరమైన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది.
టీవల చెత్తలో దొరికిన 45 లక్షల బంగారం, కార్మికురాలు నిజాయితీగా తిరిగి వచ్చిన వైరల్ అయింది. ఇది కూడా అలాంటి హృదయానికి హత్తుకునే ఘటన లాంటిదే. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ రఘు అహిర్వర్ ఈ మొత్తం ఉదంతానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. దీని ప్రకారం తాను, తన సోదరితో కలిసి గ్రామం నుండి ఇండోర్‌కు ప్రయాణిస్తున్నప్పుడు, సోదరి ఒక మొబైల్‌ను గుర్తించింది. అదృష్టవశాత్తూ అన్‌లాక్‌లోనే ఉంది. దీంతో వారు కాల్‌లిస్ట్‌లోకి వెళ్లి లాస్ట్ కాల్ చేసిన నంబరుకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అహిర్వర్ ఫోన్ పోగొట్టుకున్నమహిళను కలుసుకుని, ఆమెకు ఫోన్‌ను తిరిగి ఇచ్చాడు. దీంతో ఆమె తెగ సంతోష పడిపోయింది. పదే పదే అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అహిర్వర్‌కు బదులుగా, వేరే ఎవరికికైనా దొరికితే తన ఫోన్ తన చేతికి తిరిగి వచ్చేది కాదంటూ భావోద్వేగానికి లోనైంది.
ఫోన్ అన్‌లాక్‌లో ఉండటం చూస్తే పాపం.. వారికి ఫోన్ టెక్నాలజీ గురించి తెలియదని అర్థం అయిపోయిందని, వెంటనే వారికి ఫోర్ చేశామని అహిర్వర్ పేర్కొన్నారు. ‘‘దేవుడు మనకు ఈ మొబైల్ ఇవ్వడం మంచిది" అనే క్యాప్షన్‌తో ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వీడియో నెటిజన్ల ప్రశంసలను దక్కించుకుంది. అతని నిజాయితీ పలువురి హృదయాలను గెలుచుకుంది."ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే, ప్రపంచం మెరుగుపడుతుంది" అని ఒకరు, విలువైన వస్తువులను తిరిగి ఇవ్వడం గ్రేట్ బ్రో అని ఒకరు, "నిజ జీవిత హీరో" అని మరికొందరు వ్యాఖ్యానించడం విశేషం.


