Hyderabad: రికార్డు స్థాయిలో బిర్యానీ ఆర్డర్లు | Hyderabadis Love For Biryani Hits Record Numbers On Food Delivery Apps, 1.75 Crore Biryani Orders In 2025 | Sakshi
Sakshi News home page

Hyderabad: రికార్డు స్థాయిలో బిర్యానీ ఆర్డర్లు

Jan 8 2026 10:39 AM | Updated on Jan 8 2026 11:44 AM

India Biryani Lovers Swiggy Orders record

1.75 కోట్ల బిర్యానీలు బ్రేవ్‌  35 లక్షల దోశలు, 3.3 లక్షల లడ్లు కూడా..  

గత ఏడాది హైదరాబాద్‌ వాసుల ఆరగింపు విశేషాలెన్నో.. 

 ఆహార ప్రియత్వంలో హైదరాబాద్‌ హవా... 

స్విగ్గీ లెక్కల్లో సిటీ రికార్డుల వేట

సాక్షి, హైదరాబాద్‌: భారతదేశపు బిర్యానీ రాజధాని వారీగా నగర వాసుల బిర్యానీ ప్రియత్వం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గత ఏడాది ఏకంగా 1.75 కోట్ల బిర్యానీలు.. అది కూడా కేవలం ఒక్క ఫుడ్‌ డెలివరీ యాప్‌ ద్వారా సరఫరా అయ్యాయంటేనే ఆ విషయం అర్థమవుతుంది. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ గత ఏడాది ఆర్డర్ల డేటా ఆధారంగా చేసిన అధ్యయనం ప్రకారం.. నగరవాసుల ఆరగింపు విశేషాలివీ. 

బిర్యానీ.. అదే కహానీ 
అత్యధిక ఆర్డర్లతో బిర్యానీలు ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాయి. గత ఏడాది మొత్తం 1.75 కోట్ల బిర్యానీలను నగరం ఆర్డర్‌ చేసింది. దేశవ్యాప్తంగా ఆర్డర్‌ చేసిన బిర్యానీలలో ఇది దాదాపు 18% కావడం గమనార్హం. ఇందులో 1.08 లక్షల ఆర్డర్లతో చికెన్‌ బిర్యానీ అగ్రస్థానంలో నిలిచింది. అల్పాహారానికి సంబంధించి.. వెజ్‌ దోశకు మొత్తం 39.9 లక్షలు, ఇడ్లీకి 34 లక్షల ఆర్డర్లు లభించాయి. 

స్వీట్‌ మెమరీ.. స్నాక్‌ థియరీ 
డిసర్ట్స్‌ (తీపి వంటకాలు) ఆరగించడంలోనూ సిటీ తక్కువ ‘తిన’లేదు. నగరం మెచ్చిన స్వీట్‌గా బూందీ లడ్డూలు 3.3 లక్షల ఆర్డర్లను దక్కించుకున్నాయి. దాని తర్వాత వరుసగా చాక్లెట్‌ కేక్, గులాబ్‌ జామూన్లు నిలిచాయి. ఇక కార్యాలయాల్లో కాలక్షేపం కోసమో స్నేహితులతో పిచ్చాపా‘టీ’కోసమో స్నాక్స్‌ కూడా బాగానే ఆరగించారు. సాయంత్రం వేళల్లో (సాయంత్రం 3గంటల నుంచి రాత్రి 7గంటల వరకూ) సిటిజనుల్ని మెప్పించిన స్నాక్స్‌ను గమనిస్తే, 6.8 లక్షల ఆర్డర్లతో చికెన్‌ బర్గర్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత 5.9 లక్షల ఆర్డర్లతో చికెన్‌ ఫ్రై రెండో స్థానంలో నిలిచింది. నగర వాసుల ఆదరణ పొందిన ఇతర స్నాక్‌–టైమ్‌ ఆహారాల్లో చికెన్‌ షవర్మ, వెజ్‌ పిజ్జా, వెజ్‌ పఫ్‌ ఉన్నాయి   

నైట్‌ ఈట్‌.. ఆర్డర్లు హిట్‌... 
చీకటి విందుల్లో కూడా తగ్గేదేలే అంటున్నారు సిటిజనులు. నగరంలో రాత్రి పొద్దుపోయిన తర్వాత (అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుఝామున 2 గంటల మధ్యలో ఇచి్చన ఆర్డర్లలో 6 లక్షల ఆర్డర్లతో చికెన్‌ బిర్యానీ అగ్రస్థానం కాగా, తర్వాత స్థానాలను చికెన్‌ బర్గర్‌ చికెన్‌ షవర్మ సొంతం చేసుకున్నాయి.  

స్పెషల్‌ డే అంటే ‘ఫుడ్డే’... 
భలే మంచి రోజు.. పసందైన రోజూ.. వెరైటీ విందులందే నేటి రోజు.. అని పాడుకుంటున్న సిటిజనులు.. ప్రత్యేక రోజుల్లో సీట్‌ రిజర్వ్‌ చేసుకునేందుకు ముందస్తు బు‘కింగ్స్‌’అయిపోతున్నారు. ఈ యాప్‌ ద్వారా దాదాపు 8,700కు పైగా వ్యాలెంటై¯Œన్స్‌ డే బుకింగులు, మదర్స్‌ డే రోజు 8,323 బుకింగ్స్‌ నమోదు చేసుకోగా, ఫాదర్స్‌ డే రోజు 9,275 బుకింగులను అందుకుంది.  

మరికొన్ని విశేషాలు.. 
నగరంలో ఒక కస్టమర్‌ ఒకేసారి 10 అపోలో ఫిష్, 11 పుట్ట గొడుగుల వేపుడు, 13 ప్లేట్ల కాజూ కోడి రోస్ట్, 42 ప్లేట్ల బిర్యానీలతో భారీ విందు భోజనాన్ని ఆర్డర్‌ చేశారు. 

22.13 లక్షలతో హై–ప్రోటీన్‌ ఆహారపు ఆర్డర్లను ఇచి్చన నగరాల్లో దేశవ్యాప్తంగా మూడో ర్యాంకులో నిలిచింది. 

డైన్‌ అవుట్‌ అనేది నగరంలో సర్వసాధారణంగా మారింది. స్విగ్గీ ద్వారా అత్యధిక ఆదాయం అందుకున్న నగరాల్లో సిటీ మూడో స్థా నం దక్కించుకుంది. ఈ ఒకే ఒక ఫుడ్‌ యాప్‌ ద్వారా డైనర్లు దాదా పు రూ.114.8 కోట్లను అందుకున్నారు. వ్యక్తిగత అత్యధిక బిల్లులకు సంబంధించి రూ.45,721తో నగరం రెండో స్థానంలో నిలిచింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement