జూనియర్ ఎన్టీఆర్‌ సినిమాలో కెమియో రోల్‌.. ఎందుకు చేశానంటే: సిద్ధార్థ్ | Kollywood Hero Siddharth Responds On Cameo Role In Jr Ntr Baadshah Movie | Sakshi
Sakshi News home page

Siddharth: జూనియర్ ఎన్టీఆర్‌ మూవీలో రోల్‌.. ఎందుకు చేశానంటే: సిద్ధార్థ్

Jul 16 2025 4:34 PM | Updated on Jul 16 2025 6:03 PM

Kollywood Hero Siddharth Responds On Cameo Role In Jr Ntr Baadshah Movie

కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ఇటీవలే 3బీహెచ్కే మూవీతో ప్రేక్షకులను అలరించాడు. శ్రీ గణేశ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా బాక్సాఫీస్ ఫర్వాలేదనిపించింది. మూవీలో మీతా రఘునాథ్హీరోయిన్గా మెప్పించింది. చిత్రంలో శరత్ కుమార్, దేవయాని కీలక పాత్రల్లో మెప్పించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

అయితే ఇటీవల ఇంటర్వ్యూకు హాజరైన సిద్ధార్థ్ తెలుగు సినిమాలో కెమియో రోల్చేయడంపై స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్హీరోగా వచ్చిన బాద్షా మూవీలో మీరెందుకు రోల్ చేయాల్సి వచ్చిందని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. తన ఫ్రెండ్అడగడంతోనే రోల్ చేశానని సిద్దార్థ్తెలిపారు. ఏంటండి ఇలా అడిగారు.. ఎన్టీఆర్ సినిమాలో ఒక ఫ్రెండ్అడిగితే ఐదు నిమిషాల రోల్చేశా.. రోల్ చేయడాన్ని చాలా బాగా ఎంజాయ్ చేసినట్లు వెల్లడించారు. అంత పెద్ద హీరో, పెద్ద సినిమాలో.. అది కూడా నా క్యారెక్టర్ పేరు సిద్ధు అని పెడితే ఎందుకు చేయకుండా ఉంటామని బదులిచ్చారు.

కాగా.. తెలుగులో బొమ్మరిల్లు సినిమాతో ఫేమస్ అయిన సిద్ధార్థ్ టాలీవుడ్లో నటించారు. తర్వాత కోలీవుడ్లో చాలా చిత్రాల్లో హీరోగా చేశారు. అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్లోనూ చేస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాకుండా గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు సిద్ధార్థ్. హీరోయిన్ అదితి రావు హైదరీని ఆయన పెళ్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement