breaking news
Baadshah
-
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కెమియో రోల్.. ఎందుకు చేశానంటే: సిద్ధార్థ్
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ ఇటీవలే 3బీహెచ్‌కే మూవీతో ప్రేక్షకులను అలరించాడు. శ్రీ గణేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ఫర్వాలేదనిపించింది. ఈ మూవీలో మీతా రఘునాథ్ హీరోయిన్గా మెప్పించింది. ఈ చిత్రంలో శరత్ కుమార్, దేవయాని కీలక పాత్రల్లో మెప్పించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సిద్ధార్థ్ తెలుగు సినిమాలో కెమియో రోల్ చేయడంపై స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బాద్షా మూవీలో మీరెందుకు ఆ రోల్ చేయాల్సి వచ్చిందని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. తన ఫ్రెండ్ అడగడంతోనే ఆ రోల్ చేశానని సిద్దార్థ్ తెలిపారు. ఏంటండి ఇలా అడిగారు.. ఎన్టీఆర్ సినిమాలో ఒక ఫ్రెండ్ అడిగితే ఐదు నిమిషాల రోల్ చేశా.. ఆ రోల్ చేయడాన్ని చాలా బాగా ఎంజాయ్ చేసినట్లు వెల్లడించారు. అంత పెద్ద హీరో, పెద్ద సినిమాలో.. అది కూడా నా క్యారెక్టర్ పేరు సిద్ధు అని పెడితే ఎందుకు చేయకుండా ఉంటామని బదులిచ్చారు.కాగా.. తెలుగులో బొమ్మరిల్లు సినిమాతో ఫేమస్ అయిన సిద్ధార్థ్ టాలీవుడ్లో నటించారు. ఆ తర్వాత కోలీవుడ్‌లో చాలా చిత్రాల్లో హీరోగా చేశారు. అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్‌లోనూ చేస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాకుండా గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు సిద్ధార్థ్. హీరోయిన్ అదితి రావు హైదరీని ఆయన పెళ్లాడారు. -
జపాన్‌లో బాద్షా హంగామా!
జపాన్‌లో జరగనున్న ఒసాకా ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ‘బాద్షా’ చిత్రం ఎంపికైంది. వచ్చే నెల 7 నుంచి 16 వరకూ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. మన దేశం నుంచి కేవలం రెండు చిత్రాలే ఈ ఫెస్టివల్‌కి ఎంపికయ్యాయి. హిందీ చిత్రం ఒకటి ‘బాగ్ మిల్కా బాగ్’ కాగా, మరొకటి ‘బాద్షా’. ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన ‘బాద్షా’ గత ఏడాది విడుదలైంది. జపాన్‌లో ఎన్టీఆర్‌కు ఈమధ్య కాలంలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ‘బాద్షా’ అక్కడి ఫెస్టివల్‌కి ఎంపిక కావడం విశేషం. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ -‘‘ఒసాకా ఫెస్టివల్‌కి దక్షిణాది నుంచి ఎంపికైన ఏకైక చిత్రం ‘బాద్షా’ కావడం మాకు గర్వకారణంగా ఉంది’’ అని సంతోషం వెలిబుచ్చారు.