జపాన్‌లో బాద్‌షా హంగామా! | NTR's Baadshah to be screened in osaka asian film festival 2014 | Sakshi
Sakshi News home page

జపాన్‌లో బాద్‌షా హంగామా!

Feb 14 2014 11:55 PM | Updated on Sep 2 2017 3:42 AM

జపాన్‌లో బాద్‌షా హంగామా!

జపాన్‌లో బాద్‌షా హంగామా!

జపాన్‌లో జరగనున్న ఒసాకా ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ‘బాద్‌షా’ చిత్రం ఎంపికైంది. వచ్చే నెల 7 నుంచి 16 వరకూ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది.

జపాన్‌లో జరగనున్న ఒసాకా ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ‘బాద్‌షా’ చిత్రం ఎంపికైంది. వచ్చే నెల 7 నుంచి 16 వరకూ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. మన దేశం నుంచి కేవలం రెండు చిత్రాలే ఈ ఫెస్టివల్‌కి ఎంపికయ్యాయి. హిందీ చిత్రం ఒకటి ‘బాగ్ మిల్కా బాగ్’ కాగా, మరొకటి ‘బాద్‌షా’. ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన ‘బాద్‌షా’ గత ఏడాది విడుదలైంది. జపాన్‌లో ఎన్టీఆర్‌కు ఈమధ్య కాలంలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ‘బాద్‌షా’ అక్కడి ఫెస్టివల్‌కి ఎంపిక కావడం విశేషం. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ     -‘‘ఒసాకా ఫెస్టివల్‌కి దక్షిణాది నుంచి ఎంపికైన ఏకైక చిత్రం ‘బాద్‌షా’ కావడం మాకు గర్వకారణంగా ఉంది’’ అని సంతోషం వెలిబుచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement