రామ్‌ చరణ్‌తో త్రివిక్రమ్‌ ప్లాన్‌.. బన్నీనే కారణమా? | Ram Charan to collaborate with director Trivikram for a family entertainer | Sakshi
Sakshi News home page

Trivikram: రామ్‌ చరణ్‌తో మూవీకి త్రివిక్రమ్‌ ప్లాన్‌.. బన్నీనే కారణమా?

Jun 10 2025 8:02 PM | Updated on Jun 10 2025 8:47 PM

Ram Charan to collaborate with director Trivikram for a family entertainer

టాలీవుడ్‌ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం గతేడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా అభిమానులు ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్‌ అనౌన్స్ చేయలేదు. మరోవైపు మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో మూవీ చేస్తున్నారు.

గుంటూరు కారం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో అల్లు అర్జున్, వెంకటేశ్‌తో ఆయన సినిమా చేయనున్నట్లు టాక్ వినిపించింది. అయితే ఇప్పటివరకు అది సాధ్యపడలేదు. తాజాగా త్రివిక్రమ్ తన నెక్ట్స్‌ మూవీ కోసం గ్లోబల్‌ స్టార్‌ రామ్ చరణ్‌తో జతకట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు కాంబోలో ఓ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది ప్రారంభంలో అల్లు అర్జున్‌తో సోషయో ఫాంటసీని చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు త్రివిక్రమ్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌లో అర్జున్ లార్డ్ కార్తికేయ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం జవాన్ డైరెక్టర్‌ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె కనిపించనుంది. ఇప్పుడు బన్నీ అట్లీతో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించడంతో త్రివిక్రమ్ సినిమా గురించి ఎలాంటి అధికారిక అప్‌డేట్ రాలేదు. దీంతో బన్నీతో సినిమా ఇప్పట్లో పట్టలెక్కేలా కనిపించడం లేదు. ఈ గ్యాప్‌లోనే త్రివిక్రమ్.. రామ్ చరణ్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కించనున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చి బాబు సనాతో పెద్ది సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ షెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు  కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement