
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ త్రిష పెళ్లి చేసుకోబోతుందని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే, ఈసారి నిజమనే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ కథనాలు వచ్చాయి. ఈ క్రమంలోనే త్రిష తన సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేసింది. చాలామంది అభిమానులు నా జీవితాన్ని కూడా నిర్ణయించేస్తున్నారు. ఇంకేముంది నా హనీమూన్ షెడ్యూల్ కూడా మీరే ప్లాన్ చేయండి అంటూ ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ గురించి ఆమె ఇలా సరదాగా రియాక్ట్ అయింది.
చండీగఢ్ వ్యాపారవేత్తను త్రిష వివాహం చేసుకోబోతోందంటూ తమిళనాడులో వార్తలు వైరల్ అయ్యాయి. ఇరు కుటుంబ సభ్యులు కూడా ఆమోదం తెలిపారని కూడా పెద్ద ఎత్తున బాలీవుడ్‌లో కూడా ప్రముఖ మీడియా సంస్థలు ప్రకటించాయి. తమిళం, తెలుగు పరిశ్రమలో సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత ఆమె వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ఆ కథనాల్లో పేర్కొన్నారు. చండీగఢ్‌లో ప్రముఖ వ్యాపారవేత్తగా రాణిస్తున్న అతని గురించి వివరాలు పరిమితంగా ఉన్నాయంటూనే రెండు కుటుంబాల మధ్య పరిచయం చాలా సంవత్సరాల నుంచే ఉందంటూ పలు మీడియా సంస్థలు ప్రచురించాయి. దీంతో ఈ రూమర్స్‌పై నిజమనే సంకేతాలు ఇస్తున్నాయని నెటిజన్లు పేర్కొన్నారు. కానీ, తాజాగా త్రిష చేసిన పోస్ట్‌తో అదంతా ఫేక్ అని మరోసారి క్లారిటీ అయింది.
2015లో వరుణ్ మణియన్ అనే బిజినెస్‌మ్యాన్‌తో త్రిషకు నిశ్చితార్థం జరిగింది. కానీ ఆ తర్వాత కొన్నిరోజులకు విబేధాలు రావడంతో పెళ్లి చేసుకోలేదు. మరోవైపు వరుస సినిమాలతో త్రిష బిజీగా ఉంది. చిరంజీవి విశ్వంభరలో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే.