source: X
రంజీ ట్రోఫీ 2026-27లో మధ్యప్రదేశ్ ఆఫ్ స్పిన్నర్ సరాన్ష్ జైన్ చెలరేగిపోతున్నాడు. బిహార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 13 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో విజృంభించిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీశాడు. సరాన్ష్ ధాటికి బిహార్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కుప్పకూలింది. ఫలితంగా మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ 174 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బిహార్ 99 పరుగులకే ఆలౌటైంది. సరాన్ష్ 7, ఆవేశ్ ఖాన్ 2, కుమార్ కార్తీకేయ ఓ వికెట్ పడగొట్టారు. బిహార్ ఇన్నింగ్స్‌లో మంగల్ మహ్రోర్ (42), సూరజ్ కశ్యప్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
అనంతరం మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (407-8 డిక్లేర్) చేసింది. సక్షమ్ పురోహిత్ (132), కెప్టెన్ రజత్ పాటిదార్ (109) సెంచరీతో సత్తా చాటారు.
భారీ ట్రయిల్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బిహార్ ఈసారి కూడా స్వల్ప స్కోర్‌కే (134 ఆలౌట్) కుప్పకూలింది. సరాన్ష్‌తో పాటు కుమార్ కార్తికేయ (2-40), ఆవేశ్ ఖాన్ (1-16) వికెట్లు తీశారు. ఈసారి కూడా బిహార్ ఇన్నింగ్స్‌లో ఇద్దరే రెండంకెల స్కోర్లు చేశారు. ఆయుశ్ లోహారుక (76 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించగా.. స్రమన్ నిగ్రోద్ 23 పరుగులు చేశాడు. మొత్తంగా సరాన్ష్ ధాటికి రెండు ఇన్నింగ్స్‌ల్లో కుప్పకూలిన బిహార్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.
ఇదీ చదవండి: ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన ప్రియాన్షు.. 79 ఏళ్ల రికార్డు బద్దలు


