source: X
పాక్‌లో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లో శ్రీలంక ఫైనల్‌కు చేరింది. ఆతిథ్య జట్టుతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్ బెర్త్ సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ను దిల్షన్ మధుషంక (8.3-1-34-5) చావుదెబ్బ కొట్టాడు. అతడికి సహాన్ అరచ్చిగే (2-24), ఎషాన్ మలింగ (1-8), అషిత ఫెర్నాండో (1-34), దునిత్ వెల్లాలగే (1-4) తోడవ్వడంతో పాక్ జట్టు 25.3 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది.
పాక్ జట్టులో బాబర్ ఆజం (29), హసన్ నవాజ్ (17), అరాఫత్ మిన్హాస్ (10), షాహీన్ అఫ్రిది (15) మినహా ఎవరూ రెండంకెల స్కోర్ సాధించలేదు. ఫకర్ జమాన్ (5), మాజ్ సదాకత్ (8), సాద్ బేగ్ (5), సల్మాన్ అఘా (9), షాదాబ్ ఖాన్ (2), హరీస్ రౌఫ్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను శ్రీలంక ఆడుతూపాడుతూ ఛేదించింది. ఓపెనర్ కమిందు మెండిస్ (62) అజేయ అర్ద శతకంతో లంకను విజయతీరాలకు చేర్చాడు. అవిష్క ఫెర్నాండో (16), కుసాల్ మెండిస్ (8) తక్కువ స్కోర్లకే ఔటైనా, పవన్ రత్నాయకే (23 నాటౌట్) సునాయాస విజయాన్నిందించాడు. ఈ గెలుపుతో శ్రీలంక ఫైనల్‌కు చేరగా.. ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాక్ ఇదివరకే ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. పాక్-శ్రీలంక మధ్య అక్టోబర్ 31న ఫైనల్ జరుగనుంది.
ఇదీ చదవండి: విరాట్ కోహ్లిని వెనక్కునెట్టిన అభిషేక్ శర్మ


