కొలంబో: విద్యుత్ సరఫరా వ్యవస్థ వైఫల్యం చెందడంతో శ్రీలంక దేశవ్యాప్తంగా శనివారం దాదాపు ఏడుగంటలపాటు కరెంట్ సరఫరా ఆగిపోయింది. రాత్రి 7 గంటల తర్వాతే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. గంటలతరబడి కరెంట్ పోవడంతో నీటి సరఫరా, ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిచిపోయాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిస్టమ్ ఫెయిల్యూర్తో ఈ సమస్య తలెత్తిందని దేశ ఇంధన మంత్రి అనురా కరుణతిలక తెలిపారు.
వాస్తవానికి ఈ వైఫల్యానికి కారణాలు ఏమిటనేవి ఇంకా తెలియరాలేదు. శుక్రవారం కొండ ప్రాంతంలోని ఒక జలవిద్యుత్ కేంద్రంలో మొదలైన సమస్య దేశమంతటా వ్యాపించి ఉంటుందని మంత్రి అంచనావేశారు. విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి వచ్చేదాకా గ్రిడ్తో అనుసంధానమైన ఇంటి మీది సౌరవిద్యుత్ వ్యవస్థలను డిస్ కనెక్ట్ చేయాలని మంత్రి సూచించారు.


