కొలంబో: హిందూ మహాసముద్రంలో చిక్కుకుపోయిన 40 మంది ఇరాన్ నావికులకు శ్రీలంక వైద్య సహాయం అందించింది. అనంతరం వారిని టెహ్రాన్‌కు తిరిగి పంపింది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో శ్రీలంక సముద్ర జలాల సమీపంలో కొన్ని నెలలుగా ఇరాన్ నౌకలు నిలిచిపోయాయి. వాటిలో ఆహారం, నీరు, ఇంధనం కొరత ఏర్పడింది. కొన్ని వారాలుగా నావికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరికొందరు అనారో గ్యానికి గురయ్యారు. దీంతో వైద్య సహాయం అందించాలని శ్రీలంక అధికారులకు ఇరాన్ విజ్ఞప్తి చేసింది.
దీంతో శనివారం నాడు 40 మంది నావికులను శ్రీలంక దక్షిణ ఓడరేవు అయి న గాలేకు తీసుకొచ్చింది. ప్రాథమిక వైద్య చికిత్స అనంతరం, ఆదివారం తెల్లవారుజామున శ్రీలంక నుంచి టెహ్రాన్‌కు పంపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తుషార రోడ్రిగో తెలిపారు. అమెరికా ఆంక్షల నేపథ్యంలో శ్రీలంక మొదట వెనుకడుగేసినా, అంతర్జాతీయ చట్టాల ప్రకారం మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించింది. మార్చిలో అమెరికా సబ్‌మెరైన్ దాడిలో ఇరాన్ యుద్ధనౌక మునిగిపోయినప్పుడూ శ్రీలంక నావికాదళం పలువురు ఇరాన్ సైనికులను రక్షించి చికిత్స అందించింది.


