మూడో టీ20.. అర్ష‌దీప్ సింగ్ అరుదైన రికార్డు | Arshdeep-singh-Enters-Elite-List-3rd-Highest-Wicket-Taking-Pacer | Sakshi
Sakshi News home page

మూడో టీ20.. అర్ష‌దీప్ సింగ్ అరుదైన రికార్డు

Oct 27 2026 1:52 PM | Updated on Oct 27 2026 2:27 PM

Arshdeep-singh-Enters-Elite-List-3rd-Highest-Wicket-Taking-Pacer

Photo Credit: BCCI Twitter

టీమిండియా బౌల‌ర్ అర్ష‌దీప్ సింగ్ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. వెల్లింగ్ట‌న్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టిమ్ సీఫెర్ట్‌ను ఔట్ చేయ‌డం ద్వారా అర్ష‌దీప్ 149వ వికెట్‌ ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా టీ20ఐ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో పేస్ బౌలర్‌గా నిలిచాడు. 

ఈ క్ర‌మంలో బ‌హ్రెయిన్‌కు చెందిన రిజ్వాన్ బ‌ట్ ను (148 వికెట్లు) అర్ష‌దీప్‌ అధిగ‌మించ‌డంతో అత‌డు నాలుగో స్థానానికి ప‌డిపోయాడు. తొలి స్థానంలో టిమ్ సౌథీ (న్యూజిలాండ్) 160 వికెట్లు, రెండో స్థానంలో బంగ్లాదేశ్ బౌల‌ర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (163 వికెట్లు) ఉన్నాడు. ఐర్లాండ్ బౌల‌ర్ మార్క్ అడైర్ (142 వికెట్లు) ఐదో స్థానంలో ఉన్నాడు.

ఎడమచేతి వాటం పేసర్ అయిన అర్షదీప్‌ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 150 వికెట్ల మైలురాయిని తాకిన తొలి భారత బౌలర్‌గా నిలిచేందుకు కేవ‌లం ఒక్క వికెట్ దూరంలో మాత్రమే నిలిచాడు. మ్యాచ్‌ విషయానికొస్తే టాస్‌ గెలిచిన టీమిండియా బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 15 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.

ఇదీ చదవండి: తిలక్‌ వర్మకు గాయం.. నొప్పితో విలవిల్లాడుతూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement