సిరాజ్ సూప‌ర్ డెలివ‌రీ.. కివీస్ బ్యాట‌ర్ ఫ్యూజ్‌లు అవుట్! వీడియో | Mohammed Siraj's Magical Delivery Cleans Up Finn Allen in Series Decider | Sakshi
Sakshi News home page

IND vs NZ: సిరాజ్ సూప‌ర్ డెలివ‌రీ.. కివీస్ బ్యాట‌ర్ ఫ్యూజ్‌లు అవుట్! వీడియో

Nov 15 2026 2:51 PM | Updated on Nov 15 2026 3:02 PM

Mohammed Siraj's Magical Delivery Cleans Up Finn Allen in Series Decider

న్యూజిలాండ్‌తో బే ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. తొలి నాలుగు వన్డేలకు బెంచ్‌కే పరిమితమైన సిరాజ్‌కు.. సిరీస్ డిసైడర్ అయిన ఈ మ్యాచ్‌లో తుది జట్టులో అవకాశం దక్కింది. తనకు లభించిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్న సిరాజ్, కివీస్ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు.

సిరాజ్ మ్యాజిక్ డెలివరీ.. అలెన్ క్లీన్ బౌల్డ్
210 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు సిరాజ్ ఆరంభంలోనే షాకిచ్చాడు. తొలుత టిమ్ సీఫెర్ట్‌ను ఔట్ చేసిన సిరాజ్.. ఆ తర్వాత కివీస్ డేంజరస్ బ్యాటర్ ఫిన్ అలెన్‌ను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు.

ఇన్నింగ్స్ 22వ ఓవర్ వేసిన సిరాజ్.. మూడో బంతిని ఆఫ్ స్టంప్ వెలుపల గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఊహించని విధంగా లోపలికి దూసుకొచ్చిన ఆ బంతిని అలెన్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అద్భుతమైన ఇన్ స్వింగ్‌తో దూసుకెళ్లిన బంతి నేరుగా వెళ్లి ఆఫ్ స్టంప్‌ను ఎగరగొట్టింది.

దీంతో 4 పరుగులు చేసిన అలెన్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య చేధనలో భారత బౌలర్ల విజృంభణతో కివీస్ తడబడుతోంది.



 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement