సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు టెంబా బవుమా నాయకత్వం వహించనున్నాడు. కాగా ఆసీస్‌తో టెస్టులకు గాయం కారణంగా దూరమైన స్టార్ ఓపెనర్ టోనీ డి జోర్జీ పునరాగమనం చేశాడు. టోనీ తిరిగి రావడంతో డేవిడ్ బెడింగ్‌హామ్‌ను సెలక్టర్లు పక్కన పెట్టేశారు. అలాగే మిడిలార్డర్ బ్యాటర్ జుబేర్ హమ్జా కూడా రీఎంట్రీ ఇచ్చాడు.
ఇటీవల ఆస్ట్రేలియాపై అద్భుత ప్రదర్శన చేసిన స్టార్ ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్, స్పిన్నర్ సైమన్ హార్మర్‌లు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. అంతేకాకుండా తొడ కండరాల గాయం నుంచి కోలుకున్న ఫాస్ట్ బౌలర్ ఆన్రిచ్ నోర్జే తిరిగి జట్టులోకి రావడం ప్రొటీస్ బౌలింగ్‌కు మరింత బలాన్నిచ్చింది. ప్రోటీస్ పేస్ విభాగంలో నోర్జేతో పాటు కగిసో రబాడా, డేన్ ప్యాటర్సన్, కార్బిన్ బాష్‌లకు చోటు దక్కింది.
కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను సఫారీలు 2-1 తేడాతో సొంతం చేసుకున్నారు. తొలి టెస్టులో ఓటమి పాలైనప్పటికి మిగితా రెండు మ్యాచ్‌లలో సౌతాఫ్రికా సంచలన విజయాలు నమోదు చేసింది. ఇప్పుడు అదే జోరును బంగ్లాదేశ్‌పై కూడా కొనసాగించాలని సౌతాఫ్రికా పట్టుదలతో ఉంది. ఈ రెండు టెస్టుల సిరీస్ నవంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది.
బంగ్లాదేశ్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టు
టెంబా బావుమా (కెప్టెన్), సైమన్ హార్మర్, వియాన్ ముల్డర్, మార్క్వెస్ అకెర్మాన్, జుబేర్ హంజా, అన్రిచ్ నోర్ట్జే, మాథ్యూ బ్రీట్జ్కే, మార్కో జాన్సెన్, డేన్ ప్యాటర్సన్, కార్బిన్ బోష్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడా, టోనీ డి జోర్జి, ఐడెన్ మర్క్రామ్
చదవండి: IND vs NZ: షెడ్యూల్, జట్లు, మ్యాచ్ టైమింగ్స్, లైవ్‌స్ట్రీమింగ్ వివరాలు


