breaking news
Tony de Zorzi
-
పాక్‌తో తొలి టెస్ట్.. తడబడుతున్న సౌతాఫ్రికా.. రికెల్టన్, జోర్జి రాణించినా..!
లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో (Pakistan vs South Africa) పర్యాటక సౌతాఫ్రికా జట్టు తడబడుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 216 పరుగులు మాత్రమే చేయగలిగింది. ర్యాన్ రికెల్టన్ (71), టోనీ డి జోర్జి (81 నాటౌట్) అర్ద సెంచరీలు చేసినా పెద్ద స్కోర్ సాధించేలా కనిపించడం లేదు. రికెల్టన్, జోర్జి క్రీజ్‌లో ఉన్నప్పుడు సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసేలా కనిపించింది.అయితే 26 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 174 పరుగుల వద్ద రికెల్టన్.. 192 పరుగుల వద్ద ట్రిస్టన్ స్టబ్స్ (8).. 193 పరుగుల వద్ద డెవాల్డ్ బ్రెవిస్ (0).. 200 పరుగుల వద్ద కైల్ వెర్రిన్ (2) వికెట్లు కోల్పోయింది.ఆట ముగిసే సమయానికి టోనీ డి జోర్జితో పాటు సెనురన్ ముత్తుసామి (6) క్రీజ్‌లో ఉన్నాడు. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు సౌతాఫ్రికా ఇంకా 162 పరుగులు వెనుకపడి ఉంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మార్క్రమ్ 20, వియాన్ ముల్దర్ 17 పరుగులకు ఔటయ్యారు. వెటరన్ స్పిన్నర్ నౌమన్ అలీ 4 వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బ కొట్టాడు. సాజిద్ ఖాన్, సల్మాన్ అఘా తలో వికెట్ తీశారు.అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. నలుగురు భారీ అర్ద సెంచరీలు చేసినా, ఆ జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. సెనూరన్ ముత్తుసామి 6 వికెట్లు తీసి పాక్‌ను దెబ్బ కొట్టాడు. ప్రెనెలన్ సుబ్రాయన్ 2, రబాడ, హార్మర్ తలో వికెట్ తీశారు. పాక్ ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అఘా తలో 93 పరుగులు, కెప్టెన్ షాన్ మసూద్ 76, వికెట్‌కీపర్ రిజ్వాన్ 75 పరుగులు చేశారు. కాగా, సౌతాఫ్రికా జట్టు 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, అనంతరం 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ల కోసం పాక్‌లో పర్యటిస్తుంది. చదవండి: సారా టెండుల్కర్‌కు అర్జున్, సానియా స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్ -
బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా.. సిరీస్ కైవసం
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ (అక్టోబర్ 31) ముగిసిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 273 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టెస్ట్‌ల్లో పరుగుల పరంగా సౌతాఫ్రికాకు ఇది భారీ విజయం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 575 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.టోనీ డి జోర్జీ (177), ట్రిస్టన్ స్టబ్స్ (106), వియాన్ ముల్దర్ (105 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. ఈ ముగ్గురికి కెరీర్లో (టెస్ట్) ఇవి తొలి సెంచరీలు. ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆటగాళ్లు తొలి సెంచరీలు నమోదు చేయడం ప్రపంచ రికార్డు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ, ట్రిస్టన్, ముల్దర్ సెంచరీలతో సత్తా చాటగా.. డేవిడ్ బెడింగ్హమ్ (59), సెనురన్ ముత్తుస్వామి (68 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం ఐదు వికెట్లు తీశాడు.అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. రబాడ దెబ్బకు (5/37) తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూలింది. డేన్ పీటర్సన్, కేశవ్ మహారాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ముత్తుస్వామి ఓ వికెట్ దక్కింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్ హాక్ (82), తైజుల్ ఇస్లాం (30), మహ్మదుల్ హసన్ జాయ్ (10) రెండంకెల స్కోర్లు చేశారు.దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 416 పరుగులు వెనుకపడి ఫాలో ఆన్ ఆడిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన కనబర్చింది. ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే ఆలౌటై ఘోర ఓటమిని మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ ఐదు, ముత్తుస్వామి నాలుగు వికెట్లు, పాటర్సన్ ఓ వికెట్ పడగొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో షాంటో (36), హసన్ మహమూద్ (38 నాటౌట్), ఇస్లాం అంకోన్ (29), మహ్మదుల్ హసన్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.చదవండి: మళ్లీ ఐదేసిన రబాడ.. ఫాలో ఆన్ ఆడుతున్న బంగ్లాదేశ్ -
ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురి తొలి సెంచరీలు.. అరుదైన రికార్డు
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను భారీస్కోరు వద్ద డిక్లేర్ చేసింది. రెండో రోజు వియాన్ ముల్డర్ (105 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా ‘శత’క్కొట్టడంతో ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం మూడు సెంచరీలు నమోదయ్యాయి. తొలి రోజే ఓపెనర్ టోని డి జోర్జి, వన్‌డౌన్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ శతకాలు బాదారు. ఓవర్‌నైట్ స్కోరు 307/2తో బుధవారం ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 144.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 575 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.ఓవర్‌నైట్ బ్యాటర్లు జోర్జి (177; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు), బెడింగ్హామ్ (59; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. వేగంగా ఆడి అర్ధసెంచరీ సాధించిన బెడింగ్‌హామ్‌ను తైజుల్ బౌల్డ్ చేశాడు. 5 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లుజోర్జి తన శతకాన్ని డబుల్ సెంచరీగా మలచుకోలేకపోయాడు. 141 క్రితంరోజు స్కోరుతో ఆట కొనసాగించిన అతను 36 పరుగులు జోడించి తైజుల్ బౌలింగ్‌లోనే ఎల్బీగా వెనుదిరిగాడు.తన మరుసటి ఓవర్లో కైల్ వెరియెన్ (0)ను తైజుల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో తొలి సెషన్లో 5 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు పడ్డాయి. జట్టు స్కోరు 400 పరుగులు దాటాక... రెండో సెషన్లో రికెల్టన్ (12) నహీద్ రాణా బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే చకచకా నాలుగు వికెట్లు తీసిన ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. రెండో సెషన్లో మరో వికెట్ పడకుండా ముల్డర్, సెనురన్ ముత్తుస్వామి (75 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆరో వికెట్‌కు అబేధ్యమైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఇద్దరు 152 పరుగులు జోడించారు.దక్షిణాఫ్రికా 575/6 డిక్లేర్డ్ ఇక టీ విరామం తర్వాత ముత్తుస్వామి అర్ధసెంచరీ, ముల్డర్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ (5/198) ఐదు వికెట్లు తీయగలిగాడు కానీ దాదాపు 200 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి 9 ఓవర్లలో 38 పరుగులే చేసి 4 కీలకమైన వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.టాప్–3 బ్యాటర్లు షాద్మన్ (0), హసన్ (10), జాకీర్ హసన్ (2) చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ రబడ 2 వికెట్లు తీయగా, నైట్‌వాచ్‌మన్ హసన్ (3)ను స్పిన్నర్ కేశవ్ మహరాజ్ అవుట్ చేశాడు. మోమినుల్ హక్ (6 బ్యాటింగ్), కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.‘బాక్సింగ్ డే’ టెస్టులోచివరిసారి టెస్టుల్లో దక్షిణాఫ్రికా జట్టు స్కోరు 500 పరుగులు దాటిన సంవత్సరం 2020. ఆ ఏడాది సెంచూరియన్‌లో శ్రీలంక జట్టుతో జరిగిన ‘బాక్సింగ్ డే’ టెస్టులో దక్షిణాఫ్రికా 621 పరుగులకు ఆలౌటైంది.ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురి తొలి సెంచరీలు.. అరుదైన రికార్డుఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు తమ తొలి సెంచరీని నమోదు చేయడం ఇది రెండోసారి మాత్రమే. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టులో దక్షిణాఫ్రికా తరఫున టోనీ జోర్జి, స్టబ్స్, ముల్డర్ సెంచరీలు సాధించారు. 1948లో భారత్‌తో ఢిల్లీలో జరిగిన టెస్టులో వెస్టిండీస్ తరఫున గెర్రీ గోమెజ్, రాబర్ట్ క్రిస్టియాని, క్లేడ్ వాల్కట్ తమ తొలి సెంచరీలను నమోదు చేశారు. చదవండి: India vs New Zealand: జయమా... పరాభవమా!