
లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో (Pakistan vs South Africa) పర్యాటక సౌతాఫ్రికా జట్టు తడబడుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 216 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ర్యాన్ రికెల్టన్ (71), టోనీ డి జోర్జి (81 నాటౌట్) అర్ద సెంచరీలు చేసినా పెద్ద స్కోర్ సాధించేలా కనిపించడం లేదు. రికెల్టన్, జోర్జి క్రీజ్‌లో ఉన్నప్పుడు సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసేలా కనిపించింది.
అయితే 26 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 174 పరుగుల వద్ద రికెల్టన్.. 192 పరుగుల వద్ద ట్రిస్టన్ స్టబ్స్ (8).. 193 పరుగుల వద్ద డెవాల్డ్ బ్రెవిస్ (0).. 200 పరుగుల వద్ద కైల్ వెర్రిన్ (2) వికెట్లు కోల్పోయింది.
ఆట ముగిసే సమయానికి టోనీ డి జోర్జితో పాటు సెనురన్ ముత్తుసామి (6) క్రీజ్‌లో ఉన్నాడు. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు సౌతాఫ్రికా ఇంకా 162 పరుగులు వెనుకపడి ఉంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మార్క్రమ్ 20, వియాన్ ముల్దర్ 17 పరుగులకు ఔటయ్యారు. వెటరన్ స్పిన్నర్ నౌమన్ అలీ 4 వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బ కొట్టాడు. సాజిద్ ఖాన్, సల్మాన్ అఘా తలో వికెట్ తీశారు.
అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. నలుగురు భారీ అర్ద సెంచరీలు చేసినా, ఆ జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. సెనూరన్ ముత్తుసామి 6 వికెట్లు తీసి పాక్‌ను దెబ్బ కొట్టాడు. ప్రెనెలన్ సుబ్రాయన్ 2, రబాడ, హార్మర్ తలో వికెట్ తీశారు.
పాక్ ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అఘా తలో 93 పరుగులు, కెప్టెన్ షాన్ మసూద్ 76, వికెట్‌కీపర్ రిజ్వాన్ 75 పరుగులు చేశారు. కాగా, సౌతాఫ్రికా జట్టు 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, అనంతరం 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ల కోసం పాక్‌లో పర్యటిస్తుంది.
చదవండి: సారా టెండుల్కర్‌కు అర్జున్, సానియా స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్