
కైర్న్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు సమిష్టిగా కదం తొక్కారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ప్రోటీస్ ఓపెనర్లు ఐడైన్ మార్‌క్రమ్, ర్యాన్ రికెల్టన్ తొలి వికెట్‌కు 92 పరుగుల ఘనమైన ఆరంభాన్ని అందించారు.
రికెల్టన్(33) ఔటైన అనంతరం కెప్టెన్ టెంబా బావుమా(65), మార్‌క్రమ్(82) స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. అయితే బెన్ ద్వార్షుయిస్ మార్‌క్రమ్‌ను పెవిలియన్‌కు పంపడం ప్రోటీస్ స్కోర్ బోర్డు కాస్త నెమ్మదించింది.
అయితే ఈ సమయంలో యువ ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే(57) దూకుడుగా ఆడుతూ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేశాడు. ఆఖరిలో వియాన్ ముల్డర్(31) సైతం బ్యాట్ ఝూలిపించడంతో ఆసీస్ ముందు ఈ భారీ స్కోరర్‌ను సఫారీలు ఉంచగలిగారు.
ఇక ఆసీస్ బౌలర్లలో పార్ట్ టైమ్ స్పిన్నర్ ట్రావిస్ హెడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. బెన్ ద్వార్షుయిస్ రెండు, జంపా ఒక వికెట్ సాధించారు. మరో వికెట్ రనౌట్ రూపంలో లభించింది.
తుది జట్లు
ఆస్ట్రేలియా
ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కారీ, ఆరోన్ హార్డీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్
సౌతాఫ్రికా
ఐడెన్ మార్‌క్రమ్, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, ప్రేనెలన్ సుబ్రాయెన్, నాండ్రే బర్గర్, లుంగి ఎంగిడి