
సౌతాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టు (South Africa) సరికొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్లో నలుగురు వేర్వేరు కెప్టెన్లను మార్చిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 147 టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ జట్టు నాలుగు వరుస మ్యాచ్‌ల్లో నలుగురు వేర్వేరు కెప్టెన్లను మార్చలేదు.
సౌతాఫ్రికా కెప్టెన్ల మార్పు యాదృచ్చికంగా జరిగింది. 2023-25 డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత జింబాబ్వేతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమాకు (Temba Bavuma) విశ్రాంతి కల్పించారు.
ఆ సిరీస్‌కు కేవశ్ మహారాజ్ (Keshav Maharaj) కెప్టెన్‌గా ఎంపిక కాగా.. తొలి టెస్ట్‌లో అతను గాయపడ్డాడు. దీంతో రెండో టెస్ట్‌కు దూరమయ్యాడు. మహారాజ్ స్థానంలో రెండో టెస్ట్‌లో కెప్టెన్‌గా వియాన్ ముల్దర్ (Wiaan Mulder) వ్యవహరించాడు.
తాజాగా పాకిస్తాన్ పర్యటన కోసం సౌతాఫ్రికా జట్టును ప్రకటించారు. ఈ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ బవుమా అందుబాటులోకి రావాల్సింది. అయితే ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన వైట్ బాల్ సిరీస్ సందర్భంగా బవుమా గాయపడ్డాడు. దీంతో అతని స్థానంలో ఎయిడెన్ మార్క్రమ్‌కు (Aiden Markram) పాకిస్తాన్ సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
పాక్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఇవాళే (అక్టోబర్ 12) ప్రారంభమైంది. లాహోర్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో మార్క్రమ్ కెప్టెన్‌గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
53 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 2 వికెట్ల నష్టానికి 188 పరుగులుగా ఉంది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (2), కెప్టెన్ షాన్ మసూద్ (76) ఔట్ కాగా.. మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (86), బాబర్ ఆజమ్ (21) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ బౌలర్లలో ప్రెనెలన్ సుబ్రాయన్, కగిసో రబాడకు తలో వికెట్ దక్కింది.
చదవండి: IND vs WI: కుల్దీప్ మాయాజాలం.. 248 పరుగులకు వెస్టిండీస్ ఆలౌట్