
లాహోర్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో (Pakistan vs South Africa) సౌతాఫ్రికా స్పిన్నర్ సెనురన్ ముత్తుసామి (Senuran Muthusamy) చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 5 సహా మ్యాచ్ మొత్తంలో 11 వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టాడు.
ముత్తుసామి (17-1-57-5) ధాటికి పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. అతనికి సైమన్ హార్మర్ (14.1-3-51-4), రబాడ (10-0-33-1) సహకరించారు.
పాక్ ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసిన బాబర్ ఆజమ్ టాప్ స్కోరర్ కాగా.. అబ్దుల్లా షఫీక్ (41), సౌద్ షకీల్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మరో ఇద్దరు (రిజ్వాన్ (14), నౌమన్ అలీ (11)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (109 పరుగులు) కలుపుకుని పాక్ సౌతాఫ్రికా ముందు 277 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
శతక్కొట్టిన జోర్జి
అంతకుముందు టోనీ డి జోర్జి (Tony de Zorzi) బాధ్యతాయుతమైన శతకంతో (104) మెరవడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేయగలిగింది. ఓ పక్క సహచరులంతా విఫలమైన జోర్జి మాత్రం పట్టుదలతో ఆడి తన జట్టును ఆదుకున్నాడు.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో జోర్జితో పాటు ర్యాన్ రికెల్టన్ (71) ఒక్కడే రాణించారు. పాక్ వెటరన్ స్పిన్నర్ నౌమన్ అలీ ఆరు వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. నౌమన్‌కు సాజిద్ ఖాన్ (3/98) సహకరించాడు. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు సౌతాఫ్రికా 109 పరుగులు వెనుకపడి ఉంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో నలుగురు అర్ద సెంచరీలతో రాణించారు.
ఇమామ్ ఉల్ హక్ (93), సల్మాన్ అఘా (93) తృటిలో సెంచరీలు మిస్ కాగా.. కెప్టెన్ షాన్ మసూద్ (76), మహ్మద్ రిజ్వాన్ (75) భారీ అర్ద సెంచరీలు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో సెనురన్ ముత్తుసామి 6 వికెట్లు తీయగా.. ప్రెనెలన్ సుబ్రాయన్ 2, రబాడ, హార్మర్ తలో వికెట్ తీశారు.
చదవండి: చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్.. భారత తొలి క్రికెటర్‌గా ఫీట్