
రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ల కోసం సౌతాఫ్రికా జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (అక్టోబర్ 12) తొలి టెస్ట్ మొదలైంది. లాహోర్లోని గడాఫీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో (Pakistan vs South Africa) పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు పాక్ బ్యాటర్లు తలో చేయి వేయడంతో పాక్ మంచి స్కోర్ సాధించింది.
ఆట ముగిసే సమయానికి పాక్ 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్లో నలుగురు అర్ద సెంచరీలు చేశారు. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (93) తృటిలో సెంచరీ మిస్ కాగా.. కెప్టెన్ షాన్ మసూద్ (76), వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (62), సల్మాన్ అఘా (52) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలు చేశారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రిజ్వాన్, సల్మాన్ అఘా క్రీజ్లో ఉన్నారు.
పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (2), సౌద్ షకీల్ (0) పూర్తిగా నిరుత్సాహపరచగా.. బాబర్ ఆజమ్ (23) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్గా మలచలేకపోయాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సెనురన్ ముత్తుసామి 2, రబాడ, ప్రెనెలన్ సుబ్రాయన్, సైమన్ హార్మర్ తలో వికెట్ తీశారు.
చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు