
రేపటి నుంచి (అక్టోబర్ 15) దేశీయ క్రికెట్ మహా సంగ్రామం రంజీ ట్రోఫీ 2025-26 (Ranji Trophy) ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి ఇది 91వ ఎడిషన్. ఇందులో మొత్తం 38 జట్లు పోటీపడనున్నాయి. 28 రాష్ట్రాలకు చెందిన జట్లు (కొన్ని రాష్ట్రాలకు సంబంధించి రెండుకు మించి జట్లు ఉన్నాయి), 4 కేంద్ర పాలిత ప్రాంతాల జట్లు, అలాగే సర్వీసెస్, రైల్వేస్ జట్లు పాల్గొంటున్నాయి.
గత సీజన్లో విదర్భ విజేతగా, కేరళ రన్నరప్గా నిలిచాయి. తొలి మ్యాచ్లో ఉత్తర్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడనున్నాయి. రేపు మొత్తం 16 మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఈ టోర్నీ కోసం దాదాపుగా అన్ని జట్లు తమ ఆటగాళ్లను ప్రకటించాయి. ఈసారి టోర్నీకి చాలామంది టీమిండియా స్టార్లు అందుబాటులో ఉన్నారు.
రంజీ ట్రోఫీ 2025-26లో ఆడనున్న కీలక ఆటగాళ్లు..
ముంబై- శార్దూల్ ఠాకూర్, అజింక్య రహానే, ఆయుశ్ మాత్రే, శివమ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్
కేరళ- సంజూ శాంసన్
కర్ణాటక- మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్
జార్ఖండ్- ఇషాన్ కిషన్
హైదరాబాద్- తిలక్ వర్మ
బీహార్- వైభవ్ సూర్యవంశీ
బెంగాల్- మహ్మద్ షమీ
ఉత్తరప్రదేశ్- రింకూ సింగ్
అస్సాం- రియాన్ పరాగ్
కాగా, రంజీ ట్రోఫీలో అత్యధిక టైటిళ్లు ముంబై గెలుచుకుంది. ఆ జట్టు ఇప్పటివరకు 42 సార్లు ఛాంపియన్గా నిలిచింది. ముంబై తర్వాత కర్ణాటక/మైసూర్ అత్యధికంగా 8 టైటిళ్లు సాధించింది. ఆతర్వాతి స్థానాల్లో ఢిల్లీ (7), మధ్యప్రదేశ్/హోల్కర్ (5), బరోడా (5), సౌరాష్ట్ర (2), విదర్భ (2), బెంగాల్ (2), తమిళనాడు/మద్రాస్ (2), రాజస్తాన్ (2) జట్లు ఉన్నాయి.
చదవండి: కింగ్ కోహ్లి వచ్చేశాడు..!