
భారత క్రికెట్ అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) భారత్లో (ఢిల్లీ) ల్యాండయ్యాడు. విరాట్ గత కొంతకాలంగా కుటుంబంతో కలిసి లండన్లో ఉంటున్నాడు. ఐపీఎల్ 2025 తర్వాత కోహ్లి భారత్కు రావడం ఇదే మొదటిసారి.
THE AURA OF KING KOHLI..!!!! 🐐
- The Arrival of Virat Kohli at home in Delhi. 👑
pic.twitter.com/fevrsiSB7L— Tanuj (@ImTanujSingh) October 14, 2025
ఇవాళ (అక్టోబర్ 14) ఉదయం కోహ్లి న్యూఢిల్లీ విమానాశ్రయం నుంచి బయటికి వస్తున్న దృశ్యాలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి.కోహ్లీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. సెల్ఫీల కోసం స్వల్ప తోపులాట కూడా జరిగింది. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ చేసిన నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణg మార్మోగిపోయింది. ప్రస్తుతం ఎక్స్లో #ViratReturns అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.
త్వరలో ఆస్ట్రేలియాలో జరుగబోయే సిరీస్ కోసం కోహ్లి ఢిల్లీ నుంచి బయల్దేరతాడు. విరాట్తో పాటు రోహిత్ శర్మ కూడా వెళ్తాడని సమాచారం. మిగతా సభ్యులు ప్రత్యేక విమానంలో వెళ్లే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. వన్డే మ్యాచ్లు అక్టోబర్ 19 (పెర్త్), 23 (అడిలైడ్), 25 (సిడ్నీ) తేదీల్లో జరుగనున్నాయి.
విరాట్ టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆసీస్తో వన్డే సిరీస్ ద్వారా కోహ్లీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కోహ్లికి ఇదే తొలి సిరీస్.
ఈ సిరీస్ తర్వాత కోహ్లి భవిష్యత్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా కోహ్లి వన్డేలకు కూడా రిటైర్మెంట్ (ఆసీస్ సిరీస్ తర్వాత) ప్రకటిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.
చదవండి: సిగ్గు చేటు: అశ్విన్, మాజీ చీఫ్ సెలక్టర్‌పై గంభీర్ ఫైర్
కోహ్లితో పాటు రోహిత్ కూడా టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ కూడా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు. కోహ్లి, రోహిత్‌ల ఆట చూసేందుకు అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియాలో కోహ్లి, రోహిత్‌ల నుంచి భారీ ఇన్నింగ్స్లు ఆశిస్తున్నారు.