
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) యువ మహిళా క్రికెటర్లకు బంపరాఫర్ ఇచ్చింది. భారత అండర్-19 వుమెన్ జట్టులో చోటు కోసం పోటీపడే సువర్హావకాశం కల్పించింది. ఇందుకోసం అక్టోబరు 15, 16 తేదీల్లో ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఇందులో సత్తా చాటిన మహిళా క్రికెటర్లు 2025-26 సీజన్‌కు గానూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్వహించే టోర్నీల్లో భాగం కావొచ్చని హెచ్‌సీఏ ఈ సందర్భంగా తెలిపింది. ఇక పోటీల్లో పాల్గొనాలనుకునే మహిళా క్రికెటర్లకు ఉండాల్సిన అర్హతలను కూడా మంగళవారం వెల్లడించింది. ప్రతి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఈ నోటిఫికేషన్ గురించి స్థానిక ప్లేయర్లకు సమాచారం అందించాలని ఆదేశించింది.
రిజిస్ట్రేషన్ వివరాలు
👉అక్టోబరు 15 2025న ఉదయం తొమ్మిది గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆరంభం
👉మధ్యాహ్నం 12- సాయంత్రం 5 గంటలకు వరకు ట్రయల్స్
👉అక్టోబరు 16న కూడా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రిజిస్ట్రేషన్, ట్రయల్స్ ప్రక్రియ
వేదిక
👉ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (RGICS), ఉప్పల్, హైదరాబాద్.
నోట్: జిల్లాల నుంచి వచ్చే క్రికెటర్లు అక్టోబరు 15న రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోనట్లయితే.. అక్టోబరు 16న ఉప్పల్‌లో ఉదయం 9- సాయంత్రం ఐదు గంటల వరకు రిపోర్టు చేయవచ్చు.
అర్హత
👉01.09.2006న లేదంటే ఆ తర్వాత జన్మించిన మహిళా క్రికెటర్లకు మాత్రమే ఈ అవకాశం
ప్లేయర్లు పాటించాల్సిన నిబంధనలు
👉ఉప్పల్‌లోని RGICSలో గేట్ 1 వద్ద ప్లేయర్లంతా రిపోర్టు చేయాలి.
👉ప్రతీ ప్లేయర్ తమ క్రికెట్ కిట్, తెలుపు రంగు దుస్తులు వెంట తెచ్చుకోవాలి.
👉 గుర్తింపు పత్రాలను తప్పక తీసుకురావాలి.
1. పుట్టినరోజును ధ్రువీకరించే బర్త్ సర్టిఫికెట్ ఒరిజినల్ డిజిటల్ కాపీ, దానితో పాటు జిరాక్స్ ఫొటోకాపీని తీసుకురావాలి.
2. ఒరిజినల్ ఫుల్ సైజ్ ఆధార్ కార్డుతో పాటు.. దాని జిరాక్స్ ఫొటోకాపీ కూడా తెచ్చుకోవాలి.
3. ఒక పాస్‌పోర్టు సైజ్ ఫొటో తీసుకురావాలి.
చదవండి: సిగ్గు చేటు: అశ్విన్, మాజీ చీఫ్ సెలక్టర్‌పై గంభీర్ ఫైర్