అఫ్గానిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడనున్న విజయ్‌ శంకర్‌ | Vijay Shankar, KS Bharat and Ashwin register for Afghanistan Premier League draft | Sakshi
Sakshi News home page

అఫ్గానిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడనున్న విజయ్‌ శంకర్‌

Nov 2 2026 4:08 PM | Updated on Nov 2 2026 4:18 PM

Vijay Shankar, KS Bharat and Ashwin register for Afghanistan Premier League draft

అఫ్గానిస్తాన్ ప్రీమియ‌ర్ లీగ్ (APL) తొలి సీజ‌న్ డ్రాఫ్ట్‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు అఫ్గాన్ క్రికెట్ బోర్డు సిద్ద‌మైంది. ఈ డ్రాప్ట్ వేలం దుబాయ్ వేదిక‌గా మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నుంది. ఈ డ్రాప్ట్ కోసం మొత్తం 462 మంది ఆటగాళ్లను అఫ్గాన్ క్రికెట్ షార్ట్ లిస్ట్ చేసింది. 

ఈ జాబితాలో భార‌త మాజీ ప్లేయ‌ర్లు విజ‌య్ శంక‌ర్‌, కెఎస్ భ‌ర‌త్‌, స్పిన్న‌ర్ మురుగున్ అశ్విన్‌లు కూడా ఉన్నారు. ఈ ముగ్గురూ చోటు దక్కించుకోవడమే కాకుండా 'గోల్డ్' కేటగిరీలో నిలిచారు. వీరి ముగ్గురూ పూర్తిగా బీసీసీఐతో తెగ‌దింపులు చేసుకోవ‌డంతో విదేశీ ఫ్రాంచైజీ లీగ్స్‌లో ఆడేందుకు అనుమ‌తి ల‌భించింది. విజ‌య్ శంక‌ర్ ఇప్ప‌టికే శ్రీలంక ప్రీమియ‌ర్ లీగ్‌లో జాఫ్నా కింగ్స్ త‌ర‌పున ఆడాడు. కాగా వీరికి ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉంది.

విజయ్ శంకర్ సీఎస్‌కే, సన్‌రైజర్స్, గుజరాత్ టైటాన్స్‌లకు ప్రాతినిథ్యం వహించగా..  కెఎస్ భరత్ ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్, కేకేఆర్ల తరపున ఆడాడు. అదేవిధంగా మురుగన్ అశ్విన్ రైజింగ్ పుణే, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ సహా 6 జట్లు) వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించారు.

వీరితో పాటు అసోసియేట్ దేశాల తరఫున ఆడుతున్న భారత సంతతికి చెందిన ఉన్ముక్త్ చంద్ (అమెరికా), రాహుల్ చోప్రా, అక్షదీప్ నాథ్, అలీషాన్ షరాఫు, ఆరియన్ అఫ్జల్ ఖాన్, ధృవ్ పరాశర్ (యూఏఈ), అయాన్ ఖాన్ (ఒమన్), వ్రజ్ పటేల్ (కెన్యా), యాసిన్ పటేల్ (కువైట్) కూడా డ్రాఫ్ట్‌లో చోటు సంపాదించారు.

ప్లాటినం కేటగిరీలో మహమ్మద్ అమీర్
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ ఏపీఎల్‌ డ్రాఫ్ట్‌లో అత్యున్నత 'ప్లాటినం' కేటగిరీలో ఉన్నాడు. బ్రిటీష్ పౌరసత్వం పొందిన 34 ఏళ్ల అమీర్, యూకేలో నివసిస్తున్న పాకిస్థాన్ జాతీయుడిగా నమోదయ్యాడు. 

ఈ ఏడాది డిసెంబర్ 16న గోవాలో జరగనున్న ఐపీఎల్ మినీ వేలంలో కూడా అమీర్ తన పేరు నమోదు చేసుకునే అవకాశం ఉంది. గతంలో పాకిస్థాన్ మాజీ ప్లేయర్ అజహర్ మహమూద్ బ్రిటీష్ పాస్‌పోర్ట్‌తో 2012-2015 మధ్య ఐపీఎల్‌లో (కేకేఆర్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) ఆడిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement