మిస్టర్‌ దెయ్యం షురూ | Mr Deyyam Movie Grand Opening Pooja Ceremony | Sakshi
Sakshi News home page

మిస్టర్‌ దెయ్యం షురూ

Oct 24 2026 4:40 AM | Updated on Oct 24 2026 4:41 AM

Mr Deyyam Movie Grand Opening Pooja Ceremony

సిరి, విజయ్‌ శంకర్, మంచు మనోజ్‌

విజయ్‌ శంకర్, సిరి చౌదరి, ఖయ్యూమ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మిస్టర్‌ దెయ్యం’. సంజన అన్నే దర్శకత్వంలో శౌర్య ఆర్య సమర్పణలో అన్నే క్రియేషన్స్‌ పతాకంపై వెంకట్‌ నిమ్మలపూడి, సింధు అన్నే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శుక్రవారం జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమంలో ముహూర్తపు సన్నివేశానికి అలీ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, హీరో మంచు మనోజ్‌ క్లాప్‌ ఇచ్చారు. 

ఈ సన్నివేశానికి దర్శకుడు విజయ్‌ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు, నటుడు–సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ మేకర్స్‌కు స్క్రిప్ట్‌ అందించారు. అనంతరం విజయ్‌ శంకర్‌ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు ఇదివరకెన్నడూ చూడనటువంటి హారర్‌ ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో ఉంటాయి. ఇదొక బెస్ట్‌ హారర్‌ మూవీగా నిలుస్తుంది’’ అని చెప్పారు. ‘‘మా ‘మిస్టర్‌ దెయ్యం’ చిత్రాన్ని ప్రేక్షకులు సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు సంజన అన్నే. ఇంకా సిరి చౌదరి, ఖయ్యూమ్, పింగ్‌పాంగ్‌ సూర్య మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement