తారా పరిచయం | Rukmini Vasanth to headline Kanam director Shree Karthick next | Sakshi
Sakshi News home page

తారా పరిచయం

Oct 24 2026 4:35 AM | Updated on Oct 24 2026 4:35 AM

Rukmini Vasanth to headline Kanam director Shree Karthick next

‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’) సినిమా తర్వాత డైరెక్టర్‌ శ్రీ కార్తీక్‌ తెరకెక్కించనున్న తాజా చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ లీడ్‌ రోల్‌ చేయనుండగా, దేవ్‌ రామనాథ్, వినాయక్‌ వైద్యనాథన్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సిరుని సినీ కార్పొరేషన్, మ్యాడ్‌బాయ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించనున్నాయి. ఈ మూవీలో రుక్మిణీ వసంత్‌పాత్రని ‘తారా’గా పరిచయం చేస్తూ, శుక్రవారం ఓ వీడియో రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

‘‘విభిన్నమైన ఆలోచనలు, వినూత్నమైన కథనం ఈ చిత్రానికి ఆకర్షణగా నిలుస్తాయి. దేవ్‌ రామనాథ్, శ్రీ కార్తీక్‌ నేతృత్వంలోని మ్యాడ్‌బాయ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ విభిన్నమైన, సహజత్వానికి దగ్గరగా ఉండే కథలను రూపొందించే స్టూడియోగా గుర్తింపు పొందింది. ‘కీడా కోలా, కాంత’ చిత్రాలతో అనుబంధం ఉన్న సాయికృష్ణ గద్వాల్‌ ఈ ప్రాజెక్ట్‌లో సహ నిర్మాతగా భాగమయ్యారు’’ అని యూనిట్‌  పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement