బర్త్‌ డే స్పెషల్‌ | Prabhas Upcoming Movies update: Tollywood | Sakshi
Sakshi News home page

బర్త్‌ డే స్పెషల్‌

Oct 24 2026 4:30 AM | Updated on Oct 24 2026 4:30 AM

Prabhas Upcoming Movies update: Tollywood

హీరో ప్రభాస్‌ పుట్టినరోజు (అక్టోబరు 23) సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రాల అప్‌డేట్స్‌ని పంచుకున్నారు మేకర్స్‌. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. 2024 జూన్‌ 27న విడుదలై, ఘన విజయం సాధించింది. ఈ మూవీకి సీక్వెల్‌ ఉంటుందని యూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టారు ప్రభాస్‌. ఇందుకు సంబంధించిన స్పెషల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు.  

మార్చిలో ఫౌజీ: ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్‌ ఖేర్, మిథున్‌ చక్రవర్తి, భాను చందర్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్‌ గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్  యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఓ గ్లింప్స్‌ విడుదల చేశారు. ఈ సినిమా 2027 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.   

డ్రాగన్‌ పూర్తయ్యాక ‘సలార్‌ 2’: ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సలార్‌:పార్ట్‌ 1– సీజ్‌ఫైర్‌’. విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ సినిమా 2023 డిసెంబరు 22న రిలీజై, సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి రెండో భాగం ‘సలార్‌ 2’ ఉంటుందని యూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ హీరోగా తాను తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్‌’ సినిమా పనులు పూర్తయిన తర్వాత ‘సలార్‌ 2’ ప్రీ–్ర΄÷డక్షన్‌ పనులు ప్రారంభించనున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement