ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత వికెట్ కీపర్ బ్యాటర్, ఆంధ్ర స్టార్ క్రికెటర్ కేఎస్ భరత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్-2026లో ఆడేందుకు కాఠ్మండు గోర్ఖాస్‌తో జట్టుతో భరత్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఈ విషయాన్ని కాఠ్మండు గోర్ఖాస్ ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. భరత్‌కు తమ జట్టులోకి స్వాగతం పలకుతున్నామని కాఠ్మండు ఓ వీడియోను షేర్ చేసింది. దీంతో ఈ సీజన్ కోసం కాఠ్మండు జట్టులో చేరిన తొలి విదేశీ ప్లేయర్‌గా భరత్ నిలిచాడు.
కాగా 32 ఏళ్ల భరత్ టీమిండియా తరపున 7 టెస్టులు ఆడాడు. అతడు చివరగా 2024 ఫిబ్రవరి 2న విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరపున ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో విఫలమైనప్పటికి ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మాత్రం భరత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది.
13 ఇన్నింగ్స్‌లలో 36.53 సగటుతో 6102 పరుగులు చేశాడు. అతడి పేరిట ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. లిస్ట్-ఎ క్రికెట్‌లో కూడా అతడు అద్భుతంగా రాణించాడు. 83 మ్యాచ్‌లలో 2692 పరుగులు చేశాడు. కాగా విశాఖ క్రికెటర్ భవిష్యత్తులో యూఏఈ జాతీయ జట్టు తరపున ఆడనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: రింకూ సింగ్ విధ్వంసం.. కేవలం 7 బంతుల్లోనే! వీడియో వైరల్


