తాడేపల్లి: రెండు రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి.. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న ఏపీకి చెందిన బ్యాటర్-వికెట్ కీపర్ కేఎస్ భరత్‌కు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న భరత్‌కు శుభాకాంక్షలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఆల్ ది బెస్ట్ కేఎస్ భరత్ అంటూ పోస్ట్ చేశారు వైఎస్ జగన్.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీమిండియా వికెట్‌కీపర్-బ్యాటర్ కేఎస్ భరత్.. గురువారం తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ.. భవిష్యత్తులో కోచింగ్, మెంటరింగ్ ద్వారా యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు భరత్,.
Wishing K.S. Bharat all the best as he embarks on a new Journey after announcing his retirement from international cricket. Good luck for the future!@KonaBharat pic.twitter.com/uy5XpUI3h8
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2026
కాగా, 2023లో ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్‌లో టెస్టు అరంగేట్రం చేసిన భరత్, భారత్ తరఫున 7 టెస్టులు ఆడి 221 పరుగులు చేశాడు. వికెట్‌కీపర్‌గా 18 క్యాచ్‌లు, ఒక స్టంపింగ్ నమోదు చేశాడు.
అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, భారత్‌కు దేశవాళీ క్రికెట్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 113 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 6102 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 34 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 308 పరుగులు.
లిస్ట్-ఏ క్రికెట్‌లో భరత్ 82 మ్యాచ్‌లు ఆడి 8 సెంచరీలు, 10 అర్ద సెంచరీల సాయంతో 2692 పరుగులు చేశాడు. అలాగే దేశవాలీ టీ20ల్లో 91 మ్యాచ్‌లు ఆడి 11 అర్ద సెంచరీల సాయంతో 1812 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో భరత్ 11 మ్యాచ్‌ల్లో ఓ అర్ద సెంచరీ సాయంతో 199 పరుగులు చేశాడు.


