సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ కోకోవేన్ విభాగంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అనంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందారు. ఐరన్ పడటంతో తీవ్ర గాయాలతో మృతిచెందారు. స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గత జూన్ నెలలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మృతిచెందడంతో మరోసారి భద్రతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు.
కొన్ని దశాబ్దాలుగా ప్లాంట్‌లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వివిధ విభాగాల్లో జరిగిన ప్రమాదాల్లో పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. ప్రధానంగా గ్యాస్ లీకేజ్, పేలుళ్లు, ద్రవ లోహం లీకేజ్ వంటి ఘటనలు జరుగుతూనే ఉండటంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికుల భద్రత ప్రశ్నార్థకరంగా మారింది.


