breaking news
steel plant
-
వీర లెవల్లో డైలాగులు పీకాడు... బాబు బండారం బయటపెట్టిన జగన్
-
బాబు పోకడలతో విశాఖ ఉక్కు భవిష్యత్తు ప్రశ్నార్థకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పేమీ చేయలేదు.. ఆయన సహజ స్వభావాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. అంతే! విశాఖపట్నంలో పారిశ్రామిక సమ్మిట్ జరిగిన సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపైన, అందులో పనిచేసే కార్మికులపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పని చేయకపోయినా జీతాలు ఇవ్వాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కష్టపడకుండా తెల్ల ఏనుగులా మారితే ఎలా అని ఆయన అన్నారు. వినడానికి బాగానే ఉంటుంది కదా! కాని ఇదే పెద్ద మనిషి 2024 ఎన్నికలకు ముందు ఏమని ప్రచారం చేశారు? ఇది ఆంధ్రుల హక్కు, సెంటిమెట్, దీనిని ఎలాగైనా కాపాడుకుంటాం,పొరాడుదాం.. అని చెప్పారా?లేదా?ఆ రోజు కార్మికులు సరిగా పనిచేయకపోవడం వల్లే నష్టాలలో ఉందని ఎందుకు ధైర్యంగా చెప్పలేదు?ఇప్పుడు మాట మార్చి తమ నైజాన్ని మరోసారి ప్రదర్శించినట్లు అవ్వలేదా? ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్మికులను ఎలా రెచ్చగొట్టారు? తాను ఈ ప్లాంట్‌ను కాపాడడానికి సిద్దంగా ఉన్నానని, కార్మిక సంఘాలు కలిసి రావాలని అన్నారే కానీ ఇప్పుడు ఆ ఊసే ఎందుకు పవన్ ఎత్తడం లేదు. విశాఖ స్టీల్ సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని కృషి చేసిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై వీరిద్దరూ ఎన్ని అభాండాలు మోపారు! కొద్దికాలం క్రితం శాసనమండలిలో మంత్రి లోకేష్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోయినా వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని అన్నారని వార్తలు వచ్చాయి కదా! ఆయన కూడా ప్రస్తుతం దీని గురించి మాట్లాడడం లేదే! అంటే వీరంతా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను మభ్య పెట్టి ఓట్లు వేయించుకున్నారని ఒప్పుకోవలసిందే కదా! 12వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చాం కనుక ఇప్పుడు దానిని ఏమి చేసినా ఫర్వాలేదన్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్యాకేజీ ఎందుకు ఇచ్చారు?దేనికి వాడారు? ప్రైవేటువారికి అప్పగిస్తే రుణ బారం తగ్గించి ఇవ్వడానికి అలా చేశారన్న సంగతి అర్ధం అవుతూనే ఉంది కదా! ఈ సంస్థకు సొంత గనులు లేవని మొత్తుకుంటుంటే ఆ సంగతి చెప్పకుండా, అనకాపల్లి వద్ద ప్రైవేటు రంగంలో మరో స్టీల్ ప్లాంట్ తెస్తున్నామని, దానికి గనులు కేటాయించడానికి ప్రధాని మోదీని ఒప్పించామని చంద్రబాబు చెప్పారు. పైగా అది లాభాలలో నడుస్తుందని ఆయన జోస్యం చెబుతున్నారు. విశాఖ ఉక్కుకు ఎందుకు గనులు కేటాయించేలా కృషి చేయలేదో వివరించాలి కదా! ప్రైవేటుపై మోజు ఉంటే ఉండవచ్చు. కాని ఎన్ని కంపెనీలు ప్రభుత్వం నుంచి రాయితీలు , బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఆ తర్వాత వాటిని సరిగా నడపలేక చేతులెత్తేశాయి. మరికొన్ని సంస్థలు మోసాలు చేసి దివాళాకు వెళ్ళాయి. ఇలా మూత పడ్డ పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు మాత్రం బ్రహ్మాండంగా, హాపీగా ఉంటున్నారే. రాజకీయాలలోకి వచ్చి మంచి పదవులు పొందుతున్నారే. టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు వందల కోట్ల రుణాలను బ్యాంకులనుంచి పొంది ఎగనామం పెట్టారు కదా! గతంలో చంద్రబాబు టైమ్‌లో కొండపల్లి వద్ద లాంకో పవర్ అన్న సంస్థ ఏర్పాటైంది. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు చెందిన ఆ సంస్థ వివిధ కారణాలతో మూతపడింది.ఆ కంపెనీకి బ్యాంకులు ఇచ్చిన 45వేల కోట్ల రుణాలలో ఎంత భాగం మాఫీ అయ్యాయో చంద్రబాబు వంటి వారికి తెలియదా? అప్పుడు తెల్ల ఏనుగులకు ప్రభుత్వ డబ్బు కట్టబెట్టినా ఫర్వాలేదా? దేశ వ్యాప్తంగా ఏటా లక్షల కోట్ల మేర బ్యాంకులు పరిశ్రమలవారికి ఇచ్చిన రుణాలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగానే ప్రకటిస్తున్నాయి కదా! ప్రైవేటు కంపెనీ లూలూ కు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా వందల కోట్ల విలువైన భూమిని అర్ధణా,అణాలకు ఇచ్చేసింది కదా! అదే కంపెనీ అహ్మదాబాద్‌లో ఎందుకు 519 కోట్లతో భూమి కొనుగోలు చేసింది. ఏపీలో మాత్రం అతి తక్కువ మొత్తానికి విలువైన భూమిని లీజుగా పొందింది? దీనికి ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు?ఆ కంపెనీ ఉత్పత్తులపై పవన్ కళ్యాణ్ అభ్యంతరం పెట్టినా పట్టించుకోలేదే! కొన్ని కంపెనీలకు 99 పైసలకే భూములు ఇవ్వడం, మరికొన్నిటికి వేల కోట్ల రాయితీలు ఇవ్వడంం, ఉర్సా వంటి సంస్థలకు భూముల అమ్మకం వంటివి సమర్ధనీయమేనా? ఆ రాయితీలు ప్రజలు కట్టిన పన్నుల నుంచే కదా ఇచ్చేది. ప్రభుత్వ రంగ సంస్థలు సరిగా పనిచేయవని ఒక ముద్ర వేసి వాటి ఆస్తులను ప్రైవేటువారికి కట్టబెట్టడంలోని మతలబు ఏమిటి?చంద్రబాబు హయాంలోనే ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో ఏభైకి పైగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటైజ్ చేశారు. ఆ ప్రైవేటు కంపెనీలు ఇప్పుడు బాగా నడుస్తున్నాయా? లేక కంపెనీలను మూసి భూములు అమ్ముకుంటున్నాయా? అన్న శంక పలువురిలో ఉంది. దానిపై చంద్రబాబు వివరణ ఇవ్వగలిగితే బాగుంటుంది కదా? ప్రజల పన్నులతోనే సమకూర్చుకున్న ఆస్తులను కొందరు వ్యక్తులను సంపన్నులను చేయడానికి వాడవచ్చా? దాదాపు రెండు లక్షల కోట్ల విలువైన భూములు విశాఖ ఉక్కుకు ఉన్నాయా?లేదా? సెయిల్‌తో పోల్చితే సొంత గనులు లేకపోయినా ఈ ప్లాంట్ ఉత్పాదకత ఎక్కువగా ఉన్న విషయాన్ని కార్మికులు గణాంకాలతో చెబుతున్నారు. అలాంటి కంపెనీ నిలదొక్కుకోవడానికి ఏమి చేయాలన్నదానిపై దృష్టి పెట్టకుండా,ఎలాగైనా ప్రైవేటువారికి కట్టబెట్టాలన్న ఆలోచనతో ఎందుకు ముందుకు వెళుతున్నారు. ఎన్నికలకు ముందు అదే తమ విధానమని చెప్పి ఉంటే ఎవరూ కాదనరు. కాని ఆ రోజు సెంటిమెంట్ అని ఆంధ్రుల హక్కు అని , ఈరోజు తెల్ల ఏనుగు అని అనడం, ప్రశ్నలు వేసిన మీడియావారిపై కస్సుమనడం చంద్రబాబుకే చెల్లింది. ఇవన్ని ఊసరవెల్లి మాటలుగా అనుకుంటారని కూడా ఫీల్ కారా? గొర్రె కసాయి వాడినే నమ్ముతుందన్నట్లుగా ఆ రోజుల్లో విశాఖ ప్రాంత ప్రజలు వీరి ప్రచారం నమ్మి భారీ మెజార్టీతో గెలిపించారు. అదికారం వచ్చాక వారిని ఏమి ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే సుమారు 35 విభాగాలను ప్రైవేటువారికి అప్పగించడానికి రంగం సిద్దం చేశారు. కొన్నివేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. ప్రభుత్వానికి ఈ సంస్థ ద్వారా వచ్చిన ఆదాయం ఎంత అన్నదాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. విశాఖకు ఒక ఐడెంటిటిగా ఉన్న ఈ ప్లాంట్ భవిష్యత్తును గందరగోళంలోకి ప్రభుత్వమే నెడుతున్నట్లుగా కనిపిస్తుంది. కేంద్రం ఈ విషయంలో చాలాకాలం గా స్పష్టంగా ఉన్నా,చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారు దీనిపై కార్మికులను ఎన్నికలకు ముందు మభ్యపెట్టడానికి సెంటిమెంట్ డైలాగులువాడారు. పైగా విశాఖ స్టీల్ ను ప్రైవేటుపరం చేయవద్దని తీర్మానం చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వంనై అభాండాలు మోపారు.ప్లాంట్ కు ఉన్న భూములలో కొంత భాగాన్ని అమ్మి ప్లాంట్ ను రక్షించుకుందామని ఆనాటి ప్రభుత్వం ప్రతిపాదిస్తే చాలా ఘోరం జరిగిపోతోందని చంద్రబాబు గగ్గోలు పెట్టారే!ఇప్పుడు ఏకంగా భూమితో పాటు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటువారికి అప్పనంగా ఇచ్చేసేలా ఉన్నారు. దీనిపై కార్మిక సంఘాలు కాని, రాజకీయ పార్టీల నేతలు కాని విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ప్రశ్నిస్తే కేసులు పెట్టడానికి పోలీసులు సిద్దంగా ఉంటారు. ఎక్కడ లేని విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి లక్ష్యాల ప్రకారమే జీతాలుఇవ్వాలని యాజమాన్యం తలపెట్టిందట. ఇది పుండుమీద కారం చల్లడమే అవుతుందనిపిస్తుంది. పని చేయకపోయినా జీతాలు ఇవ్వాలా అన్న ప్రశ్న వేసిన చంద్రబాబుకు కార్మికులు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. సూపర్ సిక్స్ అని, ఎన్నికల మానిఫెస్టో అని 150 హామీలు ఇచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అనేక హామీలను ఎగవేస్తోంది కదా! అలాంటి ప్రభుత్వం కొనసాగడం ఎలా కరెక్టు అవుతుందన్నది వారి సందేహంగా ఉంది. నిత్యం అసత్య ప్రచారాలతో కాలాక్షేపం చేస్తున్న చంద్రబాబు సర్కార్ లోని మంత్రులకు ఎందుకు జితాలివ్వాలని జనం అడగవచ్చా? ప్రభుత్వంలోని సిబ్బందికి కూడా ఇలాగే ఏమైనా కండిషన్లు పెట్టబోతున్నారా?అని వారు అడుగుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రత్యేక విమానాలలో , హెలికాప్టర్లలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లు తరచుగా పర్యటిస్తున్నారు కదా!వారికి అలా తిరిగే అధికారం ఉందా?లేకపోతే ఈ ఖర్చును జనం ఎందుకు భరించాలి. దేశవ్యాప్తంగా మరో నాలుగు ఉక్కు కర్మాగారాలను ప్రైవేటైజ్ చేయడానికి కేంద్రం ప్రతిపాదించి, ఆ రాష్ట్రాలలో వచ్చిన నిరసన దృష్ట్యా వెనక్కి తగ్గిందట. కాని ఆంధ్రులకు ఆ చేవ లేదని భావించిందో ఏమో కాని, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై ముందుకు వెళుతోందన్న అభిప్రాయం ఏర్పడింది.దానికి చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు ఇవ్వడం విషాదం. ఏది ఏమైనా విశాఖ ఉక్కు విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా డబాయిస్తున్నానులే అనుకుంటుండవచ్చు. కాని ఉత్తరాంధ్రకే కాదు.. ఆంధ్ర ప్రజల సెంటిమెంట్‌కు ఆయన ద్రోహం చేసినట్లే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన గుర్తుంచుకుంటే మంచిది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
Margani Bharath: ఎవరిని బెదిరిస్తావ్ బుర్ర లేకుండా మాట్లాడకు..
-
చంద్రబాబు ఏం చెప్పినా ఇక నమ్మం స్టీల్ ప్లాంట్ కార్మికుల ఫైర్
-
ఆ మాటలు దారుణం.. దుర్మార్గం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును కాపాడే బాధ్యతను భుజస్కందాలపైకి ఎత్తుకొని.. కేంద్రంతో పోరాడాల్సిన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి.. ఉద్యోగులు పని చేయడం లేదనడం దారుణం, దుర్మార్గం అని ఉద్యోగ, కార్మిక, వామపక్ష నేతలు మండిపడుతున్నారు. పని చేయకుండా ఎలా జీతాలివ్వాలని, తెల్ల ఏనుగులా మారారని విశాఖ ఉక్కు కార్మికులపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీఎం బాధ్యత లేకుండా అలా ఎలా మాట్లాడారని... ఇది బాబు నిర్వాకమే అని ఆదివారం కార్మిక వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.సీఎం చేసిన వ్యాఖ్యలను స్టీల్ ప్లాంట్ జేఏసీ, వామపక్షాల నేతలు తిప్పి కొడుతూ వాస్తవాలు వివరించారు. ‘చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో గంగవరం పోర్టులో స్ట్రైక్ జరిగింది. ఆ సమయంలోనే ప్రోడక్టివిటీ 29 శాతానికి పడిపోయింది. సమ్మె ముగిసిన తర్వాత.. మళ్లీ రా మెటీరియల్ రావడంతో ఉత్పత్తి పెరగడం మొదలైంది. ఇప్పుడు 70 శాతానికి చేరుకుంది. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చొరవ ఏదీ లేదు. స్టీల్ ప్లాంట్ ఈ దుస్థితిలో ఉండటానికి గల కారణాలను వారింకా ఇలా వివరించారు.అన్‌సీజన్‌లో ఫర్నేస్‌లు ఎందుకు ప్రారంభించారు?‘ఉత్పత్తి చెయ్యడంలో ఉద్యోగులు విఫలమయ్యారనడం సరికాదు. గతేడాది సింగిల్ ఫర్నేస్ మాత్రమే అందుబాటులో ఉంది. రెండు ఫర్నేస్‌లు షట్‌డౌన్ చేశారు. సింగిల్ ఫర్నేస్ లక్ష్యానికి అనుగుణంగా అప్పుడే 90 శాతం ఉత్పత్తి సాధించింది. సాధారణంగా వర్షాకాలం అన్ సీజన్ ఉంటుంది. ఇది ప్లాంట్ ప్రారంభించినప్పటి నుంచి జరిగింది. కానీ.. ఈ సారి విచిత్రంగా జూన్ నెలలోనే షట్డౌన్లో ఉన్న రెండో ఫర్నేస్‌ని ప్రారంభించారు. రా మెటీరియల్ హ్యాండ్లింగ్ పాయింట్లో వర్షాకాలంలో ఇబ్బందులు వస్తాయి. ఎక్విప్మెంట్ ఆపరేటింగ్‌కు ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పట్లో 4 వేల మంది కార్మికుల్ని తొలగించారు. వర్షాకాలంలో మార్కెట్ లేదు. ఈ కారణంగా ఉత్పత్తి తగ్గుముఖం పట్టిందే తప్ప.. ఉద్యోగులు పని చేయక పోవడం వల్ల కాదన్న విషయం బాబు తెలుసుకోవాలి. ఉద్యోగి ప్రొడక్టివిటీ ఎంతో తెలుసా?ప్రతి స్టీల్ ప్లాంట్‌లోనూ ప్రొడక్టివిటీకి ఒక కొలబద్ద ఉంటుందన్న విషయం సీఎంగా చంద్రబాబు తెలుసుకోవాలి. ఒక ఉద్యోగి సంవత్సరానికి సగటున ఎన్ని టన్నులు ప్రొడ్యూస్ చేశారన్నదానితో ప్రొడక్టివిటీని అంచనా వేస్తుంటారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగి సగటు ప్రొడక్టివిటీ 785 టన్నులుగా ఉంది. సెయిల్‌లో 625 టన్నులు మాత్రమే. ఈ లెక్కన ఎవరు పని చేస్తున్నారు.. ఎవరు పని చెయ్యడం లేదో ఇప్పుడు చెప్పండి చంద్రబాబూ. ప్రతిసారీ జీతాలివ్వాలంటే ఎలా.. అని చంద్రబాబు మాట్లాడటం సరికాదు. ఇప్పటికీ.. ప్లాంట్‌లో పని చేసిన వారికి జీతాలు, పెన్షన్లు మూడున్నర నెలలు పెండింగ్‌లో పెట్టారు. 800 మంది వితంతువుల పెన్షన్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.వీరి నుంచి రూ.200 కోట్లు డిపాజిట్లు తీసుకున్నా.. పెన్షన్లు మాత్రం ఇవ్వలేకపోతున్నారెందుకు? ఎంతసేపూ రూ.12 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చామని చెబుతున్నారే.. అసలీ ప్యాకేజీ డబ్బులు ఎక్కడికి వెళ్లాయో తెలుసా? ఇచ్చిన ప్యాకేజీ మొత్తం బ్యాంకుల రుణాల చెల్లింపులకే సరిపోయాయి. ఐదేళ్ల నుంచి ప్రమోషన్లు లేవు. ఈడీలు 15 మంది ఉండాల్సి ఉండగా.. ఒక్కరూ లేరు. ఇన్ని లోపాలు పెట్టుకొని.. ఈ లోపాలన్నీ ఉద్యోగులవే అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడటం టాపిక్‌ను డైవర్షన్ కోసమే’ అని మండిపడ్డారు.మీ ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకే.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం కూడబలుక్కొని నష్టాల్లోకి నెడుతున్నాయి. ఈ ద్రోహాన్ని కప్పి పుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్టీల్ ప్లాంట్ కార్మికులపై అభాండాలు వేశారు. కార్మికులు పని చేయకపోతే గవర్నమెంట్ ఎక్కడ నుండి డబ్బులు తెస్తుందని సీఎం మాట్లడటం సరికాదు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు పని చేయకపోతే ప్లాంట్ 3.4 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం నుంచి 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి ఎలా పెరిగింది? – సీహెచ్ నర్సింగరావు, స్టీల్ ప్లాంట్ జేఏసీ చైర్మన్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిప్యాకేజీలో పెట్టిన ఆంక్షలు తెలీదా?విశాఖ ఉక్కు కోసం రూ.12 వేల కోట్ల నిధులు సమకూర్చారని చంద్రబాబు మాట్లాడారు. ఈ నిధులు జీఎస్టీకి, బ్యాంకు అప్పులు, ఇతర అప్పులు తీర్చడానికి మాత్రమే. ఉద్యోగులు, కార్మికులు తొలగింపునకు, సంస్థ ఉత్పత్తికి, ముడి సరకుకు, యంత్రాల మరమ్మతులకు, కొత్త యంత్రాలు, స్పేర్ పార్ట్స్ కొనుగోలుకు, ఉద్యోగుల జీత భత్యాలకు చెల్లించరాదని ఆంక్షలు పెట్టిన సంగతి సీఎంకి తెలియదా? – జగ్గునాయుడు, స్టీల్ ప్లాంట్ అఖిల పక్ష కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ -
స్టీల్ ప్లాంట్ కార్మికులపై చంద్రబాబు ‘సమ్మిట్ ఫ్లాప్’ కోపం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పెట్టుబడుల సదస్సు అట్టర్ ఫ్లాప్ కావడంతో సీఎం చంద్రబాబు ఆ కోపాన్ని, అసహనాన్ని స్టీల్ ప్లాంట్ కార్మికులపై ప్రదర్శిçÜ్తున్నారని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఖరీదైన భూములను ఇప్పటికే తమ వారికి పప్పుబెల్లాల్లా కట్టబెట్టిన చంద్రబాబు కన్ను ఇప్పుడు రూ.లక్షల కోట్ల ఖరీదైన స్టీల్ ప్లాంట్ భూములపై పడిందన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా వైఎస్సార్ సీపీ పోరాడుతుందని, కార్మికులకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.ఇంకా ఆయన ఏమన్నారంటే, ‘కుమారుడు లోకేశ్ రాజకీయ భవిష్యత్ కోసం ప్లాంట్ ప్రైవేటీకరణకు చంద్రబాబు కేంద్రానికి సహకరిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వనని గతంలో హామీ ఇచి్చన చంద్రబాబు ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలకు, ప్లాంట్ ఉద్యోగులకు వెన్నుపోటు పొడుస్తున్నారు. మూడు నెలలుగా సీఐఐ సమ్మిట్ పేరిట దేశ, విదేశాల్లో సైతం పర్యటించినా సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రభుత్వ హడావుడి తప్ప నిర్దేశించుకున్న లక్ష్యంలో కనీసం 50 శాతం పెట్టుబడులు కూడా రాలేదనే విమర్శలున్నాయి. దానికి నిన్న చంద్రబాబు సమ్మిట్‌లో విశాఖ ఉక్కు గురించి అసహనంతో మాట్లాడిన మాటలే నిదర్శనం.స్టీల్ ప్లాంట్‌ను తెల్ల ఏనుగుతో పోల్చుతూ... ప్లాంట్ కార్మికులే నష్టాలకు కారణమనడం దారుణం. ఆయన మాటలు వింటుంటే అసలు స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడమే కాకుండా, విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉంచుతారా? లేదా? అన్న అంశంపైసైతం సందేహం కలుగుతోంది. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని కార్మికులకు క్షమాపణ చెప్పాలి’ అని పేర్కొన్నారు. సమావేశంలో సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల శ్రీనివాస్ దేవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఐఆర్ చట్టవిరుద్ధం
సాక్షి, అమరావతి: సమగ్ర ఓటర్ల సవరణ(ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని రాష్ట్రంలో నిలిపివేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయకుండానే పోలింగ్ బూత్ స్థాయి వరకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేపట్టడం చట్టవిరుద్ధమైందని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి పూనుకోవడాన్ని తప్పుబట్టారు. దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఎస్ఐఆర్ అమలు చేయడానికి వ్యతిరేకిస్తూ సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం(ఎంబీవీకే)లో ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ఎస్ఐఆర్ను నిలిపివేయాలని అన్ని పారీ్టలు ఎన్నికల సంఘాన్ని కలిసి వినతిపత్రం అందించాలని తీర్మానించింది. సమావేశంలో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ ఎస్ఐఆర్పై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తోందని విమర్శించారు. ఎస్ఐఆర్ అమలుపై టీడీపీ, జనసేన వైఖరి స్పష్టం చేయాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు. అఖిలపక్షం ఎందుకు నిర్వహించడం లేదు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్ఐఆర్ రెండో దశ జాబితాలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ పేరును ప్రకటించలేదని, అయినా రాష్ట్రంలో ఎస్ఐఆర్ అమలుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తుండడం చట్ట విరుద్ధమన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ మాట్లాడుతూ దామాషా పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని, ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులపై బాబు వ్యాఖ్యలు తగవు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నియంతృత్వం పోకడలకు అద్దంపడుతున్నాయన్నారు. ఏపీలోనూ 2024 ఎన్నికల్లో 40శాతం ఓట్లు వచి్చన వైఎస్సార్సీపీకి 11 సీట్లు వచ్చాయని, ఓట్లు ఎక్కువ వచి్చనా సీట్లు తగ్గాయని, ఈ విధానంలో మార్పు రావాలన్నారు. ఇంకా ఈ సమావేశంలో జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్, సిపిఐ ఎంఎల్(లిబరేషన్) నాయకులు బంగార్రాజు, ఆర్ఎస్పి నాయకులు జానకిరాములు, వీసీకే పార్టీ నాయకులు విద్యాసాగర్, ఆప్ నేత నేతి మహేశ్వరరావు, ఎస్‌యూసీఐ నాయకులు సు«దీర్, సీపీఐఎంఎల్(న్యూడెమోక్రసీ) నాయకులు రామకృష్ణ, ఎంసీపీఐయూ నాయకులు ఖాదర్ బాషా, రెడ్‌ఫ్లాగ్ నాయకులు ప్రసాద్, ఐలూ రాష్ట్ర నాయకులు సుధాకర్, భారత్ బచావో నాయకులు భాస్కరరావు మాట్లాడారు. అనంతరం విశాఖస్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సమావేశం తీర్మానించింది. -
స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైఎస్ జగన్ భరోసా
-
బాబుకు బిగ్ షాక్.. జగన్ ను కలవనున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు
-
రాయ్‌పూర్: స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం.. ఆరుగురు మృతి
ఛత్తీస్‌గఢ్: రాయ్‌పూర్‌లోని స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం జరిగింది. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. పలువురికి గాయపడ్డారు. శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకున్నారు.ఈ ఘటన నగర శివార్లలోని సిల్తారా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న గోదావరి ఇస్పాత్ లిమిటెడ్ ప్లాంట్‌లో జరిగింది. గాయపడినవారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కూలిన శిథిలాలను తొలగిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రాయ్‌పూర్ ఎస్పీ లాల్ ఉమ్మద్ సింగ్ తెలిపారు. -
విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత చంద్రబాబుదే
సీతంపేట: ‘విశాఖ ఉక్కును కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే అధికారంలో ఉన్న పాలకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారు.’ అని అఖిలపక్ష రాజకీయ, ప్రజా సంఘాల నేతలు స్పష్టంచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించి, ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గురువారం విశాఖపట్నం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో అఖిలపక్ష రాజకీయ, ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ ‘చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత ముఖ్యమంత్రిదే అని చెప్పారు. ఇప్పుడు ప్రైవేటీకరణను ఆపాల్సిన బాధ్యత చంద్రబాబుదే.ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒకేమాటపై నిలబడ్డాయి. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు మోదీ ముందు సాగిలపడ్డారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వారిపై ఆధారపడి ఉంది. కేంద్రాన్ని విశాఖ ఉక్కు విషయంలో గట్టిగా నిలదీసి తెలుగు ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించాలి. ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులు, 1,400 మంది శాశ్వత ఉద్యోగులను తొలగించినా, 44 విభాగాల ప్రైవేటీకరణకు టెండర్లు పిలిచినా కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కాపాడామని పాలకులు చెప్పడం హాస్యాస్పదం.విశాఖ ఉక్కు కర్మాగారం గురించి దు్రష్పచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అనడం సరికాదు. ప్రధాని మోదీని ఒప్పించి ప్రైవేటీకణ ఆపే దమ్ము మాధవ్‌కు ఉందా?. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పోరాటానికి సిద్ధమవుతున్నాం. ఈ నెల 12న విజయవాడలో సమావేశం పెట్టాం. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు’ అని పేర్కొన్నారు. పవన్‌కళ్యాణ్ జవాబు చెప్పాలి ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉప్పు, కారం తినడం లేదా? అని పవణ్‌కళ్యాణ్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక ఆయన ఉప్పు కారం తింటున్నారో.. లేదో జవాబు చెప్పాలి. పవన్‌కళ్యాణ్ విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటు. ఆయన రుషికొండ భవనంలో పెచ్చులు ఊడిపోతున్నాయని మీడియాను తీసుకెళ్లి డ్రామాలాడటం హాస్యాస్పదం. స్టీల్‌ప్లాంట్ కార్మికులను తొలగిస్తే అడ్డుకోవాల్సిన టీడీపీ ప్రజాప్రతినిధులు.. రూ.రెండు లక్షలు, రూ.మూడు లక్షలు డబ్బులిచ్చి చాలామంది ఉద్యోగాల్లోకి వచ్చారని చెప్పడం దుర్మార్గం’ అని అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జీవీఎంసీలో వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర ప్రజాసంస్థ కన్వినర్ వీవీ రమణమూర్తి, సీపీఐ జిల్లా కార్యదర్శి రెహమాన్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఏవీ వర్మరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్కేఎస్వీ కుమార్, సీపీఐ ఎంఎల్, ఏఐటీయూసీ, స్లీట్ ప్లాంట్ గుర్తింపు సంఘం, వివిధ ప్రజా, కార్మిక సంఘాల నాయకులు వై.కొండయ్య, గణేష్ పాండా, కె.దేవా, డి.ఆదినారాయణ, ఆర్.రవీంద్రనాథ్, ఏజే స్టాలిన్, ఎం.పైడిరాజు మాట్లాడారు. -
స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేతలపై TDP ఎంపీ భరత్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Big Question: కార్మికులు రోడ్డున పడుతుంటే రుషికొండలో ఏం చేస్తున్నావ్ పవన్
-
జగన్ చెప్పిందే నిజమైంది.. అమ్మకానికి స్టీల్ ప్లాంట్!
-
Steel Plant Employees: పరిపాలనా భవనం ఎదుట కార్మికుల ఆందోళన
-
అమ్మకానికి స్టీల్ ప్లాంట్ కుంగిన పోలవరం కాఫర్ డ్యాం
-
విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనం వద్ద కార్మికుల నిరసన
-
స్టీల్ ప్లాంట్ లో రెండు విభాగాలు ప్రైవేటు పరం చేసేందుకు నిర్ణయం
-
విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఉద్రిక్తత
-
విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో 1,500 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు
-
‘చంద్రబాబు, పవన్‌లు ఇప్పుడు ఎక్కడున్నారు?’
విశాఖ: స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఉద్రిక్తతలకు దారి తీసింది. తమను విధుల్లోకి తీసుకోకపోతే నిరసనకు దిగుతామని రెండు రోజుల క్రితం హెచ్చరించిన కాంట్రాక్ట్ కార్మికులు.. దానిలో భాగంగానే ఈరోజు(శుక్రవారం) సమ్మెకు పూనుకున్నారు. రోడ్డుపైనే బైఠాయించిన కార్మికులు.. తమను తొలగిస్తే సహించబోమని హెచ్చరించారు. దీంతో కూర్మన్నపాలెం ఆర్చ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్ట్ కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంట్రాక్ట్ కార్మికులను బలవంతంగా అరెస్ట్ చేశారు పోలీసులు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఇప్పుడు ఎక్కడున్నారు?‘కాంట్రాక్ట్ కార్మికులకు తొలగిస్తే సహించం. తొలగించిన వారిని వెంటనే విధుల్లో తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్ ను ఆదుకుంటామన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎక్కడున్నారు. మాతో మీకు అవసరం తీరిపోయింది కాబట్టి నోరు మెదపడం లేదా?, స్టీల్ ప్లాంట్ టెంట్ దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మద్దతు తెలిపిన విషయాన్ని మర్చిపోయారా? , కార్మికుల కష్టాలు మీకు కనిపించడం లేదా?. త్వరలోనే నిరవధిక సమ్మెకు దిగుతాం’ అంటూ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించారు కాంట్రాక్ట్ కార్మికులు. -
ప్రైవేటీకరణపై ముందుకే..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది! ఇప్పటికీ తాము గతంలో ప్రకటించిన విధంగా పెట్టుబడుల ఉపసంహరణ... ప్రైవేటీకరణ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) కార్యదర్శి అజయ్ నాగ్‌పాల్ స్పష్టంగా వెల్లడించారు.విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏమైనా మారిందా? తెలియ చేయాలంటూ విశాఖ ఉక్కు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పాడి త్రినాథ్‌రావు ఈ నెల 2వతేదీన దాఖలు చేసిన దరఖాస్తుపై స్పందిస్తూ లేఖ పంపారు. దీనికి సంబంధించి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) తీసుకున్న నిర్ణయంలో ఇప్పటివరకూ ఎటువంటి మార్పు లేదని ఈ నెల 18వతేదీన రాసిన లేఖలో స్పష్టం చేశారు.తద్వారా విశాఖ స్టీలు ప్లాంట్‌కు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ తాత్కాలికమేనని.. అది ఉద్యోగుల పెండింగ్ జీతభత్యాలు, స్వచ్చంద పదవీ విరమణల కోసమేనని తేలిపోతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలంటూ అటు కార్మిక సంఘాలు, ఇటు వైఎస్సార్సీపీ గట్టిగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ప్యాకేజీ ప్రకటించగానే కూటమి పార్టీల సంబరాలు..స్టీలు ప్లాంటుకు కేంద్రం రూ.11,400 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన వెంటనే టీడీపీ కూటమి నేతలు పోటీపడి సంబరాలు చేసుకున్నారు. ఇదంతా చంద్రబాబు ఘనత అంటూ టీడీపీ టపాసులు కాల్చగా.. అంతా పవన్ వల్లేనంటూ జనసేన ఢంకా మోగించింది. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే ఇది సాధ్యమైందని సీఎం చంద్రబాబు ఘనంగా చెప్పుకోగా ప్యాకేజీతో వేల కుటుంబాల్లో కొత్త ఆశ చిగురించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.అయితే స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదని ప్యాకేజీ ప్రకటించిన తరువాత చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 1,150 మంది ఉద్యోగులకు వీఆర్ఎస్ అమలుతోపాటు 3,500 మంది కాంట్రాక్టు సిబ్బందిని తొలగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై పోరాడుతున్న కార్మిక సంఘాలను అణచివేసేందుకు షోకాజ్ నోటీసుల జారీ లాంటి చర్యల ద్వారా ప్రైవేటీకరణ వైపే కూటమి పార్టీలు అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా కేంద్ర ఆర్థికశాఖ లిఖితపూర్వకంగా తన అభిప్రాయం మారలేదని అధికారికంగా వెల్లడించింది.దీనిపై కూటమి పార్టీల నేతలు కిమ్మనడం లేదు. విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయడంతో పాటు బొగ్గు గనులున్న సెయిల్‌లో విలీనం చేయడం ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని కార్మికులు, కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణను పూర్తిగా నిలిపివేస్తున్నామన్న ప్రకటన కేంద్రం నుంచి వచ్చే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తూ వస్తున్నాయి.కార్మిక నేతలకు బెదిరింపులు..!ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కూడా ఉక్కు ఉద్యోగులకు ఇంకా రెండు నెలల జీతాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్లాంటు తేరుకోగానే ప్రైవేటీకరణ చేసే ప్రమాదం ఉందన్న ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతోంది. కార్మికుల గొంతు నొక్కేందుకు పోరాట కమిటీ నేత అయోధ్యరామ్‌కు జారీ చేసిన షోకాజ్ నోటీసులను యాజమాన్యం ఉపసంహరించుకోవాలని సంఘాలు, వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తున్నా ఇంతవరకు స్పందించలేదు. వీఆర్ఎస్, తొలగింపుల పర్వం..స్టీలు ప్లాంటులో ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్), కాంట్రాక్టు కార్మికుల తొలగింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 1,050 మంది ఉద్యోగులు వీఆర్ఎస్ పొందేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. రెండో దఫా వీఆర్ఎస్కు కూడా యాజమాన్యం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక కాంట్రాక్టు కార్మికులను ఇష్టారాజ్యంగా తొలగిస్తూ ఇప్పటికే 364 మందిపై వేటు వేశారు. మొత్తం 3,500 మంది కాంట్రాక్టు కార్మికులపై కత్తి వేలాడుతోంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణకే కూటమి ప్రభుత్వం కొమ్ము కాస్తున్నట్లు స్పష్టమవుతోంది.వైఎస్సార్ సీపీ దీర్ఘకాలిక పోరాటంవిశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ మొదటి నుంచి ఒకే విధానాన్ని అనుసరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనను వెనక్కి తీసుకునేవరకూ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసింది. వైఎస్సార్ సీపీ దీర్ఘకాలం పాటు ఒత్తిడిని కొనసాగించడంతో ప్రైవేటీకరణపై కేంద్రం అడుగు ముందుకు వేయలేకపోయింది.మోసం చేస్తున్నారు...స్టీల్ ప్లాంట్ కార్మికులు, స్థానిక ప్రజలను కొంతకాలంగా రాజకీయ నాయకులు మోసం చేస్తున్నారు. ప్రైవేటీకరణ ఆగడం లేదని మేం చెబుతూనే ఉన్నాం. 2021లో ఇచ్చిన ప్రకటనను వెనక్కి తీసుకోలేదు. అది వెనక్కి తీసుకోనంత వరకూ ప్రైవేటీకరణ కత్తి విశాఖ స్టీలుపై వేలాడుతూనే ఉంటుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. నాకు ఇచ్చిన సమాచారంతో ఇది నిజమని తేలిపోయింది. విశాఖ స్టీలు ప్లాంటుపై ఉక్కు శాఖ మంత్రి నుంచి అందరూ మోసం చేస్తూనే ఉన్నారు. 2021లో చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుని, స్టీలు ప్లాంటును ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటించాలి. – పాడి త్రినాథరావు, జనరల్ సెక్రటరీ, విశాఖ స్టీలు ఎంప్లాయిస్ యూనియన్ (కేంద్ర నుంచి సమాచారం కోరిన దరఖాస్తుదారుడు)ఉపసంహరించుకోవాల్సిందే...స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ ఇచ్చాం... ప్రైవేటీకరణ కొనసాగుతుందంటే కుదరదు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందే. ప్లాంట్ పరిరక్షణ కోసం మా పోరాటం కొనసాగుతుంది. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసి సొంత గనులు కేటాయించాలి. ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులను కుదిస్తూ తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకునేలా కేంద్రంపై టీడీపీ కూటమి సర్కారు ఒత్తిడి తేవాలి. – జె.అయోధ్యరామ్, గౌరవాధ్యక్షులు, స్టీల్ సీఐటీయూనైజం బయటపడింది...‘దీపం’ ప్రకటన ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న కూటమి పార్టీల నైజం బయటపడింది. ప్రజలను మభ్యపెట్టడానికి ప్యాకేజీ అంటూ ప్రకటనలు చేశారు. ప్లాంట్‌కు, ఉద్యోగులకు పనికిరాని ఆ ప్యాకేజీ ఎవరికి ఉపయోగం? ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేవరకు పోరాటం కొనసాగిస్తాం. – నీరుకొండ రామచంద్రరావు, చీఫ్ పేట్రన్, స్టీల్ ఐఎన్టీయూసీ -
విశాఖ ఉక్కు కార్మికులకు కేంద్రమంత్రి కుమారస్వామి షాక్
-
కేంద్ర మంత్రి కుమారస్వామికి నిరసన సెగ
-
YSRCP ప్రభుత్వ చర్యల వల్లే ఆగిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ
-
విశాఖ స్టీల్ ప్లాంట్‌ని సెయిల్ విలీనం చేయాలని డిమాండ్
-
అప్పటిదాకా బాబు, పవన్‌లను నమ్మం: విశాఖ ఉక్కు కార్మికులు
విశాఖపట్నం, సాక్షి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయకుండా అటు కేంద్రం నాన్చుతోంది. మరోవైపు ఇటు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ జరగబోదంటూ తెర వెనుక ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో.. ‘‘విశాఖ ఉక్కుకు ప్యాకేజీ’’ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి.ప్యాకేజీ అనేది కంటి తుడుపు చర్య. అది శాశ్వత పరిష్కారం ఎంత మాత్రం కాదు. ఇచ్చిన ప్యాకేజీ రెండు మూడు నెలలకు మించి సరిపోదు. ప్యాకేజీలతో ఒరిగేదేం లేదు. స్టీల్ ప్లాంట్(Steel Plant) బతకాలంటే సెయిల్ లో విలీనం ఒక్కటే మార్గమని సూచిస్తున్నాయి. అలాగే.. స్టీల్ ప్లాంట్ కు సొంతంగా గనుల కేటాయించాలన్న డిమాండ్‌ను మరోసారి ప్రస్తావించాయి.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ(Steel Plant Privatization) జరగదని ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను కూటమి నేతలు నిలబెట్టుకోవాలని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ జరగదని హామీ ఇస్తేనే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను నమ్ముతాం అని కార్మికులు చెబుతుండడం గమనార్హం.సాక్షి టీవీతో ఉక్కు పోరాట కమిటీ నేతలు మాట్లాడుతూ.. ముడి సరుకు కొనుగోలుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే ప్యాకేజీతో కొత్తగా స్టీల్ ప్లాంట్ కు ఒరిగేది లేదు. కార్పొరేట్ల ఒత్తిడి మేరకే..ప్యాకేజి ప్రకటించారు. ప్యాకేజీ మొత్తం బకాయిలకే పోతుంది... శాశ్వత పరిష్కారం చూపే వరకూ మా పోరాటం ఆగదు. ప్రజల్లో మమ్మల్ని చులకన చెయ్యాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతీసారి డబ్బులు ఇవ్వలేమని చంద్రబాబు చెప్పారు. మాకు మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు విలీనం చెయ్యండి. మాకు అప్పు అవసరం లేదు. ఉన్న అప్పులను ఈక్విటీగా మార్చాలి. సెయిల్ లో విలీనం ఒక్కటే పరిష్కార మార్గం. అలాగే సొంత గనులు కేటాయించాలి అని ఉక్కు పోరాట కమిటీ నేతలు అంటున్నారు. -
నాలుగు నెలలుగా జీతాలు లేవని ఆందోళన చేస్తున్న ఉక్కు కార్మికులు
-
జగన్ డిమాండ్లు వినిపించే దమ్ము బాబు, పవన్‌కు ఉందా ?
-
AP: ఉక్కు ఉద్యమంపై ఉక్కుపాదం
విశాఖ సాక్షి: విశాఖ ఉక్కు కార్మికులు చేపట్టిన నిరాహా దీక్షను భగ్నం చేయాలనే యోచన చేస్తోంది ఏపీ ప్రభుత్వం. వారిపై ఉక్కు పాదం మోపేందుకు సమాయత్తమైంది. దీనిలో భాగంగా వారి సెలవుల్ని రద్దు చేయాలని చూస్తోంది. శాంతి భద్రతల పేరుతో నిరాహార దీక్ష చేపట్టిన కార్మికుల సెలులు రద్దు చేస్తున్నట్లు మెయిల్స్ పంపుతోంది. ఇలా మెయిల్స్ పంపడంపై ఉక్కు పోరాట కమిటీ ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది. శాంతి భద్రతలకు ఉక్కు కార్మికులకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తోంది.నిరాహార దీక్ష ప్రారంభంఉక్కు కార్మికుల నిరాహార దీక్ష ప్రారంభమైంది. ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో ఉక్కు కార్మికులు 36 గంటల పాటు నిరసనకు దిగారు. మంగళవారం ఉదయం నుంచి రేపు రాత్రి 8 గంటల వరకు నిరాహార దీక్ష కొనసాగించనున్నారు. ఈ దీక్ష సందర్భంగా విశాఖ ఉక్కుపై ప్రధాని సానుకూల ప్రకటన చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై ప్రధాని మోదీని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు అపాయిట్మెంట్ అడిగారు. అయితే, ఆ అపాయిట్మెంట్పై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. -
బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇక లేనట్లేనా? : MLC కవిత
-
Vizag Steel Plant: మంత్రి కుమారస్వామిని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు కలిశారు.
-
PM Modi AP Tour: మోదీ విశాఖ టూర్ ..
-
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
గాజువాక: విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు పోరాట కమిటీ, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళ, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం గాజువాకలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు మణిహారంగా ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని విజ్ఞప్తి చేశారు.సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రధాని మోదీ తన విశాఖ పర్యటనలో సానుకూల నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో కర్మాగారంపై, కార్మికులపై రుద్దుతున్న ఆర్థిక ఆంక్షలను తక్షణం విరమించుకునేలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్రంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు.పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని సాగుతున్న ఉద్యమానికి రాష్ట్ర అభివృద్ధితోపాటు ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. -
కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్ ఫైర్
-
YSRCP అండగా ఉంటుంది: గుడివాడ అమర్నాథ్
-
ఈనెల 29న విశాఖ రానున్న ప్రధాని మోదీ
-
రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి
-
స్టీల్ ప్లాంట్ రన్ చేసే విషయంలో లోపాలున్నాయి : పవన్ కల్యాణ్
-
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆందోళన
-
Vijay Sai Reddy: చంద్రబాబు చేతులెత్తేశారు
-
స్టీల్ ప్లాంట్‌లో పేలుడు.. 12 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి స్టీల్ ప్లాంట్‌లో జరిగిన పేలుడులో 12 మంది మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. స్థానిక అధికారులు ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను మీడియాకు అందించారు.మెక్సికో నగరానికి తూర్పున 140 కిలోమీటర్ల దూరంలోని అక్లోజ్టోక్లో ఈ పేలుడు సంభవించినట్లు త్లాక్స్‌కాలా స్టేట్ సివిల్ ప్రొటెక్షన్ తెలిపింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. కార్మికుల నుండి వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం కరిగిన ఉక్కు.. నీటి పరిధిలోకి రావడంతో పేలుడు సంభవించి, మంటలు చెలరేగాయి. బాధిత కుటుంబాలను త్లాక్స్కలా గవర్నర్ లోరెనా క్యూల్లార్ పరామర్శించారు. ఈ ఉదంతం దర్యాప్తు పూర్తయ్యేంతవరకూ ప్లాంట్‌ను మూసివేయనున్నారని సమాచారం. ఇది కూడా చదవండి: కలలో ఏనుగు కనిపిస్తే..? ఏమవుతుంది? -
మోడీని బాగా పొగిడారు.. స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు అడగలేదు
-
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వామపక్షాలు ఆందోళన
-
స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్తత.. 200 మంది ఉద్యోగుల అష్టదిగ్బంధనం
సాక్షి,విశాఖపట్నం : స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. వందలాది స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల్ని.. కాంట్రాక్ట్ ఉద్యోగులు అడ్డుకున్నారు. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఆకస్మికంగా తొలగించాలని నిర్ణయించి, వారి ఆన్లైన్ గేటు పాసులను నిలిపివేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లపై స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం రాత పూర్వక హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేదని భీష్మించారు.స్టీల్‌ప్లాంట్‌లో అర్ధరాత్రి రాత్రి వరకు నిరసన చేపట్టారు. ఈడీ వర్క్స్ బిల్డింగ్‌లో సుమారు 200 మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను కార్మికులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఆందోళన కొనసాగిస్తున్నట్లు హెచ్చరించారు. మరోవైపు మా పొట్టకొట్టొద్దని 4వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం నిర్ణయంపై ఆందోళన చేస్తున్నా.. కూటమి నేతలు స్పందించలేదని వాపోతున్నారు. -
స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో గందరగోళం..
-
యాజమాన్యానికి షాకిచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు
-
యాజమాన్యానికి షాకిచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు
సాక్షి,విశాఖపట్నం : స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి ఉద్యోగులు షాకిచ్చారు. 500 మంది ఉద్యోగుల్ని విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి నాగర్ నగర్ స్టీల్ ప్లాంట్‌కు తరలించేందుకు యాజమాన్యం ప్రయత్నం చేసింది. ప్రయత్నాల్లో భాగంగా ఉద్యోగులను పంపుతున్నట్లు సర్య్కులర్ జారీ చేసింది. దీంతో పాటు ఉద్యోగుల ఇంటర్వ్యూలు కోసం 4 బృందాలు ఏర్పాటు చేసింది.కానీ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఉద్యోగులు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి నాగర్ నగర్ స్టీల్ ప్లాంట్‌కు వెళ్లేందుకు ముందుకు రాలేదు. యాజమాన్యం నిర్వహించిన ఇంటర్వ్యూలకు కనీసం 20 మంది ఉద్యోగులు కూడా హాజరు కాలేదు. అయితే, ప్లాంట్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తే గొడవలు జరుగుతాయని చెప్పి ప్రైవేట్ హోటల్స్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఇంటర్వ్యూలు నిర్వహించడం కొసమెరుపుచదవండి : మీకో దణ్ణం చంద్రబాబు : ఆర్కే రోజా -
లాభాల్లో ఉన్నా అమ్మేశారు
ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. కార్మిక, ఉద్యోగ సంఘాల ఆందోళనలను పట్టించుకోకుండా ఉక్కు పరిశ్రమను ›ప్రైవేట్‌పరం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్లాంట్‌లో బ్లాస్ట్ ఫర్నేస్‌లు మూతబడినా, ఆస్తులను వేలం ద్వారా విక్రయించే ప్రక్రియ చేపట్టినా, కొత్త ఆర్డర్లు తీసుకోకుండా నియంత్రిస్తున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్కు శాఖ ఆధ్వర్యంలో లాభాల్లో ఉన్న ఫెర్రో స్క్రాప్ నిగం లిమిటెడ్ (ఎఫ్ఎస్ఎన్ఎల్) విక్రయానికి పూనుకుంది. ఈమేరకు జపాన్ సంస్థతో ఒప్పందాలు కూడా జరిగిపోయాయి. లాభాల్లో ఉన్న సంస్థను..నష్టాల నెపంతో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు సిద్ధమైన కేంద్రం లాభాల్లో ఉన్న ఎఫ్ఎస్ఎన్ఎల్ సంస్థను సైతం విడిచిపెట్టడం లేదు. లాభాల్లో ఉండటమే కాకుండా రెండేళ్ల పాటు రూ.1,000 కోట్లు ఆర్డర్ ఉన్న సంస్థను ప్రైవేట్‌కు అప్పగించడం విస్మయానికి గురిచేస్తోంది. ఉక్కు శా«ఖ ఆధ్వర్యంలో భిలాయ్ ప్రధాన కేంద్రంగా 1979లో ఫెర్రో స్క్రాప్ నిగం లిమిటెడ్ ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా 10 యూనిట్లు కలిగిన ఈ సంస్థలో 445 మంది శాశ్వత ఉద్యోగులు, 2,500 మంది కాంట్రాక్ట్ కార్మికులున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్, ఇస్కో బర్న్‌పూర్, దుర్గాపూర్, రూర్కెలా, భిలాయ్, నగర్నార్, సేలం, బొకారో స్టీల్ప్లాంట్లతో పాటు హైదరాబాద్‌లోని మిథాని, హరిద్వార్‌లోని బీహెచ్ఈఎల్లో ఈ యూనిట్లు ఉన్నాయి. ఎఫ్ఎస్ఎన్ఎల్ ఆ సంస్థలలోని స్క్రాప్‌ను సేకరించి వాటి అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేసి అందిస్తుంది.రూ.320 కోట్లకు జపాన్ కంపెనీకి విక్రయంఏడాదికి రూ.వంద కోట్ల లాభంతో పాటు డిపాజిట్లు, నిల్వలు భారీగా ఉన్న ఎఫ్ఎస్ఎన్ఎల్ను కేంద్రం కారుచౌకగా జపాన్‌కు చెందిన మెసర్స్ కొనోయ్కి ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ సంస్ధకు రూ.320 కోట్లకు విక్రయించడానికి ఒప్పందం చేసుకుంది. లాభాలను ఆర్జిస్తున్న సంస్థను విక్రయించడమే కాకుండా కారుచౌకగా ప్రైవేట్‌కు అప్పగించడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. స్టీల్‌ప్లాంట్‌ను కూడా కారుచౌకగా ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందన్న ఆరోపణలకు ఇది బలం చేకూరుస్తోంది.న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న ఉద్యోగులుకేంద్ర నిర్ణయం పట్ల ఉద్యోగులు, కార్మికులు మండిపడుతున్నారు. పరిశ్రమలను అమ్ముకుంటూ పోతున్నా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే స్టీల్‌ప్లాంట్ నష్టాల్లో ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని తప్పబడుతున్నారు. నష్టాలను అధిగమించడానికి రూ.2 వేల కోట్లు అడ్వాన్సు రూపంలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు, విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని నిర్ణయించారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.రూ.వెయ్యి కోట్ల ఆర్డర్ ఉన్నా..ఎఫ్ఎస్ఎన్ఎల్ ఏడాదికి రూ.100 కోట్లు లాభం ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థకు రూ.175 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, రూ.36 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. రాబోయే రెండేళ్లకు రూ.1000 కోట్ల ఆర్డర్ కూడా ఉంది. ఈ సంస్థకు స్టీల్ ప్లాంట్ నుంచి రూ.80 కోట్లు, ఇతర ప్లాంట్ల నుంచి రూ.30 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. ఇంత ఆర్థిక పరిపుష్టి కలిగిన సంస్థపై కేంద్రం కన్ను పడింది. 2016లో ఎఫ్ఎస్ఎన్ఎల్ను ప్రైవేటుపరం చేయాలని ఆలోచన చేయడంతో సంస్ధ ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు.దుర్మార్గ చర్యమూడున్నర దశాబ్దాలుగా ప్రభుత్వ రంగంలో సేవలు అందిస్తున్న కంపెనీని ప్రైవేటుపరం చేయడం దుర్మార్గం. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ఈ సంస్థను అమ్మేస్తున్నారు. దీనివల్ల వేలాది మందికి అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. –పి.రాములు, అధ్యక్షుడు, ఫెర్రోస్క్రాప్ ఎంప్లాయీస్ యూనియన్ లాభాల్లో ఉన్న సంస్థను ఎలా అమ్మేస్తారుఫెర్రోస్క్రాప్ ఏటా లాభాలు ఆర్జిస్తోంది. పలు ఆర్డర్లు ఉన్నాయి. నగదు నిల్వలున్నాయి. కేవలం రూ.320 కోట్లు కోసం ఇలా చేయడం వెనుక కుట్ర ఉంది. దీనిపై ఆందోళన కొనసాగిస్తాం. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. – ఎం.అమ్మిరెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఫెర్రోస్క్రాప్ ఎంప్లాయిస్ యూనియన్ -
ప్రైవేటీకరణ వైపు స్టీల్ ప్లాంట్ నిజాలు బయటపెట్టిన CMD
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్.. బాబు యూటర్న్
-
ఈ టైంలో చంద్రబాబు కనిపిస్తే.. రెచ్చిపోయిన కేఏ పాల్
-
కార్మికులను చర్చలకు పిలిచి ఢిల్లీ వెళ్లిపోయిన స్టీల్స్టాంట్ సీఎండీ
-
సెంటిమెంట్ కుదరదు.
-
జనసేన నేత బొలిశెట్టికి స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు వార్నింగ్
-
జనసేన నేత వ్యాఖ్యలను ఖండించిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు
-
స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలను అవమానించిన జనసేన నేత బొలిశెట్టి
-
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు
విశాఖపట్నం, సాక్షి: కార్మిక సంఘాల నాయకులు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేయాలని చూస్తున్నారని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో సోమవారం ఓ వీడియో పోస్ట్ చేశారు. వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘స్టీల్ ప్లాంట్‌ను ఎలా అమ్మేయాలా అని చూస్తున్న వారిలో మొట్టమొదటి స్థానంలో ఉన్నది కార్మిక సంఘాల నేతలే. ఏదో ఒక యూనియన్ తప్ప అందరూ తప్పులు చేస్తున్నారు. ఈ నెల 19న పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు కార్మిక సంఘాల నేతలు వెళ్తున్నారని తెలిసి ఇలా స్పందిస్తున్నా’ అని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2021లో అమిత్‌షా వద్దకు పవన్ కల్యాణ్ వెళ్లి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దంటూ ఉక్కు సెంటిమెంట్‌ను ఆయన దృష్టికి తీసుకెళ్లారని, ఆ సమయానికి స్టీల్‌ప్లాంట్‌లో ఒక్క ఉద్యమం కూడా మొదలవలేదని పేర్కొన్నారు.ప్రైవేటీకరణ ఆగిపోతే ఎక్కడ పవన్‌కు క్రెడిట్ వచ్చేస్తుందోనని ఈ నాయకులు దుకాణాలు తెరిచారని ఎద్దేవా చేశారు. ఉక్కు నిర్వాసితుల్ని పక్కనపెట్టి కార్మిక సంఘాలు పెద్ద టెంట్ పెట్టుకుని తూతూమంత్రంగా ఉద్యమాన్ని నడిపారని ఆక్షేపించారు. అక్టోబర్ 2021లో అఖిలపక్షం వేయాలని డిమాండ్ చేస్తే.. అప్పటి ప్రభుత్వానికి, విజయసాయిరెడ్డికి, బొత్సకు ఎవరికీ పట్టలేదన్నారు. పవన్ కల్యాణ్ నిరాహార దీక్షకు కార్మిక సంఘాల నేతలు ఎవరూ ముందుకురాలేదని, వీరంతా ప్రైవేటీకరణకు పూర్తిగా సహకరించిన వారేనని ఆరోపించారు. 10 ఫిబ్రవరి 2021న ప్రైవేటీకరణ ప్రకటన దశలోనే @PawanKalyan గారు డిల్లీ వెళ్లి కేంద్రంలో అధికారులను, కేంద్ర హోం మంత్రి @AmitShah గారిని కలిసి విశాఖ ఉక్కు కర్మాగారం 32మంది ప్రాణత్యాగం వల్ల వచ్చిందని దీని వెనుక తెలుగు ప్రజల సెంటిమెంటు ఉందని కాబట్టి పెట్టుబడుల ఉపసంహరణ పరిశ్రమల నుండి… pic.twitter.com/c9BCRVidbO— Bolisetty Satyanarayana (@bolisetti_satya) September 16, 2024అప్పటి ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ఊరుకుందన్నారు. అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి, ఒత్తిడి తీసుకొస్తే అప్పుడే ఫలితం వచ్చేదన్నారు. వైఎస్సార్సీపీ నేతలు తామే ఇన్నాళ్లూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపినట్టు చెబుతున్నారని, వారి హయాంలోనే చాపకింద నీరులా ప్రైవేటీకరణ ప్రక్రియ అంతా జరిగిందని వ్యాఖ్యానించారు. నాయకులందర్నీ చాచిపెట్టి కొట్టాలి పవన్‌ను కలిసే ముందు పాత పద్ధతిలో తువ్వాలు మెడకు చుట్టి కొట్టినట్టు.. యూనియన్ నాయకులందర్నీ చాచిపెట్టి కొట్టాలంటూ బొలిశెట్టి పరుష పదజాలాన్ని వాడారు. జనసేన వెంట ఆనాడు రమ్మంటే ఎవరూ రాలేదని, తాళి కట్టించుకోవడం ఒకడితో.. సంసారం మరొకడితో అన్నట్టు కొంతమంది యూనియన్ నాయకుల్ని వెధవలంటూ ధ్వజమెత్తారు. పవన్‌తోపాటు, సీఎం చంద్రబాబును సమన్వయం చేసుకుంటూ అన్ని పార్టీలు కలిసి నిలబడితే తప్ప స్టీల్‌ప్లాంట్‌ను నిలబెట్టుకోలేమని పేర్కొన్నారు.పవన్‌ను కలవాలని పోరాట కమిటీ నిర్ణయం ఉక్కు నగరం: ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు త్వరలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు సోమవారం జరిగిన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ భేటీలో నిర్ణయించారు. ఇటీవల వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు ఉక్కు ఉద్యోగులు సగం రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించారు. సమావేశంలో పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, కేఎస్ఎన్ రావు, అయోధ్యరామ్, నీరుకొండ రామచంద్రరావు, జి.గణపతిరెడ్డి, రామ్మోహన్కుమార్, కామేష్, వరసాల శ్రీనివాసరావు, శ్రీనివాసనాయుడు, సురేష్ పాల్గొన్నారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ, టీడీపీ డబుల్ గేమ్..
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడానికి మా పార్టీ దేనికైనా సిద్ధం
-
స్టీల్ ప్లాంట్ కోసం మహాధర్నా
-
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అతి పెద్ద ద్రోహం
విశాఖ సిటీ : ‘భయపడినంతా అయింది. చంద్రబాబు హయాంలో వైజాగ్ స్టీల్ మూసివేత/ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది. బ్లాస్ట్ ఫర్నేస్–3ను నిలిపివేయడం స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల గొంతుకోయడమే. తెలుగు జాతికిది అతిపెద్ద ద్రోహం. గతంలో చంద్రబాబు ఇచి్చన హామీలన్నీ గాలికి కొట్టుకుపోయాయి’.. అని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఓ ప్రకటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ఆయన ఇంకా ఏం పేర్కొన్నారంటే.. కేంద్రంలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్నా.. స్టీల్ ఫ్యాక్టరీని కొనసాగించే ప్రయత్నం చేయకపోవడం క్షమించరాని ద్రోహం. టీడీపీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టింది. ఏమాత్రం పట్టింపు ఉన్నా.. చంద్రబాబు తక్షణం ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలి. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు వైజాగ్ స్టీల్‌ను కంటికి రెప్పలా కాపాడారు. మూత వేయడమే పరిష్కారం కాదని ఆయన అనేకసార్లు చెప్పారు. స్టీల్ ఫ్యాక్టరీని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలోగానీ, ఎన్ఎండీసీలో గానీ విలీనంచేసి, ఇనుప ఖనిజ గనులు కేటాయిస్తే లాభాల్లోకి తీసుకురావచ్చని సూచించారు. ఐదేళ్లుగా మౌనంగా ఉన్న కేంద్రం ఇప్పుడు హఠాత్తుగా మూసివేతకు సాహసం చేస్తోందంటే చంద్రబాబు స్వప్రయోజనాలు, ఆయన వైఖరే కారణం అనడంలో సందేహంలేదు. విశాఖ ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రాజీనామా చేసి పోరాటానికి సిద్ధంకావాలి.ఉత్తరాంధ్ర తలను నరకడంగా భావించే ఈ దుర్మార్గాన్ని ప్రజలంతా ఎండగట్టాలి. చంద్రబాబు ప్రజా సంపదను అమ్మకానికి పెడుతుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేసి విశాఖ స్టీల్‌ను రక్షించే దాకా పోరాటం సాగిస్తుంది. వైజాగ్ స్టీల్ అనేది రాష్ట్ర ప్రజల ఉద్వేగాలు, ఆత్మగౌరవంతో ముడిపడినది. ఇప్పుడు పోరాడకపోతే వైజాగ్ స్టీల్ అనే రాష్ట్ర గౌరవ చిహ్నం శాశ్వతంగా కనుమరుగైపోతుంది. -
ప్రశ్నార్ధకంగా విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడ
సాక్షి,విశాఖపట్నం : విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడ ప్రశ్నార్ధకంగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఎఫ్ 1ను మూసేసిన ప్లాంట్ అధికారులు.. తాజాగా బ్లాస్ట్ ఫర్నెస్ 3ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్లాంట్‌లోని వరుస పరిణామలపై అటు ఉద్యోగులు.. ఇటు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లు నిలిపివేసి.. కేవలం ఒక బ్లాస్ట్ ఫర్నేస్‌లో కార్యకలాపాలు నిర్వహించడంపై కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. ఉక్కు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం..ఉద్యోగుల జీతాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని వాపోతున్నారు.ఇప్పటి వరకు రెండు బ్లాస్ట్ ఫర్నెస్ లు నడిపితే అరకొరగా ఉత్పత్తి.. ఇకపై ఒక్క బ్లాస్ట్ ఫర్నెస్ తోనే ఉత్పత్తితో కేవలం నెలకు రూ. వెయ్యి కోట్లు మాత్రమే రాబడి వస్తుందని, ఇలా అయితే ప్లాంట్ నిర్వహణ అసాధ్యమని స్టీల్ ప్లాంట్ కమిటీ సంఘాలు నేతలు చెబుతున్నారు. -
ప్రైవేటీకరణ ఆపండి.. సీపీఐ భారీ ర్యాలీ
-
బాబుకు అమరావతి పై ఉన్న శ్రద్ధ స్టీల్ ప్లాంట్ పై లేదు..
-
విశాఖ స్టీల్ వద్ద ఉద్రిక్తత
-
విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ, కార్మిక సంఘాల నేతల మధ్య సమావేశం
-
కూటమి మోసం.. స్టీల్ ప్లాంట్ లో మొదలైన ఉద్యమం
-
చంద్రబాబుకు కార్మికుల డెడ్ లైన్..
-
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కుట్రలు ప్రారంభించిన ఎన్డీయే సర్కారు
-
విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం
-
కేఏ పాల్ ఆమరణ నిరాహార దీక్ష
విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ఆశీల్మెట్టలోని కేఏ పాల్ కన్వెన్షన్ హాల్ ఆవరణలో ఆయన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ నాయకులు కేంద్రానికి బానిసలుగా మారారని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్ కోసం 16 వేల మంది భూదానాలు, 32 మంది ప్రాణాలర్పించారన్నారు. లక్షల కోట్లు లాభాలు తెస్తూ.. రూ.8 లక్షల కోట్లు విలువైన స్టీల్‌ప్లాంట్‌ను రూ.4 వేల కోట్లకు అదానీకి కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. దీనిపై కోర్టులో కేసు వేసినట్టు తెలిపారు. ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ ఇప్పుడు యువతను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధాని మోదీ, చంద్రబాబే కారణమని విమర్శించారు. తెలుగు ప్రజలందరూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ట్వీట్లు, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా తాను రూ.4 వేల కోట్లు, తరువాత రూ.40 వేల కోట్లు ఇచ్చి స్టీల్‌ప్లాంట్‌ను నడిపిస్తానన్నారు. స్టీల్‌ప్లాంట్ ద్వారా ఏడాదికి లక్ష కోట్లు లాభం చూపిస్తానన్నారు. ఉత్తరాంధ్ర నిరుద్యోగులకు పది లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానని పాల్ చెప్పారు. ఇంత పెద్ద స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం దారుణమన్నారు. కేంద్రం ఇస్తామన్న ప్రత్యేక హోదా, ప్యాకేజీ, పోలవరం, స్మార్ట్ సిటీ, రెండు కోట్ల ఉపాధి లేకుండా పోయాయని ఆరోపించారు. రాష్ట్రం అప్పులు భారం తీర్చే సత్తా స్టీల్‌ప్లాంట్‌కు మాత్రమే ఉందన్నారు. యువతి, యువకులు, ప్రజలు తరలివస్తే స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. -
రూ 650 కోట్లతో కడప స్టీల్ ప్లాంట్ కు మౌలిక వసతులు
-
విశాఖ ‘గ్రీన్’ప్లాంట్
ఉక్కు నగరం (విశాఖ): విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిసరాలు ప్రత్యేక వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్లాంట్ స్థలంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి రహదారికి ఇరువైపులా ఉండే పరిసరాలను చూస్తే విశాఖ నగరంలో ఉన్నామా లేక మరెక్కడైనా ఉన్నామా అనే సందేహం కలుగుతుంది. ఉక్కు ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే వేడిని చల్లార్చేలా వాతావరణ సమతుల్యత కోసం తీసుకుంటున్న చర్యల వల్ల నగరంంలో కంటే స్టీల్‌ప్లాంట్ ప్రాంతంలో 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. పర్యావరణ పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించడంతో దేశంలోనే పర్యావరణ హిత ప్లాంట్‌గా ఖ్యాతి గాంచింది. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్టీల్ ప్లాంట్ గ్రీన్ ప్లాంట్‌గా ఎలా మారిందన్నదానిపై ప్రత్యేక కథనం.. ఆగ్రో ఫారెస్ట్ విభాగం ఆధ్వర్యంలో.. స్టీల్‌ప్లాంట్ ప్రారంభం నుంచి పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం స్టీల్‌ప్లాంట్ ఆగ్రో ఫారెస్ట్ విభాగం ఆధ్వర్యంలో మొదటి దశలో టన్ను స్టీల్ ఉత్పత్తికి ఒకటి చొప్పున మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని మూడు మిలియన్ చెట్లు నాటి ఆదర్శంగా నిలిచింది. ప్లాంట్ మొదటి దశలో హరిత వనాల పెంపునకు రూ.360 కోట్లు వ్యయం చేయగా.. విస్తరణ యూనిట్లలో మొక్కల పెంపునకు రూ.1,150 కోట్లు వ్యయం చేస్తున్నారు. నిబంధనల మేరకు పరిశ్రమలోని 33 శాతం గ్రీన్ బెల్ట్‌కు వినియోగించాల్సి ఉండగా.. స్టీల్‌ప్లాంట్ ఆ రికార్డును అధిగమించి 2,600 హెక్టార్లలో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేసింది. 7.2 మిలియన్ మొక్కలు నాటే లక్ష్యం ప్రస్తుతం జరుగుతున్న 7.2 మిలియన్ టన్నుల ఉత్పత్తికి అనుగుణంగా 7.2 మిలియన్ మొక్కలు నాటే లక్ష్యంతో ఆగ్రో ఫారెస్ట్ ముందుకు సాగుతోంది. 2023 మే నెల నాటికి 5.51 మిలియన్ మొక్కలు నాటారు. తుపానులు, సునామి వంటి ఉప ద్రవాలను తట్టుకునేలా సుమారు 24 లక్షల కాజురీనా మొక్కలు నాటారు. కాలుష్యాన్ని నివారించేందుకు 18 లక్షలు ఏఏ ఫోర్మిస్, మామిడి, కొబ్బరి, జీడి, జామ, వేప, సుబాబుల్, సపోటా, రావి, మర్రి, టేకు మొక్కలు నాటారు. అదేవిధంగా 2.50 లక్షల యూకలిప్టస్ మొక్కలు నాటారు. బయోడీజిల్‌ను ప్రోత్సహించేందుకు సుమారు 4.50 లక్షలు పాల్మైరా, పొంగామియా, జట్రోపా మొక్కలు నాటారు. పర్యావరణంతో పాటు సంస్థకు ఆదాయం స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. లక్షలాది మొక్కలను నాటడం ద్వారా నగరంలోని పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తోంది. వివిధ రకాల మొక్కలను పెంచడం ద్వారా సంస్థకు లక్షలాది రూపాయలు ఆదాయం కూడా లభిస్తోంది. సంస్థపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ఆదాయం సమకూరుస్తున్నాం. – వీఎల్పీ లాల్, డీజీఎం, ఆగ్రో ఫారెస్ట్ విభాగం నగర కాలుష్యాన్నీ తగ్గించేలా.. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు చేపట్టిన గ్రీన్ విశాఖ ప్రాజెక్ట్‌లో 4.50 లక్షల మొక్కలు నాటేందుకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ముందుకొచ్చింది. 2012–19 మధ్యకాలంలో 4.50 లక్షలు మొక్కలు నాటి నగర పర్యావరణానికి సహకారం అందించారు. కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీ (సీఈఆర్) ప్రాజెక్ట్‌లో భాగంగా 2019–23 వ్యవధిలో వివిధ ఫల జాతులకు చెందిన 55 వేల మొక్కలు నాటారు. 2020లో నగరంలోని ఐఐఎం క్యాంపస్‌లో గ్రీనరీ పెంపునకు రూ.40 లక్షలు అందజేశారు. సీఈఆర్లో భాగంగా స్టీల్‌ప్లాంట్ పరిసర గ్రామాల్లోని రైతులకు సుమారు 75 వేల జామ, మామిడి, సపోటా, కొబ్బరి మొక్కలు అందజేశారు. -
స్టీల్ ప్లాంట్ EOIకు ముగిసిన గడువు
-
స్టీల్ ప్లాంట్ కార్మికులతో చర్చలు జరిపిన ఏకైక సీఎం వైఎస్ జగన్
-
విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐకు అనూహ్య స్పందన
-
కేంద్రంపై విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆగ్రహం.. సింహాచలానికి పాదయాత్ర..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు ఉద్యమం ఉధృతమవుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై 24 గంటల్లో మాట మార్చిన కేంద్ర ప్రభుత్వం తీరుపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ.. ఉద్యోగులు మరోసారి రోడ్డెక్కారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేపట్టారు. వీరికి వైఎస్సార్సీపీ శ్రేణులు మద్దతిచ్చాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని కోరుతున్నారు. చదవండి: చంద్రబాబు నూజివీడు పర్యటనలో అపశ్రుతి.. మహిళలకు విద్యుత్ షాక్.. పట్టించుకోలేదని ఆగ్రహం.. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ఉక్కు సహాయ మంత్రి కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతం ముందుకెళ్లడం లేదన్నారు. ప్రైవేటీకరణ కంటే ముందు ఆర్ఎన్ఐఎల్ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. పూర్తి సామర్థం మేరకు ప్లాంట్ పనిచేసే ప్రక్రియపైనే ఫోకస్ పెట్టామన్నారు. వీటిపై యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు. బిడ్‌లో టీఎస్ సర్కార్ పాల్గొనడం ఎత్తుగడ మాత్రమేనని ఫగ్గన్ సింగ్ అన్నారు. చదవండి: చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ సెగ.. ఈడ్చిపడేయాలంటూ ఆదేశాలు -
స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో చుట్టుపక్కల అనుబంధ రంగాల అభివృద్ధి : సీఎం వైఎస్ జగన్
-
వైఎస్సార్: సొంత జిల్లాలో సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)
-
స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ
-
వైఎస్సార్ జిల్లాలో ముగిసిన సీఎం జగన్ పర్యటన
Updates: ► ముగిసిన సీఎం జగన్, వైఎస్సార్ జిల్లా పర్యటన. కడప ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం, ఆపై గన్నవరం నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్. ► పులివెందుల మండలం నల్లపురెడ్డి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత బలరామిరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ అతిథిగా హాజరయ్యారు. దేవుడి దయతో మనకు మంచి రోజులు: సీఎం జగన్ దేవుడి దయతో వైఎస్సార్ జిల్లాలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఎక్కువ మందిని పిలవలేకపోయామన్నారు. ఎప్పట్నుంచో కలలుగన్న స్వప్నం ఈ స్టీల్‌ప్లాంట్. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని వైఎస్సార్ కలలుగన్నారు. వైఎస్సార్ మరణంతో ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదని సీఎం అన్నారు. ‘‘రూ.8,800 కోట్లతో 3 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి అవుతుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ ప్లాంట్ రావడం కోసం కష్టాపడాల్సి వచ్చింది. అయినప్పటికీ దేవుడి దయతో మనకు మంచి రోజులు వచ్చాయి. స్టీల్ ప్లాంట్‌వస్తే ఈ ప్రాంతం స్టీల్ సిటీ తరహాలో అభివృద్ధి చెందుతుంది. గండికోట రిజర్వాయర్ నుంచి ప్రత్యేక పైపులైన్ ద్వారా నీటి సరఫరా అవుతుంది. తొలి విడతలో రూ. 3,300 కోట్లతో ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంది’’ అని సీఎం జగన్ అన్నారు. వైఎస్సార్ చూపిన బాటలో సీఎం జగన్: సజ్జన్ జిందాల్ మహానేత వైఎస్సార్ తనకు మంచి మిత్రులు, గురువు అని సజ్జన్ జిందాల్ అన్నారు. ఏపీకి సంబంధించి వైఎస్సార్ ఎన్నో విషయాలు చెప్పారన్నారు. సీఎం జగన్‌తో చాలా కాలం నుంచి పరిచయం ఉంది. వైఎస్సార్ చూపిన బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారని సజ్జన్ జిందాల్ అన్నారు. వైఎస్సార్ కన్న కలను సీఎం జగన్ నెరవేర్చారు: మంత్రి అమర్నాథ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కొందరు అడ్డంకులు సృష్టించారని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధిపై కొందరు కుయుక్తులు పన్నారన్నారు. వైఎస్సార్ కన్న కలను సీఎం జగన్ నెరవేర్చారని, వైఎస్సార్ జిల్లా కూడా ఉక్కు నగరంగా మారబోతుందని మంత్రి అమర్నాథ్ అన్నారు. ప్రజల కల సాకారం.. గర్వంగా ఉంది: ఎంపీ అవినాష్‌రెడ్డి.. రాయలసీమ ప్రజల కల సాకారమవుతోందని ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను జగనన్న ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు. వేల మందికి ఉపాధి దొరుకుతుండటం గర్వంగా ఉందన్నారు. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగనుందని, స్టీల్ ప్లాంట్ ద్వారా జిల్లా ముఖచిత్రం మారబోతుందని అవినాష్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఈ రోజు శుభదినం: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి రాష్ట్ర చరిత్రలోనే ఈ రోజు శుభదినమని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్ కృషితో జిల్లా ప్రజల కల నెరవేరుతుందన్నారు. సాక్షి,అమరావతి: వైఎస్సార్ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటిస్తున్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ భూమిపూజ చేశారు. అనంతరం స్టీల్‌ప్లాంట్ నమూనాను సీఎం పరిశీలించారు. స్టీల్ ప్లాంట్ మౌలిక సదుపాయాలపై జరిగే సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. పులివెందుల ఎస్సీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మూలి బలరామిరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం పులివెందుల నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చిరకాల స్వప్నం నెరవేరే రోజు ►రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే రోజు ఆసన్నమైంది. కడప సిగలో మరో కలికితురాయి వచ్చి చేరుతోంది. తన రాజకీయ భవిష్యత్తుకు అండగా నిలిచిన ప్రాంతం శాశ్వత అభివృద్ధి చెందాలనే సంకల్పం మొగ్గ తొడుగుతోంది. నిరుద్యోగాన్ని పారదోలి మెరుగైన జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్ లిమిటెడ్ సంస్థ ద్వారా స్టీల్ ప్లాంట్ నిర్మించనున్నారు. తొలివిడతగా రూ.3,300 కోట్లతో 10 లక్షల టన్నుల సామర్థ్యంతో చేపట్టనున్న నిర్మాణ పనులకు సున్నపురాళ్లపల్లి గ్రామం వద్ద భూమి పూజ చేశారు. ►కడప గడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించాలని విభజన చట్టంలో పొందుపర్చారు. తద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంకల్పించారు. అలాగే అనుబంధ పరిశ్రమల ద్వారా వేలాది మందికి జీవనోపాధి లభిస్తుందని భావించారు. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది. అయితే ఎన్నికలకు ముందు 2018లో ఓ పునాది రాయితో చంద్రబాబు సర్కార్ సరిపెట్టింది. ►వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్టీల్ ప్లాంట్ నిర్మించాలనే ఆశయాన్ని భుజానికెత్తుకుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 డిసెంబర్ 23న స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరిట నిర్వహణకు సన్నాహాలు చేపట్టారు. కాగా 2020 ఫిబ్రవరి నుంచి కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచమే అతలాకుతలమైంది. ప్రజలు బతుకు జీవుడా అంటూ తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రెండేళ్ల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగడం వల్ల తక్షణ నిర్మాణానికి ప్రతిబంధకంగా మారిందని నిపుణులు వివరిస్తున్నారు. జేఎస్‌డబ్ల్యు స్టీల్స్ లిమిటెడ్చే భూమి పూజ.. చెప్పిన మాట ప్రకారం జేఎస్‌డబ్లు్య స్టీల్స్ లిమిటెడ్ ద్వారా స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిసెంబర్లో జిల్లా పర్యటన సందర్భంగా జేఎస్‌డబ్లు్య స్టీల్స్ లిమిటెడ్ ద్వారా జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు జీఓ ఎంఎస్ నంబర్ 751 ద్వారా ఎకరం రూ.1.65 లక్షలతో 3,148.68 ఎకరాలు కేటాయిస్తూ 2022 డిసెంబర్ 16న ఉత్తర్వులు జారీ చేశారు. తొలివిడతలో ఏడాదికి 1 మిలియన్ టన్నులు (10లక్షల టన్నులు) ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి జేఎస్‌డబ్లు్య సిద్ధమైంది. అందుకోసం ఫేజ్–1లో రూ.3,300 కోట్లు వెచ్చించి, 36 నెలల కాలపరిమితిలో ఫేజ్–1 పనులు పూర్తి కానున్నాయి. తొలివిడత ప్లాంట్‌లో వైర్ రాడ్స్, బార్ మిల్స్ ఉత్పత్తి చేయనున్నారు. మరో రూ.5,500 కోట్లతో ఫేజ్–2 నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. ఫేజ్–2 సైతం మార్చి 31, 2029 నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మౌలిక వసతులు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.720 కోట్లు వెచ్చిస్తోంది. నాలుగులేన్ల రహదారి, రైల్వే కనెక్టివిటీ, నీటి వసతి కోసం పైపు లైన్ ఏర్పాటు, నిల్వ చేసుకునేందుకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, విద్యుత్ సరఫరా, కాంపౌండ్ వాల్, భవన సముదాయం నిర్మించనున్నారు. అందులోభాగంగా ఎన్‌హెచ్–67 నుంచి ముద్దనూరు టు జమ్మలమడుగు రోడ్డుకు అనుసంధానంగా రూ.145.3 కోట్ల తో 12 కిలోమీటర్లు నాలుగు లేన్ల రహదారి నిర్మించనున్నారు. అలాగే ఎర్రగుంట్ల టు ప్రొద్దుటూరు రైల్వేలైన్ నుంచి రూ.323.5 కోట్లతో 9.4 కిలో మీటర్లు రైల్వేలైన్ నిర్మాణం చేపట్టనున్నారు. మైలవరం జలాశయం నుంచి 2 టీఎంసీల నీరు సరఫరా చేయనున్నారు. అందుకోసం 15 కిలోమీటర్లు పైపులైన్ నిర్మించనున్నారు. ఇప్పటికే విద్యుత్ సరఫరాకు కావాల్సిన చర్యలు పూర్తి అయ్యాయి. రూ.76.42 కోట్లతో 27 కిలోమీటర్ల మేరకు విద్యుత్ లైన్ ఏర్పాటు, 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘బయ్యారం స్టీల్’పై కేసీఆర్‌వి అబద్ధాలు: సంజయ్
సాక్షి, హైదరాబాద్ /ఖైరతాబాద్: బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంలో అబద్ధాలు చెప్పి మోసం చేసినందుకు ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇటీవల డీజీపీ ఆఫీస్ ముట్టడిలో గాయపడ్డ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌ను సోమవారం గ్లోబల్ ఆసుపత్రిలో సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బయ్యారంపై డీపీఆర్ ఇవ్వాలన్న తమ లేఖకు మూడున్నరేళ్లుగా స్పందనే లేదని కేంద్రం స్పష్టం చేసినందున ఇప్పుడు కేసీఆర్ ముఖం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ‘బడ్జెట్ ఫైల్‌కు మూడురోజులుగా గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడం లేదని కోర్టుకెక్కిన కేసీఆర్... ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఫైల్‌ను ఏళ్ల తరబడి అసెంబ్లీ స్పీకర్ పెండింగ్‌లో పెడితే ఎందుకు మాట్లాడటం లేదు?’అని నిలదీశారు. కేసీఆర్ పాలనలో సర్పంచ్‌లు కూడా ఆత్మహత్యలు చేసు కునే దుస్థితి ఏర్పడిందన్నారు. కాగా, కేసీఆర్ కుటుంబసభ్యులు తాము నిజాం రాజులమనిæ అనుకుంటున్నారని, వారు ఏ ప్రాంతానికి వెళ్లినా ముందస్తు అరెస్టులు చేయిస్తున్నారని సంజయ్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. మంగళవారం మంత్రి కేటీఆర్ కమలాపూర్ పర్యటన నేపథ్యంలో కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లోని బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విశాఖలో పట్టపగలే రెచ్చిపోయిన రొమాంటిక్ జంట.. రెండు గంటల్లోనే!
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ టౌన్షిప్ రహదారిలో ఓ జంట పట్టపగలు రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్చిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువకుడు మరో యువతిని బైక్ ట్యాంక్‌పై కూర్చొపెట్టుకుని రయ్రయ్ అంటూ దూసుకుపోయారు. ఈ దృశ్యాలను పక్కనే కారులో వెళ్తున్న వ్యక్తులు వీడియో తీశారు. దీంతో పట్టపగలు బరితెగించిన ఈ యువజంట వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో గాజువాక సమీప ప్రాంతాలకు చెందిన బైక్ నడిపిన అజయ్ కుమార్, యువతిని సంఘటన జరిగిన రెండు గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు స్టీల్ ప్లాంట్ సీఐ వి శ్రీనివాస్‌రావు తెలిపారు. యువకుడి బైక్ సీజ్ చేశామని, న్యూసెన్స్, ర్యాష్ డ్రైవింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. చదవండి: Video: ‘తప్పతాగి వేధింపులు.. నడిరోడ్డుపై చెప్పుతో దంచికొట్టింది’ -
ఏపీలో రూ.350 కోట్లతో ఆర్జాస్ స్టీల్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టీల్ రంగంలో ఉన్న ఆర్జాస్ స్టీల్ (గతంలో జెర్డావ్ స్టీల్) రెండు ప్లాంట్లను విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ప్లాంటు సామర్థ్యాన్ని 25–30 శాతం పెంచుతోంది. ఇందుకోసం రూ.350 కోట్లు పెట్టుబడి చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల టన్నులు. నాణ్యతను మెరుగుపరిచేందుకు జర్మనీ నుంచి కాక్స్ సైజింగ్ బ్లాక్‌తోపాటు కాయిల్ రూపంలో ప్రత్యేక స్టీల్ ఉత్పత్తికై గ్యారెట్ కాయిలర్ లైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త స్టవ్‌ల స్థాపనతోసహా స్టీల్ శుద్ధి సామర్థ్యం పెంచుతున్నారు. అలాగే పంజాబ్‌లోని మండి గోవింద్ఘర్ ప్లాంటు వార్షిక సామర్థ్యం ప్రస్తుతం ఒక లక్ష టన్నులు. దీనికి రూ.260 కోట్ల వ్యయంతో 60–70 శాతం సామర్థ్యం జోడిస్తున్నారు. మొత్తం ఈ రెండు ప్లాంట్లకుగాను రూ.610 కోట్ల పెట్టుబడి చేస్తుండగా.. సామర్థ్యం 5.5 లక్షల టన్నులకు చేరనుంది. 2025 నాటికి ఈ విస్తరణ పూర్తి అవుతుందని ఆర్జాస్ స్టీల్ ఎండీ శ్రీధర్ కృష్ణమూర్తి వెల్లడించారు. వాహన రంగానికి అవసరమైన ప్రత్యేక స్టీల్ రెండు ప్లాంట్లలోనూ తయారవుతోంది. మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలకు వీటిని కంపెనీ సరఫరా చేస్తోంది. చదవండి: యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా! -
విశాఖలో ఉక్కు ఉద్యమం ప్రజా వేదిక..
-
బ్లూ స్టీల్ తయారీపై దృష్టి
చెన్నై: బ్లూ స్టీల్‌ను తయారు చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు నగరానికి చెందిన సుమంగళ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ రాజేంద్రన్ సబానాయగం తెలిపారు. శనివారం నగరంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడున్నర దశాబ్దాలుగా ఉక్కు తయారీలో ప్రత్యేకతను చాటుకుంటున్నామని అన్నారు. పుదుచ్చేరిలోని తమ ప్లాంట్‌లో బ్లూ స్టీల్‌ను తయారు చేయడానికి ఆధునిక స్క్రాప్ ష్రెడర్, థర్మో మెకానికల్ ట్రీట్మెంట్ ఫినిషింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. ఇందు కోసం రూ.25 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.679 కోట్లు టర్నోవర్ నమోదు చేశామని.. ఈ ఏడాది రూ.1,000 కోట్ల టర్నోవర్‌కు చేరనున్నట్లు వివరించారు. సంస్థ ప్రెసిడెంట్ అశ్విన్ పాల్గొన్నారు. చదవండి: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా?.. ఈ బెల్టు ట్రై చేయండి, వెంటనే ఉపశమనం! -
భద్రావతి స్టీలు ప్లాంటుకు బిడ్లు కరువు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థ సెయిల్‌కు చెందిన భద్రావతి స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ప్రతిపాదనను ప్రభుత్వం ఉప సంహరించింది. తగినంత స్థాయిలో బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తం కాకపోవడమే ఇందుకు కారణం. కర్ణాటకలోని భద్రావతిలో ఉన్న విశ్వేశ్వరాయ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంటు (వీఐఎస్‌పీ)లో సెయిల్‌కి ఉన్న 100 శాతం వాటాలను విక్రయించేందుకు 2019 జులైలో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వానించారు. దీనికి స్పందనగా పలు ఈవోఐలు వచ్చాయని, సంస్థ వివరాలను బిడ్డర్లు మదింపు కూడా చేశారని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం దీపం వెల్లడించింది. అయినప్పటికీ ఈ విషయంలో ముందుకెళ్లేందుకు అవసరమైనంత స్థాయిలో బిడ్డర్లు ఆసక్తి చూపలేదని పేర్కొంది. దీంతో ప్రత్యామ్నాయ మెకానిజం (సాధికారిక మంత్రుల బృందం) ఆమోదం మేరకు ఈవోఐని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు దీపం వివరించింది. -
కొత్త స్టీల్ ప్లాంట్లు లేనట్టే: ఎన్ఎండీసీ
న్యూఢిల్లీ: కొత్త ఉక్కు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు లేనట్టేనని మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ సీఎండీ సుమిత్ దేవ్ తెలిపారు. ఖనిజాల అన్వేషణపైనే దృష్టిసారిస్తామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో నిర్మాణంలో ఉన్న 3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల నాగర్నార్ స్టీల్ ప్లాంట్‌ను వ్యూహాత్మక కొనుగోలుదారుకు విక్రయించిన తర్వాత ఎన్ఎండీసీ ఉక్కు రంగంలో తన ఆసక్తిని కొనసాగిస్తుందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘ఇనుము ధాతువు ఉత్పత్తి 2030 నాటికి 100 మిలియన్ టన్నుల స్థాయికి చేర్చాలన్నది సంస్థ లక్ష్యం. 2021–22లో 42 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయింది. అంత క్రితం ఏడాదిలో ఇది 34 మిలియన్ టన్నులు. ఎన్ఎండీసీ భారత్‌తోపాటు ప్రపంచ స్థాయిలో బలమైన మైనింగ్ కంపెనీగా తన స్థానాన్ని పెంపొందించుకుంటుంది. స్టీల్ అనేది కంపెనీ ప్రాధాన్యత కాదు. నాగర్నార్ స్టీల్ ప్లాంట్ విలీనం ప్రస్తుత త్రైమాసికంలోనే కార్యరూపం దాల్చనుంది. స్టీల్ ప్లాంటులో కార్యకలాపాలు సెప్టెంబర్ చివరినాటికి ప్రారంభం అవుతాయి’ అని వివరించారు. -
నాగర్నార్ స్టీల్‌విడదీతకు ఓకే
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం ఎన్ఎండీసీ నుంచి నిర్మాణంలో ఉన్న నాగర్నార్ స్టీల్ ప్లాంటు(ఎన్ఎస్పీ)ను విడదీసేందుకు వాటాదారులు, రుణదాతలు అనుమతించినట్లు కంపెనీ సీఎండీ సుమిత్ దేవ్ తాజాగా వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా స్టీల్ శాఖ ఎన్ఎండీసీ వాటాదారులు, రుణదాతలతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. తద్వారా ఎన్ఎండీసీ నుంచి ఎన్ఎస్పీ విడదీతకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు తెలియజేశారు. చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు దగ్గర్లోగల నాగర్నార్లో ఎన్ఎండీసీ 3 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. రూ. 23,140 కోట్ల అంచనా వ్యయాలతో 1,980 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంటును నెలకొల్పుతోంది. 2020 అక్టోబర్‌లో ఎన్ఎండీసీ నుంచి ఎన్ఎస్పీని విడదీసేందుకు కేం్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో ఎన్ఎస్పీ ప్రత్యేక కంపెనీగా విడివడనుంది. తదుపరి సంస్థలో కేంద్ర ప్రభుత్వానికిగల పూర్తి వాటాను వ్యూహాత్మక కొనుగోలుదారుకి విక్రయించనున్నారు. -
ఎన్ఎండీసీ నుంచి ఎన్ఎస్పీ విడదీత
న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ ఎన్ఎండీసీ నుంచి నిర్మాణంలో ఉన్న నాగర్నర్ స్టీల్ ప్లాంటు(ఎన్ఎస్పీ)ను విడదీసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు స్టీల్ శాఖ తాజాగా వెల్లడించింది. విలీన ప్రక్రియను వేగవంతం చేసే బాటలో కంపెనీకి చెందిన వాటాదారులు, రుణదాతలతో నేడు(7న) సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. నాలుగు నుంచి ఐదు నెలల్లో ఎన్ఎస్పీని పూర్తిస్థాయిలో ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసే లక్ష్యంతో కేంద్రం ఉన్నట్లు ఒక అధికారిక ప్రతిలో స్టీల్ శాఖ పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ సమీపంలో 3 మిలియన్ టన్నుల వార్షిక(ఎంటీపీఏ) సామర్థ్యంతో ఎన్ఎస్పీ ఏర్పాటవుతోంది. 1,980 ఎకరాలలో యూనిట్‌ను నిర్మిస్తున్నారు. ఇందుకు రూ. 23,140 కోట్లు వెచ్చిస్తున్నట్లు అంచనా. ఎన్ఎండీసీ నుంచి ఎన్ఎస్పీని విడదీసేందుకు 2020 అక్టోబర్‌లో కేంద్ర క్యాబినెట్ అనుమతించింది. తద్వారా కంపెనీలో కేంద్రానికున్న మొత్తం వాటాను వ్యూహాత్మక కొనుగోలుదారుడికి విక్రయించనుంది. మంగళవారం నిర్వహించనున్న సమావేశాలకు స్టీల్ శాఖ అదనపు కార్యదర్శి రాశికా చౌబే అధ్యక్షత వహించనున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ఎన్ఎండీసీ షేరు ఎన్ఎస్ఈలో 1.6 శాతం నీరసించి రూ. 125 వద్ద ముగిసింది. -
Ukraine Crisis: యుద్ధం ముగిసింది.. రష్యా సంచలన ప్రకటన
లండన్: ఉక్రెయిన్‌లోని జైటోమిర్ ప్రాంతంలో భారీ సంఖ్యలో పశ్చిమ దేశాల ఆయుధాలను, సైనిక సామగ్రిని ధ్వంసం చేశామని రష్యా సైన్యం శనివారం ప్రకటించింది. సముద్ర ఉపరితలం నుంచి ప్రయోగించే క్యాలిబర్ క్రూయిజ్ మిస్సైళ్లతో ఆ ఆయుధాలను అగ్నికి ఆహుతి చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతోపాటు యూరప్ దేశాల నుంచి ఈ ఆయుధాలు ఉక్రెయిన్‌కు చేరాయని వెల్లడించింది. డోన్బాస్లో రష్యా సేనలను ఎదుర్కొనడానికే వీటిని ఉక్రెయిన్ సిద్ధం చేసుకుందని తెలిపింది. పలుచోట్ల ఉక్రెయిన్ సైనిక పోస్టులను ధ్వంసం చేశామనిపేర్కొంది. ఫిన్లాండ్కు రష్యా గ్యాస్ నిలిపివేత హెల్సింకీ: నాటో కూటమిలో చేరేందుకు ఉత్సాహంగా అడుగులు ముందుకేస్తున్న ఫిన్లాండ్కు రష్యా గట్టి షాకిచ్చింది. శనివారం ఫిన్లాండ్కు గ్యాస్ ఎగుమతులను నిలిపివేసింది. దీంతో రష్యా నుంచి ఫిన్లాండ్కు గత 50 ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న గ్యాస్ సరఫరా ఆగిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 7 గంటలకు రష్యా నుంచి సహజ వాయువు సరఫరా నిలిచిపోయినట్లు ఫిన్లాండ్ ప్రభుత్వ రంగంలోని గాసూమ్ గ్యాస్ కంపెనీ ప్రకటించింది. తమ దేశం నుంచి గ్యాస్ దిగుమతి చేసుకొనే దేశాలన్నీ డాలర్లలో కాకుండా రూబుల్స్‌లోనే చెల్లింపులు చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్ చేశారు. కానీ, ఫిన్లాండ్నిరాకరించింది. ఫిన్లాండ్కు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని రష్యా ఇప్పటికే నిర్ణయించుకుంది. రష్యాతో ఫిన్లాండ్కు 1,340 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. నాటోలో చేరాలన్న ఫిన్లాండ్ ఆకాంక్షను రష్యా వ్యతిరేకిస్తోంది. ‘40 బిలియన్ డాలర్ల’ బిల్లుపై బైడెన్ సంతకం రష్యా దాడుల వల్ల సంక్షోభంలో చిక్కుకున్న ఉక్రెయిన్‌కు అమెరికా అందించనున్న 40 మిలియన్ డాలర్లకు పైగా సాయానికి సంబంధించిన బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్ శనివారం సంతకం చేశారు. సియోల్‌లో పర్యటిస్తున్న బైడెన్ వద్దకు బిల్లు కాపీని అధికారులు విమానంలో అమెరికా నుంచి ఆగమేఘాలపై తీసుకొచ్చారు. ఈ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసిపోయే అవకాశం లేదని అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అమెరికా సర్కారు ఉక్రెయిన్‌కు ఇప్పటికే 13.6 బిలియన్ డాలర్ల సాయం అందించింది. కొత్త బిల్లులో భాగంగా 20 బిలియన్ డాలర్ల తోడ్పాటును సైనిక, ఆయుధ రూపంలో ఇవ్వనుంది. రష్యా దాడులను ఉక్రెయిన్ దళాలు సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ సాయం దోహదపడనుందని అమెరికా భావిస్తోంది. అలాగే 8 బిలియన్ డాలర్ల సాధారణ సాయం, ఆహార సంక్షోభాన్ని అధిగమించేందుకు 5 బిలియన్ డాలర్లు, శరణార్థుల కోసం బిలియన్ డాలర్లను ఇవ్వనుంది. మాపై అత్యాచారాలు ఆపండి: కేన్స్ ఫెస్టివల్లో మహిళ అర్ధనగ్న నిరసన ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో శుక్రవారం సాయంత్రం అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌లో రష్యా సైనికుల దాష్టీకాలను వ్యతిరేకిస్తూ ఓ మహిళ నిరసన వ్యక్తం చేసింది. రెడ్‌కార్పెట్‌పైకి చేరుకోగానే ఒంటిపై బట్టలు విప్పేసింది. తన శరీరంపై ఉక్రెయిన్ జాతీయ పతాకం పెయింటింగ్‌తోపాటు ‘మాపై అత్యాచారాలు ఆపండి’ అని రాసి ఉన్న ఆక్షరాలను ప్రదర్శించింది. మహిళ శరీరంపై కేవలం ఎరుపు రంగు లో దుస్తులు మాత్రమే ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటనతో ఫిలిం ఫెస్టివల్లో స్వల్ప అంతరాయం కలిగింది. ⚡️🇷🇸 #Serbia imposed sanctions against #Belarus The country joined the #EU on the issue of restrictions due to the war in #Ukraine. The sanctions are directed against the financial and transport system of Belarus. pic.twitter.com/bmDyiTRxfj — NEXTA (@nexta_tv) May 20, 2022 ఇది కూడా చదవండి: దుస్తులు విప్పేసి ఉక్రెయిన్ మహిళ నిరసన.. వీడియో వైరల్ -
Russia-Ukraine war: తూర్పున దాడి ఉధృతం
ఇర్పిన్: ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా దాడులను తీవ్రం చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ముట్టడి విఫలమైన తర్వాత రష్యా తన దృష్టిని తూర్పు ఉక్రెయిన్‌వైపు మరలించింది. ఈ ప్రాంతంలో ఉక్రెయిన్‌కు కీలకమైన పరిశ్రమలున్నాయి. దీన్ని స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయవచ్చని రష్యా భావిస్తోంది. డోన్బాస్ ప్రాంతంలో రష్యా కాల్పులు అధికమయ్యాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మారియుపోల్‌లో ఇప్పటికీ ఉంటున్న పౌరులు మరిన్ని ఇక్కట్లు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆ నగరంలోని స్టీల్‌ప్లాంట్‌పై రష్యా దాడి ముమ్మరమైనట్లు శాటిలైట్ చిత్రాలు చూపుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌లో ఐరాస చీఫ్ గుటెరస్ పర్యటన కొనసాగుతోంది. యుద్ధంలో అధిక మూల్యం చెల్లించేది చివరకు సామాన్య ప్రజలేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధనేరాల గురించి మాట్లాడాల్సివస్తే, అసలు యుద్ధమే నేరమని చెప్పాలన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌కు సహాయం కొనసాగిస్తామని బల్గేరియా కొత్త ప్రధాని భరోసా ఇచ్చారు. రష్యా పౌర నివాసాలపై దాడులకు దిగుతోందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. తమ అధీనంలో ఉన్న ఖెర్సాన్ నగరంలో పేలుళ్లు జరిగాయని రష్యా తెలిపింది. పోరు కొనసాగించేందుకు తమకు మరిన్ని ఆయుధాలందించాలని ఉక్రెయిన్ మిత్ర దేశాలను కోరింది. నాటో సాయం 800 కోట్ల డాలర్లు ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు నాటో దేశాలు దాదాపు 800 కోట్ల డాలర్ల సాయం అందించాయని నాటో చీఫ్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. నాటోలో చేరాలనుకుంటే ఫిన్లాండ్, స్వీడన్‌ను సాదరంగా స్వాగతిస్తామని చెప్పారు. రష్యాతో యుద్ధం సంవత్సరాలు కొనసాగినా, తాము ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తామన్నారు. కొత్త శతాబ్దిలో యుద్ధాలు ఆమోదయోగ్యం కావని ఐరాస చీఫ్ గుటెరస్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధంలో నేరాలపై ఐసీసీతో విచారణకు తాను మద్దతిస్తానన్నారు. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను ఆయన సందర్శించారు. -
Russia-Ukraine war: ఉక్రెయిన్ ఆయుధాగారాలపై రష్యా ముమ్మర దాడులు
కీవ్: ఉక్రెయిన్‌పై దాడులను ఆదివారం రష్యా తీవ్రతరం చేసింది. సెంట్రల్ ఉక్రెయిన్‌లో పేలుడు పదార్థాలు, మందుగుండు పౌడర్ తయారీ కంపెనీపై అత్యాధునిక మిసైళ్లు ప్రయోగించినట్టు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ తెలిపారు. ఖర్కీవ్ ప్రాంతంలోని బర్వింకోవ్, నోవా ద్మిత్రివ్కా, ఇవనివ్కా, హుతలరివ్కా, వెల్యికాల్లో పలు ఆయుధాగారాలపైనా భారీగా దాడులు చేసినట్టు వివరించారు. 26 ఉక్రెయిన్ సైనిక లక్ష్యాలను ధ్వంసం చేశామన్నారు. మారియుపోల్‌లోని అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంటుపై గగనతల దాడులకు దిగింది. తూర్పున డోన్బాస్లో లుహాన్స్క్ ప్రాంతంలోని పొపాస్నా, సివెరోడొనెట్స్క్, డొనెట్స్క్ ప్రాంతంలోని కురఖీవ్ నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. పశ్చిమ డోన్బాస్లోని ద్నిప్రోలోనూ బాంబు దాడులు జరిగాయి. చెడుపై అంతిమంగా మంచి గెలిచి తీరుతుందని, ఈ వాస్తవం రష్యాకు త్వరలో తెలిసొస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. మరణాన్ని జీవనం, చీకటిని వెలుతురు అధిగమిస్తాయని దేశ ప్రజలకిచ్చిన ఈస్టర్ సందేశంలో చెప్పారు. అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు లాయిడ్ ఆస్టిన్, ఆంటోనీ బ్లింకెన్‌లతో భేటీ కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి
-
ఉక్రెయిన్‌కు ఊహించని షాక్.. కోలుకోలేని దెబ్బకొట్టిన పుతిన్
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. 25 రోజులుగా జరుగుతున్న యుద్ధంలో పుతిన్ సేనల ధాటికి ఉక్రెయిన్ విలవిలాడుతోంది. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ఇప్పటికే భారీగా నష్టపోయింది. ఉక్రెయిన్ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దాడుల కారణంగా పలు నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఉక్రేనీయులు నిరాశ్రయులయ్యారు. తాజాగా భీకర దాడుల్లో ఉక్రెయిన్‌లోని అజోవ్స్తాల్లో ఉన్న అతిపెద్ద ఐరన్, స్టీల్ ప్లాంట్ ధ్వంసమైంది. ఇది యూరప్‌లోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్. ఈ ఘటనలో ఉక్రెయిన్‌కు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లనుందని ఆ దేశ ఎంపీ లీసియా వ్యాసిలెన్కో ట్విట్టర్ వేదికగా తెలిపారు. స్టీల్ ప్లాంట్ ధ్వంసమైన కారణంగా పర్యావరణం కూడా దెబ్బతినే అవకాశం ఉన్నట్టు ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, మెటిన్‌వెస్ట్ గ్రూప్‌కు చెందిన అజోవ్‌స్టాల్ స్టీల్ ప్లాంట్, ఉక్రెయిన్‌లోని అత్యంత ధనవంతుడైన రినాట్ అఖ్మెటోవ్ ఆధీనంలో ఉంది. మరోవైపు స్టీల్ ప్లాంట్‌ను రష్యా దళాలు ధ్వంసం చేయడంపై అజోవ్‌స్టాల్ డైరెక్టర్ జనరల్ ఎన్వర్ స్కిటిష్విలి స్పందిస్తూ.. తాము నగరానికి తిరిగి వచ్చిన తర్వాత ఉక్కు కర్మాగారాన్ని పునర్నిర్మిస్తామని తెలిపారు. అయితే దాడుల వల్ల ఉక్కు పరిశ్రమకు ఎంత నష్టం వాటిల్లిందో వెల్లడించలేదు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రారంభించినప్పుడే పర్యావరణం దెబ్బతినకుండా ఉక్కు పరిశ్రమలో జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. #Mariupol #Azovstal One of the biggest metallurgic plants in #Europe destroyed. The economic losses for #Ukraine are huge. The environment is devastated #StopRussiaNOW pic.twitter.com/4GMbkYb0es — Lesia Vasylenko (@lesiavasylenko) March 19, 2022 మరోవైపు.. ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఖార్కివ్, మరియుపోల్ సహా పలు ప్రధాన నగరాలపై రష్యన్ బలగాలు మరింత విరుచుకుపడుతున్నాయి. కాగా, మరియుపోల్‌లోని ఆర్ట్ స్కూల్‌పై రష్యా దళాలు బాంబు దాడి చేశాయని, అక్కడ దాదాపు 400 మంది నివాసితులు ఆశ్రయం పొందారని సిటీ కౌన్సిల్ ఆదివారం తెలిపింది. ఈ దాడుల్లో భవనం ధ్వంసమైందని, శిథిలాల కింద బాధితులు ఉన్నారని కౌన్సిల్ పేర్కొన్నప్పటికీ, శనివారం జరిగిన దాడిలో ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు. తాజాగా 18 నగరాలపై రష్యా సైనం దాడులు జరుపవచ్చనే సమాచారంలో ఉక్రెయిన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. -
ఉక్కు హామీకి తుప్పు పట్టిందా..!
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి దక్కిన బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణం హామీని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కనపెడుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. నిండు పార్లమెంట్లో ఒప్పుకున్న నిర్ణయాన్ని మోదీ సర్కారు తుంగలో తొక్కుతోందని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన విభజన హామీ ప్రకారం ‘బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు’అని గుర్తు చేశారు. ఉక్కు కర్మాగారం విష యంలో కేంద్రం వైఖరిని ఎండగడుతూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్‌కు కేటీఆర్ ఆదివారం లేఖ రాశారు. విశాఖ ఉక్కు ఉసురు తీసిన కేంద్రం.. బయ్యారంలో మొదలుకాకుండానే ఉక్కును తుప్పుగా చూపే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్లాంట్ ఏర్పాటులో తాము భాగమవుతామన్నా స్పందించట్లేదని మండిపడ్డారు. పీఎంకు, కేంద్ర మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించినా.. దేశంలోని ఇనుప ఖనిజ నిల్వల్లో 11 శాతం బయ్యారంలోనే ఉన్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. సుమారు 300 మిలియన్ మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజ నిల్వలు బయ్యారంలో ఉన్నాయన్న ‘జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)’సర్వే నివేదికను ప్రస్తావిస్తూ నాణ్యమైన ఐరన్ ఓర్ బయ్యారంలో లేదని కేంద్రం అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. బయ్యారంలో లేకపోతే అక్కడి నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బైలాడిల్లాలో గనులు కేటాయించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. అక్కడి నుంచి బయ్యారానికి ఐరన్ ఓర్ రవాణాకు ఓ స్లర్రి పైపులైన్ లేదా రైల్వే లైన్ వేస్తే సరిపోతుందని ప్రధాని మోదీని కలిసి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారని లేఖలో పేర్కొన్నారు. ఖనిజ రవాణా వ్యయంలో భాగమయ్యేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధంగా ఉన్నట్టు హమీ ఇచ్చినా మోదీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. తానూ పలు మార్లు కేంద్ర మంత్రులను కలసి ప్లాంట్ కోసం ప్రయత్నం చేసినా స్పందన రాలేదని విమర్శించారు. పెల్లెటైజేషన్ ప్లాంటైనా పెట్టాలని కోరాం ఛత్తీస్‌గఢ్ నుంచి బయ్యారం ప్లాంట్‌కు ఐరన్ ఓర్ సరఫరా చేసేందుకు 2016లోనే ఎన్ఎండీసీ అంగీకరించిందని కేటీఆర్ గుర్తు చేశారు. మెటలర్జికల్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ (మేకాన్) సంస్థ ఖమ్మం పరిసర ప్రాంతాలను అధ్యయనం చేసి పెల్లెటైజేషన్ ప్లాంట్, స్క్రాప్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సానుకూల నివేదిక ఇచ్చిందన్నారు. ఎన్ఎండీసీ, సింగరేణి కాలరీస్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు సానుకూలంగా ఉన్నా కేంద్రం మాత్రం ప్లాంట్ ఏర్పాటును పక్కనబెడుతోందని విమర్శించారు. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రస్తుతం వీలు కాకుంటే తాత్కాలికంగా పెల్లెటైజేషన్ ప్లాంట్ పెట్టి స్థానిక యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా కేంద్రాన్ని కోరామన్నారు. కిషన్‌రెడ్డి.. ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదంటారా? ఉక్కు పరిశ్రమపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనతో పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రానిది ‘తుక్కు సంకల్పమే’నని తేలిపోయిందని కేటీఆర్ విమర్శించారు. స్టీల్ ఫ్యాక్టరీని సాధించాల్సిన కేంద్ర మంత్రే ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని చేతులేత్తేయడం సిగ్గుచేటన్నారు. కిషన్ రెడ్డి మాటలు వ్యక్తిగతమా లేక కేంద్ర ప్రభుత్వ విధానపర నిర్ణయమా తెలపాలని డిమాండ్ చేశారు. ప్లాంట్‌తో తమకు ఉద్యోగాలు వస్తాయనుకుంటున్న వేలాది మంది గిరిజన, అదివాసీ యువకుల ఆశలకు కిషన్‌రెడ్డి ఉరేశారని విమర్శించారు. సెయిల్ ఆధ్వర్యంలోని పాత ప్లాంట్లకు రూ. 71వేల కోట్లు ‘బయ్యారం ప్లాంట్ గురించి పట్టించుకోని కేంద్రం.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఆధ్వర్యంలోని రూర్కెలా, బర్న్‌పూర్, దుర్గాపూర్ బొకారో, సాలెం ప్లాంట్ల విస్తరణ, ఆధునికీకరణ, గనుల కోసం దాదాపు రూ. 71 వేల కోట్లను ఖర్చు చేసింది. పాత కర్మాగారాల ఆధునికీకరణ ఆహ్వానించదగ్గదే అయినా.. రూ. వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశాక సెయిల్‌ను అప్పనంగా అమ్మేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’అని కేటీఆర్ ఆరోపించారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన సెగలు
-
పోస్కోతో అదానీ గ్రూప్ జత
న్యూఢిల్లీ: స్టీల్, పునరుత్పాదక ఇంధన విభాగాలలో వ్యాపార అవకాశాలను అన్వేషించేందుకు వీలుగా దక్షిణ కొరియా దిగ్గజం పోస్కోతో దేశీ దిగ్గజం అదానీ గ్రూప్ చేతులు కలిపింది. ఇందుకు అనుగుణంగా అవగాహనా ఒప్పందం(ఎంవోయూ)పై రెండు సంస్థల ప్రతినిధులూ సంతకాలు చేశారు. ఎంవోయూ ద్వారా రానున్న కాలంలో 5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే అవకాశమున్నట్లు అదానీ గ్రూప్ ఈ సందర్భంగా వెల్లడించింది. గుజరాత్‌లోని ముంద్రాలో కొత్తగా పర్యావరణ అనుకూల స్టీల్ ప్లాంటు ఏర్పాటు, పునరుత్పాదక ఇంధనం, హైడ్రోజన్, లాజిస్టిక్స్ తదితర రంగాలలో వ్యాపార అవకాశాల అన్వేషణలో పరస్పర సహకారం వంటి అంశాలపై తప్పనిసరికాని ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. కర్బనాల తగ్గింపు అవసరాల రీత్యా వివిధ రంగాలలో పెట్టుబడులను చేపట్టనున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా సహకారం, సాంకేతికత, ఆర్థిక అంశాలతోపాటు రెండు కంపెనీలకూ ఉన్న నిర్వహణ సామర్థ్యం తదితరాలలో పరస్పర సహకారానికున్న అవకాశాలను పరిశీలించనున్నట్లు వివరించింది. అదానీ గ్రూప్ ఇటీవల పెట్రోకెమికల్స్, హైడ్రోజన్ ఉత్పత్తితోపాటు, స్టీల్ తయారీలోకి ప్రవేశించే యోచనలో ఉన్నట్లు వెల్లడించిన నేపథ్యంలో తాజా ఎంవోయూకు ప్రాధాన్యత ఏర్పడింది! బలాల వినియోగం పోస్కో, అదానీ గ్రూప్లకుగల పర్యావరణ, సామాజిక, పాలనాపరమైన కట్టుబాట్ల కొనసాగింపునకు అనుగుణంగా పునరుత్పాదక ఇంధన వనరులు, గ్రీన్ హైడ్రోజన్ తదితరాలను వినియోగించుకునే యోచనలో ఉన్నాయి. స్టీల్, పర్యావరణహిత బిజినెస్‌లలో రెండు సంస్థల మధ్య గొప్ప సమన్వయానికి వీలున్నట్లు పోస్కో సీఈవో జియోంగ్ వూ చోయ్ పేర్కొన్నారు. తమ రెండు సంస్థల మధ్య భాగస్వామ్యం దేశీ తయారీ రంగ వృద్ధికి సహకరించగలదని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలియజేశారు. -
‘విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ముందుండి పోరాటం చేయలేను’
విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ముందుండి పోరాటం చేయలేనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ద్వంద్వ వైఖరి ప్రదర్శించారు. ప్రజలే ముందుండి పోరాటం చేయాలని, తాను వెనుక ఉంటానంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ‘గతంలో తాను పోరాటం చేస్తే ఎవరూ మద్దతు ఇవ్వలేదు. పోరాటం చేయడం వల్లనే కేంద్రంలో ఉన్న పెద్దలకు శత్రువునయ్యా. ప్రజలే పోరాటం చేయాలి.. వారి వెనుక నేను నిలబడతా’ అని దాటవేత ధోరణి ప్రదర్శించారు. చదవండి: ‘రాజకీయ లబ్ధికోసమే కొందరు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు’ -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై గతంలో పవన్ కళ్యాణ్ స్పందన
-
కశ్మీర్లో జేఎస్‌డబ్ల్యూ ఉక్కు ప్లాంటు
న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తాజాగా కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా లస్సీపురాలో కలర్ కోటెడ్ ఉక్కు తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.150 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.2 లక్షల టన్నులుగా ఉండనుంది. గ్రూప్‌లో భాగమైన జేఎస్‌డబ్ల్యూ స్టీల్ దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ వెల్లడించింది. జమ్మూ, కశ్మీర్‌లోని స్థానిక మార్కెట్లో విక్రయాల కోసం స్టీల్ శాండ్విచ్ ప్యానెల్స్, స్టీల్ డోర్స్ తయారు చేయనున్నట్లు తెలిపింది. స్థల కేటాయింపు పత్రాలను హోం మంత్రి అమిత్ షా సోమవారం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్‌కు అందిం చారు. స్థానిక వ్యాపారాలు, సమాజానికి ఈ ప్లాంటు ప్రయోజనం చేకూర్చగలదని, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించగలదని జిందాల్ తెలిపారు. -
250 మందితో 25 గంటల నిరాహార దీక్ష..
-
కేంద్రం తీరుకు నిరసనగా కార్మికుల ఆందోళన
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పాదయాత్ర
-
‘కార్గో’లో గంగవరం పోర్టు మరో మైలురాయి
సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే అత్యంత లోతైన, అధునాతన పోర్టుల్లో ఒకటైన గంగవరం పోర్టు సరుకుల ఎగుమతి దిగుమతుల్లో ఎప్పటికప్పడు రికార్డులు సృష్టిస్తోంది. అత్యాధునిక మౌలిక వసతుల కారణంగా మంగళవారం మరో మైలురాయిని అధిగమించింది. 24 గంటల్లోనే కార్గో హ్యాండ్లింగ్ చేస్తూ రికార్డు నమోదు చేసింది. మొబైల్ హార్బర్ క్రేన్స్ (ఎంహెచ్సీ) వినియోగిస్తూ 24 గంటల్లో ఏకంగా 26,885 మెట్రిక్ టన్నుల ఎరువును షిప్ నుంచి దిగుమతి చేసింది. గతంలో ఇదే పోర్టులో 24 గంటల్లో 16,690 మెట్రిక్ టన్నుల ఎరువులను డిశ్చార్జ్ చేసిన రికార్డుని అధిగమించింది. ఎంవీకే మ్యాక్స్ ఎంపరర్ నౌక తీసుకొచ్చిన 64,575 మెట్రిక్ టన్నుల యూరియాని అత్యంత వేగంగా దిగుమతి చేసింది. స్టీల్‌ప్లాంట్‌కు బొగ్గు అందించడంలోనూ గత నిర్వహణని అధిగమించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొత్తం 5,67,888 మెట్రిక్ టన్నులను కన్వేయర్ల ద్వారా ఆర్ఐఎన్ఎల్ ప్లాంట్‌కు బదిలీ చేయగా.. ఆగస్టులో ఏకంగా 6,08,706 మెట్రిక్ టన్నులు బొగ్గును అందించింది. ఒక నెలలో ఇంత పెద్ద మొత్తాన్ని అందించిన గంగవరం పోర్టు అధికారులు, సిబ్బందికి స్టీల్‌ప్లాంట్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గంగవరం పోర్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీజే రావు మాట్లాడుతూ అత్యున్నత మౌలిక వసతులు, నిర్వహణ సామర్థ్యాలను అందిపుచ్చుకోవడం వల్లే అనేక మైలురాళ్లని అధిగమిస్తున్నామన్నారు. పోర్టులో డీప్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రయోజనాలు వాణిజ్య సంస్థలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. -
విశాఖలో స్టీల్‌ప్లాంట్ కార్మికుల కొవొత్తుల ర్యాలీ
-
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాసేపట్లో భారీ మానవహారం
-
'ఉక్కు' పరిరక్షణకు 29న భారీ మానవహారం
-
నిర్మలా సీతారామన్ విశాఖ పర్యటన.. ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత
-
ఢిల్లీలో రెండో రోజు స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల నిరసనలతో దద్దరిల్లుతున్న ఢిల్లీ
-
ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీలు
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం
-
నేడు ఢిల్లీ లో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలు
-
ఢిల్లీ బయలుదేరిన విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ వద్ద ఉద్రిక్తత
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో కేంద్రం అఫిడవిట్
-
నేడు ఢిల్లీకి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు
-
పార్లమెంట్ లో విశాఖ ఉక్కు పైపోరాడతాం
-
జనసేన నేతలకు చేదు అనుభవం
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ
-
విశాఖ స్టీల్ ప్లాంట్: కొనసాగుతున్న భారీ నిరసన ర్యాలీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లాంట్ కార్మికులు చేపట్టిన 30 కిలోమీటర్ల భారీ నిరసన ర్యాలీ కొనసాగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కార్మికులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన చేస్తున్నారు. స్టీల్ పరిరక్షణా పోరాట కమిటీ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలు స్టీల్ ప్లాంట్ కూర్మన్నపాలెం గేట్ నుంచి ర్యాలీగా బయలుదేరాయి. వేలాదిమంది కార్మికులు నిరసన ర్యాలీలో భాగంగా కూర్మన్నపాలెం, వడ్లపూడి, గాజువాక మీదుగా ముందుకు సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక నిర్ణయాలపై కార్మిక సంఘాలు మండి పడుతున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం వద్ద చేపట్టిన దీక్షలు 150వ రోజుకు చేరాయి. కార్మికుల దీక్షలు జీవీఎంసీ వద్ద 100వ రోజుకు చేరాయి. ఈ నేపథ్యంలో స్టీల్ ఉద్యమానికి మద్దతు కోరిన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉత్తరాంధ్ర జిల్లాల ఎంపీలను కలిసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అన్ని వర్గాల సహకారంతో ఉద్యమిస్తామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్య రామ్ పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై పలువురి అభిప్రాయాలు అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలి: సీపీఎం నర్సింగరావు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు సొంతంగా గనులు కేటాయించాలని , సీపీఎం నర్సింగరావు డిమాండ్ చేశారు. 32 మంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని గుర్తు చేశారు. కరోనా సమయంలోనూ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఆపలేదన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలని ఆయన కోరారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదు: గఫూర్ స్టీల్‌ప్లాంట్ కోసం పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని సీఐటీయూ నేత గఫూర్ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ మూర్ఖంగా పాలిస్తున్నారని, ఆయనకి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. లక్షలాదిమందికి స్టీల్‌ప్లాంట్ ఉపాధి కల్పిస్తోంది: అయోధ్యరామ్ స్టీల్‌ప్లాంట్ రూ.వేలకోట్ల పన్నులు కడుతుంటే ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏంటని స్టీల్‌ప్లాంట్ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ తెలిపారు. సీఎం జగన్ లేఖలకు కేంద్రం సమాధానం ఇవ్వలేదని, అసలు హోదా లేదు, రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. లక్షలాదిమందికి స్టీల్‌ప్లాంట్ ఉపాధి కల్పిస్తోందన్నారు. ►ప్రజల ఆకంక్ష మేరకు ప్రధాని మోదీ నడుచుకోవాలని, స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నేత మస్తానప్ప కోరారు -
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్యోగుల ఆందోళన
-
సీఎం జగన్‌ని కలిసిన ఎస్సార్ గ్రూప్ ప్రతినిధులు
సాక్షి,అమరావతి: ఎస్సార్ గ్రూప్ ప్రతినిధులు బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఎస్సార్ గ్రూపు సన్నద్దత వ్యక్తం చేసింది. అలానే వైయస్సార్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కూడా ముందుకొచ్చింది. ఈ యేడాది నవంబరులో స్టీల్ ప్లాంట్ పనులకు శంకుస్ధాపన చేస్తామని ఎస్సార్ గ్రూపు ప్రతినిధులు సీఎం జగన్‌కు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన వారిలో ఎస్సార్ గ్రూప్ హెడ్ ప్రశాంత్ రుయా, వైస్ ఛైర్మన్ జె మెహ్రా, ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తదితరులు ఉన్నారు. -
తీర్మానం పై హర్షం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాల నేతలు
-
ఆక్సిజన్ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
-
ఆక్సిజన్ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
సాక్షి, విజయవాడ: ఆక్సిజన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో స్టీల్ ప్లాంట్, నేవీతో అధికారులు చర్చలు జరిపారు. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు భేటీ అయ్యారు. అన్ని ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణను తుర్పు నావికాదళం చేపట్టనుంది. ఆక్సిజన్ ప్లాంట్ లీకేజీలు, స్థితిగతులు, జాగ్రత్తలతో నిర్వహణకు తూర్పు నావికాదళం ముందుకొచ్చింది. అత్యవసరంగా నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఎక్కడ అవసరమైతే అక్కడికి విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేయనుంది. ఆక్సిజన్ ప్లాంట్లలోని సాంకేతిక లోపాలను సవరించేందుకు నేవీ సాయపడనుంది. సింగపూర్, థాయ్ లాండ్, మలేషియా నుండి ఏపీకి ఆక్సిజన్ తో కూడిన 25 క్రయోజనిక్ కంటైనర్స్ తరలించేందుకు నేవీ అంగీకారం తెలిపింది. ఐఎన్ఎస్ కళింగ్ ఆస్పత్రిలో 60 బెడ్లు కోవిడ్‌కి కేటాయించేందుకు అంగీకరించింది. కంచరపాలెంలో 150 పడకల ఆస్పత్రికి మౌలిక సదుపాయాల కల్పనకు నేవీ అంగీకారం తెలిపింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని ప్రభుత్వం సమకూర్చనుంది. గురజాడ కళాక్షేత్రంలో కోవిడ్ చికిత్స కోసం ఆక్సిజన్‌తో కూడిన 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు విశాఖ స్టీల్ ప్లాంట్ అంగీకారం తెలిపింది. వీటికి అదనంగా మరో 150 పడకలు ఏర్పాటు చేయనున్నారు. మే 15 నాటికి అందుబాటులోకి వస్తాయని స్టీల్ ప్లాంట్ సీఎండీ వెల్లడించారు. మే 30 నాటికి 250 పడకలు, జూన్ నాటికి 600 పడకలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్టీల్ ప్లాంట్ అధికారులు తెలిపారు. అందుకు తగిన విధంగా వైద్యులను, మెడికల్ సిబ్బందిని అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని స్టీల్ ప్లాంట్ అధికారులు కోరారు. నేవీ, స్టీల్ ప్లాంట్ అధికారుల విజ్ఞప్తి మేరకు వారి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల కోసం 4000 వాక్సిన్స్‌ను కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్, తూర్పు నావికాదళ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. 850 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లుకు గాను కేవలం 100 మెట్రిక్ టన్నుల ఎంఎల్ఓ ఉత్పత్తి అవుతుందని స్టీల్ ప్లాంట్ అధికారులు వెల్లడించారు. ఆరు నెలల్లో ప్లాంట్ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. చదవండి: కోవిడ్ కట్టడిపై ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష ముగ్గురాయి గనుల్లో పేలుడు, సీఎం జగన్ దిగ్భ్రాంతి -
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాస్ రావు అదృశ్యం కేసు
-
విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు భారీ ర్యాలీ
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వందశాతం తప్పుడు నిర్ణయం: మంచు విష్ణు
-
30వ రోజుకు చేరిన స్టీల్ ప్లాంట్ ఉద్యమం
-
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సమ్మె సైరన్
-
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికుల ఆందోళన
-
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుడివాడ అమర్నాథ్ ప్రసంగం
-
దక్షిణాది రాష్ట్రాలంటే చిన్నచూపు, హిందీ మాట్లాడని వారిపై..
సాక్షి, విశాఖ : కడప స్టీల్ ప్లాంట్..విభజన చట్టం హామీలోనే ఉందని, ఇప్పుడు దాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. దక్షిణాది రాష్ట్రాలంటే చిన్నచూపని, హిందీ మాట్లాడేవాళ్ళు మాత్రమే భారతీయులు అనే వివక్షత ఉందని ఆరోపిచంచారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పార్టీలకతీతంగా అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని విఙ్ఞప్తి చేశారు. మార్చి 5నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ సమస్యను లేవనెత్తాలని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పోస్కో కంపెనీని అడుగు పెట్టనివ్వమని సీఎం జగన్ స్పష్టం చేసినట్లు వివరించారు. సోషల్ మీడియా వేదికగా ప్రపంచంలోని తెలుగు వారందరూ ముందుకు వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి అవసరమైతే రాజీనామాకు కూడా సిద్ధమని విశాఖ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ అన్నారు. ఈ విషయంపై ఢిల్లీలో పోరాటం చేస్తామని, అక్కడ కూడా విఫలమైతే తక్షణమే పదవికి రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా పిసిసి ప్రెసిడెంట్ శైలజానాథ్ వ్యాఖ్యలకు ఎంపీ ఘాటుగా బదులిచ్చారు. స్టీల్ ప్లాంట్ కోసం కాంగ్రెస్‌కు 100 మంది ఎంపీలు ఉండి ఒక్కమాట మాట్లాడలేదని, ఈరోజు రాహుల్‌కు ఓటేయమని అడుగుతున్నారని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ రుణాలను ఈక్విటిగా మార్చాలిని డిమాండ్ చేశారు. -
స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
-
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
సాక్షి, విశాఖ : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టర్బన్ ఆయిల్ లీక్ కావడంతో స్టీల్‌ప్లాంట్ టీపీపీ-2లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్లాంట్‌లోని 1.2 మెగావాట్ల విద్యుత్ మోటర్లు దగ్ధం కావడంతో సుమారు రూ.2కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. -
వైఎస్సార్ జిల్లాలో మరో స్టీల్ ప్లాంట్
-
ఏపీలో స్విస్ కంపెనీ భారీ పెట్టుబడి!
సాక్షి, అమరావతి, జమ్మలమడుగు: రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమను నెలకొల్పి పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించే దిశగా కసరత్తు ప్రారంభమైంది. స్విడ్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ‘ఐఎంఆర్ ఏజీ’ సుమారు రూ.12 వేల కోట్లకు పైగా పెట్టుబడి, 10 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కంపెనీ ప్రతినిధులు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమై వైఎస్సార్ జిల్లాలో ప్లాంట్ ఏర్పాటుపై ఆసక్తి వ్యక్తం చేశారు. పరిశ్రమల రాకతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందని, రానున్న రోజుల్లో వైఎస్సార్ జిల్లా స్టీల్ సిటీగా రూపుదిద్దుకునేందుకు పూర్తి అవకాశాలున్నాయని ఐఎంఆర్ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. తాము ఇప్పటికే ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్, భారత్ సహా పలు దేశాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం గనుల తవ్వకాలతోపాటు విద్యుత్, ఉక్కు కర్మారాగాలను నిర్వహిస్తున్నట్లు సీఎంకు వివరించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఐఎంఆర్ ఏజీ ఛైర్మన్ హాన్స్ రడాల్ఫ్ వైల్డ్, కంపెనీ డైరెక్టర్ అనిరుధ్ మిశ్రా, సెడిబెంగ్ ఐరన్ ఓర్ కంపెనీ సీఈవో అనీష్ మిశ్రా, గ్రూప్ సీఎఫ్‌వో కార్ల్ డిల్నెర్, టెక్నికల్ డైరెక్టర్ సురేష్ తవానీ, ప్రాజెక్టŠస్ ప్రెసిడెంట్ అరిందమ్ దే, ఫైనాన్స్ డైరెక్టర్ సంజయ్‌సిన్హా , ఏపీ ఇంటిగ్రేటెడ్ స్టీల్స్ ఎండీ పి.మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. (అక్రమ మద్యం, ఇసుక అక్రమ తవ్వకాలపై సీఎం కీలక ఆదేశాలు) ఐఎంఆర్‌ఏజీ కంపెనీ ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్రహ్మణిని సందర్శించిన ఐఎంఆర్ బృందం రాష్ట్రంలో పర్యటిస్తున్న ఐఎంఆర్ ఏజీ ప్రతినిధి బృందం బ్రహ్మణి స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. స్టీల్ ప్లాంట్‌కు కేటాయించిన భూములు, నీటి వసతి, రైల్వే, విమానాశ్రయం తదితర అంశాల గురించి స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఐఎంఆర్ బృందానికి వివరించారు. రెండు స్టీల్ ప్లాంట్ల ఏర్పాటుతో రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. ఏ సహకారం కావాలన్నా అందిస్తాం: ముఖ్యమంత్రి జగన్ వైఎస్సార్ జిల్లాలో ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు వేగవంతం చేశాం. ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్ఎండీసీతో ఒప్పందం చేసుకున్నాం. ఐఎంఆర్ కూడా మరో స్టీల్‌ప్లాంట్ నెలకొల్పితే చక్కటి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుంది. కృష్ణపట్నం పోర్టుతోపాటు రైల్వే మార్గం, జాతీయ రహదారులతో మెరుగైన రవాణా సదుపాయం ఉంది. నీరు, విద్యుత్తు లాంటి మౌలిక సదుపాయాలతోపాటు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. -
ఏపీలో మరో భారీ పెట్టుబడి
-
ఏపీకి మరో భారీ పెట్టుబడి
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రానికి భారీ పెట్టుబడుల దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. వైఎస్సార్ జిల్లాలో మరో భారీ స్టీల్ ప్లాంట్ పెడతామంటూ ప్రముఖ స్విస్ కంపెనీ ఐఎంఆర్ ఏజీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు గురువారం క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. 10 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఐఎంఆర్ కంపెనీ కార్యకలాపాలను సీఎం అడిగితెలుసుకున్నారు. ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్, భారత్ సహా పలు దేశాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం లాంటి గనుల తవ్వకాలను చేపట్టడంతోపాటు విద్యుత్, ఉక్కు కర్మాగారాలను నడుతున్నామంటూ ఐఎంఆర్ కంపెనీ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. ఎలాంటి సహకారానికైనా సిద్ధం : సీఎం జగన్ వైఎస్సార్ జిల్లాలో తలపెట్టిన స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు ముమ్మరం చేశామని సీఎం వైఎస్ జగన్ ఎంఆర్ఐ ప్రతినిధులకు తెలిపారు. ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్ఎండీసీతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. ఐఎంఆర్ కూడా మరొక స్టీల్‌ప్లాంట్ పెడితే చక్కటి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందని సీఎం అన్నారు. నీరు, కరెంటు, మౌలిక సదుపాయాలు.. ఇలా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు. కృష్ణపట్నం పోర్టు, అక్కడి నుంచి రైల్వే మార్గం, జాతీయ రహదారులతో మంచి రవాణా సదుపాయం ఉందని సీఎం వారికి వివరించారు. పరిశ్రమల రాకవల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. రానున్నరోజుల్లో వైఎస్సార్ జిల్లా ప్రాంతం స్టీల్‌సిటీగా రూపాంతరం చెందడానికి పూర్తి అవకాశాలున్నాయని ఐఎంఆర్ కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఇండస్ట్రీస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్, ఐఎంఆర్ ఏజీ ఛైర్మన్ హాన్స్ రడాల్ఫ్ వైల్డ్, కంపెనీ డైరెక్టర్ అనిరుధ్ మిశ్రా, సెడిబెంగ్ ఐరన్ ఓర్ కంపెనీ సీఈఓ అనీష్ మిశ్రా, గ్రూప్ సీఎఫ్ఓ కార్ల్ డిల్నెర్, టెక్నికల్ డైరెక్టర్ సురేష్ తవానీ, ప్రాజెక్ట్స్ ప్రెసిడెంట్ అరిందమ్ దే, ఫైనాన్స్ డైరెక్టర్ సంజయ్‌సిన్హా , ఏపీ ఇంటిగ్రేటెడ్ స్టీల్స్ ఎండీ పి మధుసూదన్ పాల్గొన్నారు. చదవండి : గ్రామాల్లో బెల్టు షాపులు నడవకూడదు: సీఎం జగన్ -
స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్ధాపన చేసిన సీఎం
-
ప్రజల కల..ఉక్కు కర్మాగారం
-
అభివృద్ధి పనులకు శ్రీకారం
-
స్టీల్ ప్లాంట్‌కు శంకుస్ధాపన
-
స్టీల్ ప్లాంట్ భూముల అప్పగింతకు ఆదేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌కు 3,148.68 ఎకరాల భూమిని ముందస్తుగా అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వైఎస్సార్ కలెక్టర్‌కు అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దండ్లూరు, సున్నపురాళ్లపల్లి గ్రామాల పరిధిలో 3148.68 ఎకరాలను జీవో–571 ప్రకారం ఎకరా రూ.1.65 లక్షల ధరతో కేటాయించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. భూమిని ఏపీ హైగ్రేడ్ స్టీల్స్‌కు ముందస్తుగా అప్పగించాలని గత నెల 27న మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తక్షణమే ఏపీ హైగ్రేడ్ స్టీల్స్‌కు భూమిని అప్పగించాలని వైఎస్సార్ జిల్లా కలెక్టర్‌ను రెవెన్యూ శాఖ కార్యదర్శి వి.ఉషారాణి ఆదేశించారు. భూకేటాయింపునకు వీలుగా ప్రతిపాదనను త్వరగా భూ యాజమాన్య సంస్థ (ఏపీఎల్‌ఎంఏ)లో ఆమోదించి ప్రభుత్వానికి పంపించాలని ఆమె రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)ను ఆదేశించారు. ఈనెలలోనే వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రెవెన్యూ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జిల్లా వాసుల చిరకాల స్వప్పమైన స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి - పెద్దనందులూరు పంచాయతీల మధ్య ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 26న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయనున్నారు. 2013 కంపెనీల చట్టం ప్రకారం ఈ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరిట ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నారు. వంద శాతం పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వమే పెడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం 2019-20 బడ్జెట్లో రూ. 250కోట్లను కేటాయించారు. ఇబ్రహీంపట్నంలోని ఇన్‌క్యాప్ కార్యాలయాన్ని ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ రిజిస్టర్ కార్యాలయంగా పేర్కొన్న ప్రభుత్వం.. పరిశ్రమశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, గనుల శాఖ కార్యదర్శి కె.రామ్ గోపాల్‌ను డైరెక్టర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
అతి తెలివితో స్టీల్‌ప్లాంట్ సొత్తు చోరీ
ఉక్కునగరం(గాజువాక): రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్టు స్టీల్‌ప్లాంట్ సొత్తు దొంగల పాలు అవుతూనే ఉంది. సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంత పటిష్టంగా నిఘా ఏర్పాటు చేసినా దొంగలు విభిన్న పద్ధతుల్లో సొత్తును తరలిస్తూనే ఉన్నారు. ప్రహరీ గోడకు కన్నం పెట్టడం, గోడ లోపల నుంచి బయటకు చోరీ సొత్తును విసరడం, బైకు ట్యాంకు కింద ప్రత్యేక అమరిక ద్వారా సొత్తును తరలించడం వంటి పద్ధతుల్లో దొంగలు చోరీలు చేస్తుండేవారు. వాటిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకోవడంతో ఏకంగా శరీరానికి చుట్టుకుని రాగిని తరలిస్తుండగా శుక్రవారం ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. స్టీల్‌ప్లాంట్ కోక్ ఓవెన్ ఐదో బ్యాటరీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న నడుపూరుకు చెందిన జి.మన్మథరావు (49) సాయంత్రం 7 గంటల సమయంలో విధుల నుంచి బైక్‌పై వెళ్తున్నాడు. బీసీ గేటు వద్ద అనుమానం వచ్చి అతడిని తనిఖీ చేయగా ఆరు కేజీల బరువు గల రాగి తీగను నడుముకు చుట్టుకోవడం చూసి సీఐఎస్ఎఫ్ సిబ్బంది నివ్వెరపోయారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని స్టీల్‌ప్లాంట్ పోలీసులకు అప్పగించారు. రాగి వైరు మాత్రమే తరలించడం చూస్తే దీని వెనుక పెద్ద ముఠా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏదో ప్రాంతంలో కేబుల్ దాచి అక్కడ దాని నుంచి తీగను వేరు చేసి బయటకు తరలిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ చోరీ ఎన్నాళ్ల నుంచి ఎంత మంది చేస్తున్నారు.. ఎంత మంది ఉన్నారు అన్నది సమగ్ర దర్యాప్తు చేస్తే వాటి మూలాలు బయటపడే అవకాశం ఉంది. స్టీల్‌ప్లాంట్ పోలీసులు దీనిని కేవలం ఒక దొంగతనంగా మాత్రం కాకుండా లోతుగా దర్యాప్తు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.


