Visakhapatnam: Lovers Bike Riding in objectionable Way, Video Goes Viral - Sakshi
Sakshi News home page

విశాఖలో పట్టపగలే రెచ్చిపోయిన రొమాంటిక్‌ జంట.. రెండు గంటల్లోనే!

Dec 30 2022 5:20 PM | Updated on Dec 30 2022 6:04 PM

Vizag Lovers Bike Riding in objectionable Way Video Goes Viral - Sakshi

సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌ రహదారిలో ఓ జంట పట్టపగలు రొమాన్స్‌ చేస్తూ కెమెరాకు చిక్చిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువకుడు మరో యువతిని బైక్‌ ట్యాంక్‌పై కూర్చొపెట్టుకుని రయ్‌రయ్‌ అంటూ దూసుకుపోయారు. ఈ దృశ్యాలను పక్కనే కారులో వెళ్తున్న వ్యక్తులు వీడియో తీశారు. దీంతో పట్టపగలు బరితెగించిన ఈ యువజంట వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. తక్షణమే వారిని అరెస్ట్‌ చేయాలని ఆదేశించారు. దీంతో గాజువాక సమీప ప్రాంతాలకు చెందిన బైక్‌ నడిపిన అజయ్‌ కుమార్‌, యువతిని సంఘటన జరిగిన రెండు గంటల్లోనే అరెస్ట్‌ చేసినట్లు స్టీల్‌ ప్లాంట్‌ సీఐ వి శ్రీనివాస్‌రావు తెలిపారు. యువకుడి బైక్‌ సీజ్‌ చేశామని, న్యూసెన్స్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు.
చదవండి: Video: ‘తప్పతాగి వేధింపులు.. నడిరోడ్డుపై చెప్పుతో దంచికొట్టింది’

Advertisement
 
Advertisement
Advertisement