రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న సాకే శైలజనాథ్
రాజ్యాంగ వ్యతిరేక చర్యను అడ్డుకోవాలి
రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులపై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన సమావేశం
సాక్షి, అమరావతి: సమగ్ర ఓటర్ల సవరణ(ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని రాష్ట్రంలో నిలిపివేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయకుండానే పోలింగ్ బూత్ స్థాయి వరకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేపట్టడం చట్టవిరుద్ధమైందని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి పూనుకోవడాన్ని తప్పుబట్టారు. దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ అమలు చేయడానికి వ్యతిరేకిస్తూ సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం(ఎంబీవీకే)లో ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలని అన్ని పారీ్టలు ఎన్నికల సంఘాన్ని కలిసి వినతిపత్రం అందించాలని తీర్మానించింది. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌పై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లోనే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తోందని విమర్శించారు. ఎస్‌ఐఆర్ అమలుపై టీడీపీ, జనసేన వైఖరి స్పష్టం చేయాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.
అఖిలపక్షం ఎందుకు నిర్వహించడం లేదు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ రెండో దశ జాబితాలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ పేరును ప్రకటించలేదని, అయినా రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ అమలుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తుండడం చట్ట విరుద్ధమన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ మాట్లాడుతూ దామాషా పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని, ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
స్టీల్ ప్లాంట్ కార్మికులపై బాబు వ్యాఖ్యలు తగవు
ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నియంతృత్వం పోకడలకు అద్దంపడుతున్నాయన్నారు. ఏపీలోనూ 2024 ఎన్నికల్లో 40శాతం ఓట్లు వచి్చన వైఎస్సార్‌సీపీకి 11 సీట్లు వచ్చాయని, ఓట్లు ఎక్కువ వ
చి్చనా సీట్లు తగ్గాయని, ఈ విధానంలో మార్పు రావాలన్నారు.
ఇంకా ఈ సమావేశంలో జై భీమ్‌రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్, సిపిఐ ఎంఎల్(లిబరేషన్) నాయకులు బంగార్రాజు, ఆర్‌ఎస్‌పి నాయకులు జానకిరాములు, వీసీకే పార్టీ నాయకులు విద్యాసాగర్, ఆప్ నేత నేతి మహేశ్వరరావు, ఎస్‌యూసీఐ నాయకులు సు«దీర్, సీపీఐఎంఎల్(న్యూడెమోక్రసీ) నాయకులు రామకృష్ణ, ఎంసీపీఐయూ నాయకులు ఖాదర్ బాషా, రెడ్‌ఫ్లాగ్ నాయకులు ప్రసాద్, ఐలూ రాష్ట్ర నాయకులు సుధాకర్, భారత్ బచావో నాయకులు భాస్కరరావు మాట్లాడారు. అనంతరం విశాఖస్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సమావేశం తీర్మానించింది.


