- 20లోగా సమస్య పరిష్కరించాలి
- 21 తర్వాత రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు
- రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రత్యేకహోదా సాధన సమితి
గాంధీనగర్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి డెడ్‌లైన్ విధించింది. ఈనెల 20వతేదీన ప్రధాని నరేంద్రమోదీతో భేటి అవుతున్న చంద్రబాబు ఆయన నుంచి స్పష్టమైన ప్రకటన చేయించాలని డిమాండ్ చేసింది. ప్రత్యేక హోదా , విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని ఐవీ ప్యాలెస్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం మంగళవారం జరిగింది.
సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం సస్యశ్యామలం కాదని పదే పదే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 14నెలల కాలంలో చంద్రబాబు రాష్ట్రానికి ఏం అడిగారు.. ఇప్పటికి ఏం సాధించారు అనే అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిది సార్లు మోదీని కలిసిన చంద్రబాబు డప్పుకొట్టుకోవడం తప్ప వాస్తవానికి సాధించిదేమీ లేదన్నారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాల అన్యాయం చేస్తోందన్నారు. ఈనెల 11న జరిగిన బంద్ తర్వాత ముఖ్యమంత్రిలో చలనం వచ్చిందని, అందువల్లే ఆయన 20న ప్రధానిని కలుస్తున్నారన్నారు.
ప్రధాని మోదీ, చంద్రబాబు మధ్య ఆరోజున జరిగే సంభాషణను బహిర్గతం చేయాలని కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రకటన రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పలేదని, మూడు పంటలు పండే భూముల్లో రాజధాని ఏర్పాటు చేయొద్దని అందరూ చెప్పారని, అయినా ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తోందన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే మాత్రం ప్రణాళికా సంఘానికి ముడిపెట్టడం సరికాదన్నారు.
ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యాన జరిగే ఉద్యమాల్లో ఉద్యోగ సంఘాలు కూడా పాల్గొనాలని ఆయన కోరారు. మాజీ మంత్రి వడ్డేశోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 లో పేర్కొన్న ఆస్తుల విభజనపై రాష్ర్ట ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఆంధ్రమేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, వంగల సుబ్బారావు, లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ఈశ్వరయ్య, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గాభవాని, నగర సీపీఐ కార్యదర్శి దోనేపూడి శంకర్, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తీర్మానాలు ఇవే..
రౌండ్‌టేబుల్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీసుకున్న తీర్మానాలను ఆంధ్రమేధావులు ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ వెల్లడించారు. ఈనెల 20న ప్రధానితో సీఎం భేటి తర్వాత ఆమోదయోగ్యమైన ప్రకటన రాకపోతే 13జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని తీర్మానించినట్లు చెప్పారు. ఈనెల 21నుంచి ప్రత్యేక హోదా వలన కలిగే ప్రయోజనాలపై ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహించాలని, రాష్ట్ర శాసనసభలో ప్రత్యేక హోదాకు అనుకూలంగా తీర్మానం చేయాలని, పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఉండి పోరాడాలని, ప్రజాప్రతినిధులకు గులాబీలు ఇచ్చి నిరసన తెలియజేయాలని తీర్మానించినట్లు చెప్పారు. అప్పటికీ స్పష్టత రాకపోతే రాష్ట్ర పతికి సమస్యను విన్నవించేందుకు రాష్ట్రపతి భవన్ వద్ద నిరసన తెలియజేస్తామని వివరించారు.
ప్రత్యేకహోదాపై ప్రభుత్వాలకు డెడ్‌లైన్
Published Wed, Aug 19 2015 4:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు.. తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
నాకు జాబ్ ఇవ్వండి.. నేనే రూ.40 వేలిస్తా!
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement