రాష్ట్రం దూసుకెళ్తున్నది అప్పుల్లోనే.. | YS Jagan Fires On Chandrababu Over AP Financial Situation | Sakshi
Sakshi News home page

రాష్ట్రం దూసుకెళ్తున్నది అప్పుల్లోనే..

Nov 17 2025 3:38 AM | Updated on Nov 17 2025 6:01 AM

YS Jagan Fires On Chandrababu Over AP Financial Situation

సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ధ్వజం

తీవ్ర ఆందోళనకరంగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థి క పరిస్థితి 

2025–26 తొలి ఆరు నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం వృద్ధి 7.03 శాతమే 

గతేడాదితో పోల్చితే ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో జీఎస్టీ, అమ్మకపు పన్ను ఆదాయాల వృద్ధి 2.85 శాతమే 

2023–24 నుంచి 2025–26 మొదటి 6 నెలల్లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి రేటుతో పోల్చితే... ప్రస్తుత ఆర్థిక ఏడాది మొదటి ఆరు నెలల్లో వృద్ధి 2.75 శాతమే 

అయినా సరే రాష్ట్రం అద్భుతమైన వృద్ధి సాధిస్తోందంటూ ప్రజలను నమ్మించడానికి బాబు ప్రయత్నిస్తున్నారు 

గత రెండేళ్లలో మూలధన వ్యయం వార్షిక వృద్ధి రేటు 16 శాతం తగ్గింది 

2025–26లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం వృద్ధి 3.47 శాతమే 

కానీ.. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జీఎస్‌డీపీ వృద్ధి 10.50% అధికంగా ఉన్నట్లు ప్రకటించారు 

ఇది పూర్తిగా అవాస్తవం.. 

2019–24 మధ్య రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం వార్షిక వృద్ధి రేటు 9.87 శాతం 

అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్నుల ఆదాయం రూ.58,031 కోట్ల నుంచి రూ.92,922 కోట్లకు పెరిగింది 

ఆ ఐదేళ్లలో రాష్ట్ర జీఎస్‌డీపీ వార్షిక సగటు వృద్ధి రేటు 10.23 శాతం 

గత ఐదేళ్లతో పోల్చితే.. చంద్రబాబు పాలనలో జీఎస్‌డీపీ, పన్ను ఆదాయాల వృద్ధి చాలా తక్కువ  

మరి రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని బాబు ఎలా చెబుతారు? 

కాగ్‌ గణాంకాలను ఉటంకిస్తూ.. రాష్ట్ర 

ఆర్థిక నిర్వహణలో చంద్రబాబు సర్కార్‌ వైఫల్యాలను కడిగిపారేసిన వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు చెప్పిన దానికి విరుద్ధంగా రాష్ట్ర ఆర్థి క పరిస్థితి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికల్లోని గణాంకాలను ఉటంకిస్తూ, ఆర్థి క నిర్వహణలో చంద్రబాబు సర్కార్‌ ఘో­రంగా విఫలమైందంటూ కడిగిపారేశారు. రాష్ట్రం దూసుకుపోతున్నది కేవలం అప్పులు చేయడంలోనేనని పేర్కొన్నారు. కొసరంత ఆదాయం.. ఇసుమంత మూలధన వ్యయం.. కొండలా పెరిగిపోతున్న రుణభారం..! ఇదీ చంద్రబాబు విజన్‌..! అంటూ తన ‘ఎక్స్‌’ ఖాతాలో వైఎస్‌ జగన్‌ ఆదివారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే...

2025–26 ఆర్థి క సంవత్సరం మొదటి ఆరు నెలలకు సంబంధించి కాగ్‌ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాల వృద్ధి అత్యంత నిరాశజనకంగా ఉందన్నది స్పష్టమవుతోంది. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు చెప్పినదానికి విరుద్ధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది.  

⇒ ఆర్థిక రంగంలో టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును ఒక్కసారి పరిశీలిస్తే.. వారి ఘోర వైఫల్యాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. 2025–26 ఆర్థి క సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాల వృద్ధి కేవలం 7.03 శాతం మాత్రమే. 2025–26లోనైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కోలుకుంటుందని చాలా మంది ఆశించారు. కానీ.. కాగ్‌ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందన్నది స్పష్టం అవుతోంది. గత ఆర్థి క సంవత్సరం మొదటి ఆరు నెలలతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ), అమ్మకపు పన్ను (సేల్స్‌ ట్యాక్స్‌) ఆదాయాల వృద్ధి కేవలం 2.85 శాతం మాత్రమే.  

2023–24 నుంచి 2025–26 వరకూ రెండు ఆర్థి క సంవత్సరాల్లో మొదటి ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌)తో పోల్చితే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్నుల ఆదాయాల వృద్ధి కేవలం 2.75 శాతం మాత్రమే ఉన్నప్పటికీ రాష్ట్రం అద్భుతమైన ఆర్థిక వృద్ధి సాధిస్తోందంటూ ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం 2024–25లో జీఎస్‌డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) వృద్ధి 12.02 శాతం సాధించామని.. 2025–26లో 17.1 శాతం వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించింది.

కానీ.. ఫలితాలు అత్యంత దారుణంగా ఉన్నాయన్నది కాగ్‌ విడుదల చేసిన గణాంకాలే తేల్చి చెబుతున్నాయి. ఈ స్థాయిలో జీఎస్‌డీపీ వృద్ధి సాధించాలంటే రెండేళ్ల కాలంలో భారీ ఎత్తున పెట్టుబడులు, నిధులు వ్యయం చేయాలి. అప్పుడు జీఎస్‌డీపీలో సీఏజీఆర్‌ 14.53 శాతం అవుతుంది. దీని ఫలితంగా రెండేళ్లలో సంబంధిత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి 12–15 శాతంగా ఉంటుంది. కానీ, వాస్తవం ఏమిటంటే.. రెండేళ్లలో పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌) కేవలం 2.75 శాతం మాత్రమే. అంచనాలు ఆ స్థాయిలో ఉంటే.. వాస్తవ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. గత రెండేళ్లలో మూలధన వ్యయం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌) 16 శాతం తగ్గడం అత్యంత ఆందోళనకరం.  

⇒  2025–26 తొలి త్రైమాసికంలో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం వృద్ధి కేవలం 3.47 శాతం మాత్రమే. గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో జీఎస్టీ, అమ్మకపు పన్ను ఆదాయాలు బాగా తగ్గాయి. కానీ.. చంద్రబాబునాయుడు మాత్రం గతేడాది పోల్చితే.. 2025–26 తొలి త్రైమాసికంలో జీఎస్‌డీపీ వృద్ధి 10.50 శాతం అధికంగా ఉందని ప్రకటించారు. ఇది పూర్తిగా అవాస్తవం.

⇒ గత ఐదేళ్లలో 2019–24 మధ్య ఆంధ్రప్రదేశ్‌ సొంత పన్నుల ఆదాయం వార్షిక వృద్ధి రేటు 9.87 శాతం. రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్నుల ఆదాయం రూ.58,031 కోట్ల నుంచి రూ.92,922 కోట్లకు పెరిగింది. ఆ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ జీఎస్‌డీపీ వార్షిక వృద్ధి రేటు 10.23 శాతంగా ఉంది. గత ఐదేళ్లలో జీఎస్‌డీపీ వృద్ధి, పన్ను ఆదాయాల వృద్ధితో పోల్చితే టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో జీఎస్‌డీపీ, పన్ను ఆదాయాల వృద్ధి తక్కువగా ఉందన్నది స్పష్టమవుతోంది. అయినప్పటికీ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు ఎలా చెప్పగలరు?

⇒ రాష్ట్రం దూసుకుపోతున్నట్లు కనిపించే ఏకైక అంశం అప్పుల విషయంలోనే. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏకంగా రూ.2,06,959 కోట్లు అప్పులు చేశారు (వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో.. టీడీపీ కూటమి సర్కారు 17 నెలల్లోనే 62 శాతం అప్పు చేసింది). 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement