సాక్షి, తాడేపల్లి: ఏపీ ఆర్ధిక పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు చెప్పిన దానికి విరుద్దంగా ఆర్థిక పరిస్థితి ఉందని జగన్ తెలిపారు. కాగ్ నివేదికలను ఉటంకిస్తూ వైఎస్ జగన్ వివరాలను ఎక్స్‌లో పోస్టు చేశారు. తక్కువ ఆదాయ వృద్ధి, తక్కువ మూలధన పెట్టుబడి, పెరిగి పోతున్న రుణభారం అంటూ జగన్ పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరకరంగా మారింది. కాగ్ విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సంపద సృష్టిస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు చెప్పిన దానికి విరుద్దంగా పరిస్థితి ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును గమనిస్తే వారి వైఫల్యాలు స్పష్టంగా కనపడతాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి కేవలం 7.03% మాత్రమే ఉంది. 2025-26లోనైనా రాష్ట్రం ఆర్థికంగా కోలుకుంటుందని చాలామంది ఆశించారు.

కానీ, కాగ్ విడుదల చేసిన గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. సొంత ఆదాయాలు ఏమాత్రం పెరగకపోగా, మూలధన పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గిపోతుంది. అయినప్పటికీ రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతుందంటూ ఎలా ప్రచారం చేస్తారు?. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌డీపీ వృద్ధిని 12.02%గా ప్రభుత్వం ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆ వృద్ధిని 17.1%గా లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఫలితాలు దారుణంగా ఉన్నట్లు కాగ్ నివేదికలే తేల్చి చెప్తున్నాయి. సంపద సృష్టి లేకపోవటంతో రాష్ట్రం తిరోగమనంలో ఉంది. కానీ, అభివృద్దిలో వేగంగా పరుగులెత్తుతోందంటూ ఎలా మాట్లాడతున్నారు?’ అని ప్రశ్నించారు.
𝙇𝙤𝙬 𝙍𝙚𝙫𝙚𝙣𝙪𝙚 𝙂𝙧𝙤𝙬𝙩𝙝, 𝙇𝙤𝙬 𝘾𝙖𝙥𝙚𝙭 𝙖𝙣𝙙 𝙍𝙞𝙨𝙞𝙣𝙜 𝘿𝙚𝙗𝙩 - 𝙏𝙝𝙚 𝙑𝙞𝙨𝙞𝙤𝙣 𝙤𝙛 @ncbn 𝙂𝙖𝙧𝙪
The figures released by the CAG for first half of FY 2025-26 reveal a very discouraging growth of State Government revenues. This is quite contrary to the… pic.twitter.com/aQSOlWz7uL— YS Jagan Mohan Reddy (@ysjagan) November 16, 2025


