అస్వస్థతకు గురైన విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు
పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న వెంటనే కడుపునొప్పి, వాంతులు
అన్నమయ్య జిల్లా రాయవరం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఘటన
సుండుపల్లె: అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని సుండుపల్లె మండలం రాయవరం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం కలుషితమై 34 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న అనంతరం వీరంతా కడుపునొప్పి, వాంతులతో ఇబ్బందులుపడ్డారు. వెంటనే ఉపాధ్యాయులు వారిని రాయవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుల ద్వారా సమాచారం అందుకున్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి.. రాజంపేట సబ్ కలెక్టర్ భావన, డీఎంహెచ్‌వో, స్థానిక వైద్యులతో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ శేఖర్‌రెడ్డి తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ భావన పాఠశాలను సంద
ర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. పీహెచ్‌సీ వైద్యులతో మాట్లాడి విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలు, వారి పరిస్థితి తెలుసుకున్నారు. ఆహార తనిఖీ అధికారి పాఠశాలలో విద్యార్థులకు వడ్డించిన ఆహారాన్ని పరీక్షించారు.


