కొత్త సంవత్సర శుభాకాంక్షల లింకులతో జాగ్రత్త
ఒక్క క్లిక్‌తో మొత్తం ఊడ్చేస్తారు
శ్రీకాకుళం క్రైమ్ : ఏడాది మారుతోంది. డిసెంబర్ 31 మొదలుకుని జనవరి 1 వరకు లెక్కలేనన్ని మెసేజీలు సెల్‌ను తాకుతాయి. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరిట ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్‌ల ద్వారా సందేశాలు వస్తా యి. వీటితోనే ప్రమాదం పొంచి ఉంది తెలియని సైట్లపై ఏమరపాటుగా క్లిక్ చేసినా మన అకౌంట్లలో నగదు క్షణాల్లో మాయమవుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
చీటింగ్ ఇలా..
న్యూ ఇయర్ సందర్భంగా మొబైల్‌లో వచ్చే రకరకాల చిత్రాలు, సందేశాల పేర్లతో సహా తయారుచేసుకుని మెజేస్ పంపుతారు. మీకు నచ్చేవిధంగా మీ పేరుతో గ్రీటింగ్స్, సందేశాలను పంపుకోవచ్చని, ఫలానా లింక్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని అంటారు.
మన మొబైల్‌లో టెలిగ్రామ్, వాట్సాప్‌లను ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్) ఫైల్స్ రూపంలో మె సేజ్‌లను పంపిస్తారు. పొరపాటున ఆ లింక్‌ను క్లిక్ చేస్తే అంతే సంగతులు. మన ఫోన్‌లో సమాచారమంతా వారికి పోతుంది. కాంటాక్ట్ నంబర్లు, ఫొటో లు, వీడియోలు, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలే కాక డాక్యుమెంట్ ఫైళ్లు సైతం వీరికి చేరిపోతాయి.
వెరిఫై చేసుకోవాలి..
రకరకాల గిఫ్ట్ ఓచర్లు, గ్రీటింగ్స్, ట్రావెల్, గాడ్జెట్స్, ఫ్యాషన్లపై ఇచ్చే డిస్కౌంట్లను ఒకటికి రెండుసార్లు నమ్మదగినవా కాదా అన్నది వెరిఫై చేసుకోవాలి. వాటి రివ్యూస్ చూస్తూ వెరిఫైడ్, అథెంటిక్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆఫర్లను తెలుసుకునేందుకు ప్రయతి్నంచాలి.
కొత్త బృందాలు ఏర్పాటు
శ్రీకాకుళం జిల్లాలో 2025లో వైట్ కాలర్ నేరాలు 171 నమోదయ్యాయి. సైబర్ నేరాల్లో బాధితులకు అందించే రికవరీ సొమ్ము రాబట్టుకునేలా ఇక కృషి చేస్తాం. ఆన్‌లైన్ నేరాలను ఛేదించేందుకు ఇప్పటికే కొత్త బృందాలను ఏర్పాటు చేశాం. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, సైబర్ క్రైమ్ సెల్‌తో సమన్వయం చేసుకుని 1930హెల్ప్‌లైన్ ఆన్‌లైన్ పోర్టల్ నిర్వహిస్తాం. విద్యాసంస్థల్లో, గ్రామాల్లో అవగాహన కల్పిస్తాం. – శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి
జాగ్రత్తలు తప్పనిసరి..
» అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయరాదు.
» ఫోన్‌లోని సెట్టింగ్‌లో ఇన్‌స్టాల్ ఫ్రం అన్‌నోన్ సోర్సెస్ అనే ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకు తెలియకుండా యాప్స్ ఇన్‌స్టాల్ కావు.
» మొబైల్ సెట్టింగ్‌లో ఫోన్ నంబర్లను యాక్సిస్ చేసే అనుమతి ఇవ్వరాదు.
» తెలియని ఏపీకే ఫైల్స్, మాల్‌వేర్స్ ఇన్‌స్టాల్ అయితే ఫోన్‌ను రీసెట్ చేయాలి.
» ఈ–మెయిల్స్, టెక్ట్స్æ, ఇతర సోషల్ మీడియా యాప్‌ల ద్వారా నకిలీ లింక్స్‌ను గుర్తించాలి. వాటిని క్లిక్ చేయకుండా జాగ్రత్త పడాలి.
» గివ్ అవేస్ పోటీల ద్వారా వినియోగదారులను ట్రాప్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని దోచేస్తారు. మన వివరాలను సేకరించి డార్క్‌వెబ్‌కు అమ్మేస్తారు.
» మన మొబైల్, ల్యాప్‌టాప్ (కంప్యూటర్)లలో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీ వైరస్ ప్రోగ్రామ్, అధికారిక యాప్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి.


