చంద్రబాబుకు గుడివాడ అమర్నాథ్‌ కౌంటర్‌ | Gudivada Amarnath counter to Chandrababu over CII summit | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు గుడివాడ అమర్నాథ్‌ కౌంటర్‌

Nov 16 2025 5:41 PM | Updated on Nov 16 2025 9:15 PM

Gudivada Amarnath counter to Chandrababu over CII summit

సాక్షి,విశాఖ: సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కౌంటర్‌ ఇచ్చారు. గతంలో మూడు సార్లు ఇలానే సీఐఐ సదస్సులు నిర్వహించారు. 2014-19 మధ్యలో లక్షకోట్లు పెట్టుబడులు వస్తాయని నమ్మించారు. మొత్తం మీద 35వేలకోట్లు మాత్రమే రూపాంతరం చెందాయి. లక్షల ఉద్యోగాలు వస్తాయని యువతకి లేని పోని ఆశలు పెట్టి నమ్మించి మోసం చేశారు.

మా ప్రభుత్వంలో సదస్సు నిర్వహించాం. కానీ పారదర్శంగా ఎంవోయూలు కుద్చుకోవాలని వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సీఐఐ సదస్సులో కొత్తగా ఏం తీసుకొచ్చారో క్లారిటీ ఇవ్వలేకపోయారు. వైఎస్ జగన్ హాయంలో 2023లో గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు జరిగింది. వైఎస్ జగన్ హయాంలో కుదుర్చుకున్న సంస్థలతో చంద్రబాబు మళ్లీ ఒప్పందాలు చేసుకుంటున్నారు.

 వైఎస్సార్‌సీపీ పాలనలో పారిశ్రామిక వేత్తలు బెదిరిపోయారని చంద్రబాబు చెప్పారు. వైఎస్సార్‌సీపీ పాలనలో బెదిరిపోయిన పారిశ్రామిక వేత్తలు ఎవరో చెప్పాలి. నాడు జరిగిన పారిశ్రామిక వేత్తల సమావేశంలో వైఎస్‌ జగన్‌తో పాటు ముకేష్ అంబానీ, అదానీ, దాల్మియా నవీన్ జిందాల్, ఒబారిస్ సంజయ్ బంగర్, భజంక, బీవీఆర్‌ మోహన్ రెడ్డి,జీఎంఆర్‌ వంటి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు వేదికపై కూర్చున్నారు. 

కానీ ఇవాళ సీఎం చంద్రబాబుతో వేదికపై రాష్ట్ర కేబినెట్ మంత్రులు కూర్చున్నారు.  దీనీ ద్వారా పారిశ్రామిక వేత్తలకు వైఎస్‌ జగన్ మీద నమ్మకం ఉన్నట్టా, చంద్రబాబు మీద నమ్మకం ఉన్నట్టా. తండ్రీకొడుకులు ఒకరు ఒకరు తబలా కొట్టుకోవడానికి వందల కోట్లు ఖర్చు చేశారు. రెన్యూ సంస్థ 2022 ఏడాదిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. పాత సినిమాకు చంద్రబాబు కొత్త పేరు పెట్టారు. చంద్రబాబు పారిశ్రామిక వేత్తలను బెదిరించి అబద్ధాలు చెప్పించారు. 

లులు ఛైర్మన్ చంద్రబాబు ఆస్థాన విద్వాసంసుడు. ఏ సదస్సు జరిగిన లులు అధినేత కనిపిస్తారు. లులు సంస్థ పేరు 2014 నుంచి చెపుతున్నారు. ఇప్పటికి కనీసం ఒక బిల్డింగ్ కూడా కట్టలేదు. మా హయంలో వచ్చిన ఇనార్బిట్ మాల్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. వైఎస్ జగన్ కట్టిన పోర్టులను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. కరణ్ అదానీ గూగుల్ డేటా సెంటర్ ఎవరి హయంలో వచ్చిందో చెప్పారు. సముద్రతీరంలో వైఎస్ జగన్ పోర్టులు కడితే.. మీరు బికినీ పెస్టివల్ ఎలా నిర్వహించాలని ఆలోచించారు.

స్టీల్ ప్లాంట్ కోసం అడిగితే జర్నలిస్ట్ మీద చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రెస్టేషన్ చూస్తే స్టీల్ ప్లాంట్‌ను ఏదొకటి చేసేలా ఉన్నారు. ప్రొడక్షన్ బట్టి జీతం ఇస్తామని సర్క్యులర్ ప్రవేశ పెడతారా. దేశంలో ఎక్కడైనా ఇటు వంటి పరిస్థితి ఉందా. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ లో 5000 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. ఉన్న ఉద్యోగులను కాపాడలేని మీరు, రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారా.? వైఎస్‌ జగన్ పాలనలో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది కాబట్టి, చంద్రబాబు 13 లక్షల కోట్ల పెట్టుబడులు అని లెక్కలు చెప్పారని ధ్వజమెత్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement