సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబుపై స్టీల్‌ప్లాంట్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్‌ప్లాంట్‌పై సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నామని.. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రొడక్షన్‌ను బట్టి జీతాలు ఇస్తామనే సర్క్యూలర్‌ను రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ నష్టానికి కార్మికులు కారణం కాదు. సొంతంగా గనులు లేకపోవడమేనన్నారు.
‘‘దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా గనులు ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా గనులు లేవు. చంద్రబాబు పీపీపీ అంటే ప్రజలు ఛీ.. ఛీ.. ఛీ. అంటున్నారు. చంద్రబాబు దృష్టి అంతా ప్రైవేటీకరణ మీదే ఉంది. విద్యా వైద్య రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్యాకేజీ వలన కార్మికులకు స్టీల్ ప్లాంట్‌కు ఎలాంటి ప్రయోజనం లేదు’’ అని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేత అన్నారు.
వైఎస్సార్‌సీపీ నేత కేకే రాజు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు నయవంచనకు పాల్పడుతున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్‌ను కాపాడతామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కార్మికులపై నెపాన్ని నెట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం’’ అని కేకే రాజు పేర్కొన్నారు.


