
సాక్షి, విశాఖపట్నం/అనకాపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ నాయకులు కురసాల కన్నబాబు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాజకీయ పార్టీలకు ఉండే హక్కులను హరిస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కక్ష సాధిస్తోంది. విశాఖ ఎయిర్‌పోర్టు మొదలుకుని ప్రతీ చోటా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. మాజీ సీఎం కాన్వాయ్ వెనుక పార్టీ నాయకుల వాహనాలను అనుమతించడం లేదు. ప్రతీ చోటా ఆంక్షలు, నియంత్రణలు పెడుతున్నారు. అనకాపల్లి నుంచి మాకవరపాలెం వరకూ ప్రజలెవ్వరినీ రానివ్వడం లేదు.
ప్రజలను అడ్డుకునేందుకు దాదాపు మూడు వేల మంది పోలీసులను పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. రాజకీయ పార్టీలకు ఉండే హక్కులను హరిస్తున్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ప్రజా సమస్యలపై గలమెత్తితే సహించలేని పరిస్థితి కూటమి నేతలతో ఏర్పడింది. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు అని ఘాటు విమర్శలు స్తున్నారు.