స్టీల్‌ ప్లాంట్ ప్రమాదంలో.. పదికి చేరిన మృతుల సంఖ్య | Visakhapatnam Steel Plant Tragedy, Death Toll Rises To 10 After Another Worker Dies In Hospital | Sakshi
Sakshi News home page

స్టీల్‌ ప్లాంట్ ప్రమాదంలో.. పదికి చేరిన మృతుల సంఖ్య

Jun 13 2026 2:08 PM | Updated on Jun 13 2026 5:50 PM

Death toll in Vizag Steel accident rises to ten

సాక్షి,విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య పదికి చేరుకుంది. సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డి.సూరిబాబు అనే స్టీల్‌ ప్టాంట్‌ ఉద్యోగి మృతిచెందారు. కాగా ఇటీవలే విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉక్కు ద్రవం కార్మికులపై పడి తొమ్మిది మంది మృతిచెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. తాజాగా మరొకరు మరణించడంతో ఆ సంఖ్య పదికి చేరుకుంది.

కాగా (సోమవారం) సాయంత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ లో  ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధానంగా ప్లాంట్ ఎస్ఎంఎస్‌ -2లో హాట్‌మెంట్ బకెట్లు కూలి ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదం సమయంలో ఎనిమిది మంది కార్మికులు ఘటనా స్థలంలో మృతిచెందారు, చికిత్స పొందుతు మరోకరు, తాజాగా  సూరిబాబు అనే కార్మికుడు మృతిచెందారు. 

ప్లాంట్ లోపల భారీగా మంటలు చెలరేగడంతో అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే యత్నం చేశారు.  ప్రమాదానికి కారణం మెటల్‌ లిక్విడ్ పేలడం అని తెలుస్తోంది. 1500 డిగ్రీల వేడితో వెళుతున్న మెటల్‌ లిక్విడ్‌ పేలడం వల్ల ప్రమాదం జరిగింది. 

గతంలోనూ  పలుమార్లు స్టీల్‌ ప్లాంట్‌లో ప్రమాదాలు జరిగాయి. గతేడాది స్టీల్‌ మెల్టింగ్‌ మిషన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో హైడ్రాలిక్‌ ఆయిల్‌ లీకై మంటలు చెలరేగాయి. ఫైర్‌ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేయడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా ఈ సారి ప్రమాదంలో పదిమంది కార్మికులు మృతిచెందారు. 

స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 10కి చేరిన మృతుల సంఖ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement