ఎల్లుండి తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన | YS Jagan will tour the East Godavari district Tour details | Sakshi
Sakshi News home page

ఎల్లుండి తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

Aug 3 2026 9:26 PM | Updated on Aug 3 2026 9:26 PM

YS Jagan will tour the East Godavari district Tour details

సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం (ఆగస్టు5) తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్ల తీరును పరిశీలించడంతోపాటు పొగాకు రైతులతో నేరుగా మాట్లాడనున్నారు.

పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం 9.30 గంటలకు  వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, ఉదయం 10.30 గంటలకు దేవరపల్లి చేరుకుంటారు. అక్కడి పొగాకు కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న కొనుగోళ్లను పరిశీలిస్తారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించి, పంట సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలను అడిగి తెలుసుకుంటారు. రైతుల సమస్యలు, ఇబ్బందులపై వారితో నేరుగా చర్చిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement