పార్సిల్‌ వ్యాన్‌లో కరెన్సీ కట్టలు? | huge cash seized from parcel van | Sakshi
Sakshi News home page

పార్సిల్‌ వ్యాన్‌లో కరెన్సీ కట్టలు?

Aug 3 2026 1:33 PM | Updated on Aug 3 2026 1:33 PM

huge cash seized from parcel van

తమిళనాడు: చెంగుండ్రమ్‌ సమీపంలోని పడియనల్లూరు, మోండియం మన్నగర్‌లో ఓ పోలీస్‌ చెక్‌పాయింట్‌లో చెన్నై వైపు వెళ్లే అన్ని వాహనాలను చెంగుండ్రమ్‌ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం పడియనల్లూరులోని పోలీస్‌ చెక్‌పాయింట్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ నుంచి చెన్నై వెళుతున్న ఒక ప్రైవేట్‌ కొరియర్‌ పార్సిల్‌ వ్యాన్‌ను పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అనుమానంతో పోలీసులు వ్యాన్‌లోని కొరియర్‌ పార్సిళ్ల మధ్య దాచి ఉంచిన మూడు హ్యాండ్‌బ్యాగులను తనిఖీ చేయగా, ఒక్కొక్కదానిలో మొత్తం రూ.1.08 కోట్ల నగదు లభ్యమైంది. 

వ్యాన్‌లో వచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రవీణ్‌ (36)ను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన పవన్‌ (28), వ్యాన్‌ డ్రైవర్‌ రాంబాబు (40)ను విచారించారు. చెన్నైకి వస్తున్న పార్సిల్‌ వ్యాన్‌లో ప్రవీణ్, పవన్‌ లిఫ్ట్‌ అడిగా­రని, చెన్నైలో బంగారు ఆభరణాలు కొనడానికి రూ.1.08 కోట్ల నగదును తీసుకువెళ్తున్నట్టు వారు గుర్తించారు. అయితే అరెస్టు అయిన ఆ ఇద్దరి వద్ద రూ.1.08 కోట్లకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేవు. అరెస్టు చేసిన ఇద్దరిపై విచారణ పూర్తి చేశామని, స్వాధీనం చేసుకున్న నగదుతో పాటు వారిని త్వరలో చెన్నైలోని ఐటీ అధికారులకు అప్పగిస్తామన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement