పుష్ప సినిమా స్టైల్లో హవాలా డబ్బు రవాణా చేస్తున్న ముఠాను హైదరాబాద్ బోయిన్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. కారులో భారీగా నగదు తరలిస్తున్నారని తెలుసుకొని.. బోయిన్‌పల్లి నుంచి శామీర్‌పేట్ వరకు ఛేజ్ చేశారు. కారు తెరిచి చూడగా డిక్కీ, టైర్లు, బానెట్, సీట్లలో దాచిన రూ.4 కోట్లు కనిపించాయి. గతేడాది హవాలా డబ్బుతో పరారైన వ్యక్తి ఇవాళ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు తెలియడంతో పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. ముఠా సభ్యులు పారిపోవడానికి ప్రయత్నించడంతో.. పోలీసులు 15కిమీ ఛేజింగ్ చేసి పట్టుకున్నారు.


