జంగిల్‌ రాజ్‌.. తలుపులు పగులగొట్టి అర్ధరాత్రి అరెస్టులా?: భరత్‌ ఫైర్‌ | YSRCP Margani Bharat Serious Comments On CBN Govt | Sakshi
Sakshi News home page

జంగిల్‌ రాజ్‌.. తలుపులు పగులగొట్టి అర్ధరాత్రి అరెస్టులా?: భరత్‌ ఫైర్‌

Aug 3 2026 12:08 PM | Updated on Aug 3 2026 12:25 PM

YSRCP Margani Bharat Serious Comments On CBN Govt

సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో జంగిల్‌ రాజ్‌ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు మాజీ ఎంపీ మార్గాని భరత్‌. అర్ధరాత్రి తలుపులు పగులగొట్టి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎల్లప్పుడూ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండరు.. పోలీసులు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

మాజీ ఎంపీ మార్గాని భరత్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతలు వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్టు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. అర్ధరాత్రి అరెస్టులు ఎందుకు?. కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు?. ఎల్లప్పుడూ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండరు.. మీరు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే సోదరుడి చేయి విరగొట్టారు. చంద్రబాబు డైరెక్షన్‌లో కేవలం బీసీ నేతలపైనే దాడులు జరుగుతున్నాయి

కారుమూరి సునీల్, విరూపాక్షి, సీదిరి అప్పలరాజు.. ఇలా బీసీ నేతలందరినీ అరెస్టు చేస్తున్నారు. బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఈ అరెస్టులు జరుగుతున్నాయి. అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు... కచ్చితంగా పోలీసులు కూడా మూల్యం చెల్లించుకుంటారు. చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న పోలీసులను న్యాయస్థానం ముందు నిలబెడతాం. పొగాకు రైతులకు అండగా ఉండేందుకు ఈనెల ఐదో తేదీన వైఎస్‌ జగన్ దేవరపల్లి టొబాకో బోర్డుకి వస్తారు.

డబల్ ఇంజిన్ సర్కార్ అని చెబుతున్న కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది?. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి కూటమి నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా 2019లో శిలాఫలకం టీడీపీ ప్రభుత్వం వేసేసింది. 2900 ఎకరాలు వైఎస్సార్‌సీపీ హయాంలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఇచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement