వాతావరణ శాఖ అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగు హెచ్చరికలు | Lightning warnings issued for several districts in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వాతావరణ శాఖ అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగు హెచ్చరికలు

Aug 3 2026 5:03 PM | Updated on Aug 3 2026 5:13 PM

 Lightning warnings issued for several districts in Andhra Pradesh

సాక్షి, అమరావతి: రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, మన్యం,కాకినాడ,కోనసీమ,తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అక్కడక్కడ  పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 

ప్రధానంగా రానున్న మూడుగంటల్లో అరకు, చింతపల్లె, నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్లకూడదని సూచించింది. చెట్లకింద హోర్డింగుల వ‍ద్ద నిల్చోకూడదని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement